ఫేస్‌బుక్‌లో బెదిరింపులు.. యువకుడు అరెస్టు | youngman threats to young girl in facebook, arrested | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో బెదిరింపులు.. యువకుడు అరెస్టు

Published Sat, Feb 10 2018 8:11 PM | Last Updated on Tue, Aug 28 2018 7:24 PM

youngman threats to young girl in facebook, arrested - Sakshi

సాక్షి, క్రిష్ణగిరి: తనను పెళ్లిచేసుకోవాలని ఓ యువతిని యువకుడు ఫేస్‌బుక్‌లో బెదిరించాడు. ఈ సంఘటన కర్ణాటకలోని క్రిష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ఆ యువకుడిని బారూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలివి.. జిల్లాలోని పుళియూర్‌ గ్రామానికి చెందిన భగవత్‌ సింగ్‌(22)  మరోగ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆమె సమీపంలోనిఓ ప్రైవేట్‌ పరిశ్రమలో పనిచేస్తుంది. ఆ యువకుడు ఉదయం, సాయంత్రం ఆమె వెంటపడి వేధించేవాడు. 

అయితే ఆ యువతి అతనితో పెళ్లికి నిరాకరించడంతో ఆమె ఫొటోను ఫేస్‌బుక్‌లో పెట్టి తనను పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. ఈ సంఘటనపై ఆమె తల్లిదండ్రులు బారూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భగవత్‌సింగ్‌ అరెస్టు చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement