
ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు.. ఓ వ్యక్తి అరెస్టు!
బెంగళూరు: మైసూర్ రాజు టిప్పూ సుల్తాన్ గురించి సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఓ వ్యక్తిని కర్ణాటక పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మధ్య కర్ణాటకలోని కొప్పల పట్టణానికి చెందిన మంజునాథ్ ముద్గల్ ఐటీఐ విద్యార్థి. అతను తన ఫేస్‌బుక్ ఖాతాలో టిప్పూ సుల్తాన్ ఫొటోలు పెట్టి.. ఆయనను అవమానపరిచే వ్యాఖ్యలు చేశాడు.
గతంలోనూ అతను ముస్లిం రాజైన టిప్పూ సుల్తాన్ ఫొటోలు అభ్యంతరకరంగా పోస్టు చేశాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఇది స్థానికంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించవచ్చని భావించిన పోలీసులు మంజునాథ్‌ను అరెస్టు చేశారు. ఫేస్‌బుక్ అకౌంట్‌లోని ఫొటోలన్నింటినీ తొలగించాలని అతన్ని ఆదేశించారు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.