
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక తరగతుల విద్యార్థులను చిన్న చిన్న కథలతో ఆకట్టుకునేందుకు, విజ్ఞానాన్ని అందించేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. టీచర్లు చెప్పేది వినడం, చదవడం కన్నా అంశాలను మాటలు, పాటల రూపంలో వింటే వారిలో మరింత ఆసక్తి పెంచొచ్చని మాట్లాడే పుస్తకాలను అందుబాటులోకి తేనుంది.
యూనిసెఫ్ రూపొందించిన ఈ పుస్తకాలను ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 200 పాఠశాలలకు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు పాఠశాల విద్య కమిషనర్ కిషన్ వెల్లడించారు. వీటిని తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ముద్రించినట్లు వెల్లడించారు. 10 రకాల అంశాలపై 100 పుస్తకాలను ముద్రించారని, ఒక్కో అంశంపై 10 పుస్తకాలున్నట్లు తెలిపారు. స్వచ్ఛ పర్యావరణం, హరిత పర్యావరణం, బాల కార్మికులు, వ్యక్తిగత పరిశుభ్రత, వ్యక్తిగత భద్రత, బాలికా విద్య, జీవన నైపుణ్యాలు, పెంపుడు జంతువులు, నీటి వనరుల నిర్వహణ, సమతుల ఆహారంపై ముద్రించారు.
ఎలా పని చేస్తుందంటే..
డాల్ఫియో టాకింగ్ పెన్ (రీడర్) సహాయంతో పుస్తకంలోని అంశాలు మాటల రూపంలో వినబడతాయి. పేజీలోని అంశాలపై పెన్నును పెడితే ఆ అంశం మా టల రూపంలో వినిపిస్తుంది. అది పాట అయితే పా ్డ్డ్డటగా, కవిత అయితే కవితగా, కథ అయితే కథ చెప్పినట్లుగానే వినిపిస్తుంది. ఏ పదంపై పెడితే అంతవరకే వినిపించేలా లేదా ఒక వరుసపై పెడితే ఆ మొత్తం చదివేలా రీడర్‌లో మార్పులు చేసుకోవచ్చు. బొమ్మల వద్ద ఉంచితే వాటి సంభాషణ కూడా వినొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment