బనశంకరి: కర్ణాటకలో పాఠశాల పుస్తకాల్లో మొఘల్ చక్రవర్తుల పాఠ్యాంశాలు చరిత్రలో కలిసిపోనున్నాయి. టిప్పు సుల్తాన్ పాఠాలను గతంలోనే తొలగించారు. మొఘలుల చరిత్రను తొలగించి, ఆ స్థానంలో దేశం కోసం పోరాడిన హిందూ రాజుల చరిత్రకు పెద్దపీట వేయాలని తీర్మానించినట్లు కర్ణాటక పాఠ్య పుస్తక పునః రచనా సమితి అధ్యక్షుడు రోహిత్ చక్ర తీర్థ బుధవారం తెలిపారు.
‘ఐదు దశాబ్దాలకుపైగా రాజ్యపాలన చేసిన మేటి హిందూ రాణి చెన్న బైరాదేవికి సంబంధించిన పాఠ్యాంశాలకు పుస్తకాల్లో చోటు దక్కలేదు. ఈ అసమానతలను సరిదిద్దే కార్యక్రమాన్ని తమ కమిటీ చేపడుతోంది’ అని చక్ర తీర్థ తెలిపారు. (చదవండి: విషాదం.. పరీక్ష హాల్‌లో కుప్పకూలిన అనుశ్రీ)
Comments
Please login to add a commentAdd a comment