
‘టిప్పు’ అంత గొప్పవాడేం కాదు
కర్ణాటకలో జయంతి వేడుకలపై సుబ్రమణ్య స్వామి
బెంగళూరు: టిప్పు సుల్తాన్ ఫ్రెంచ్ పాలకులకు సర్వేంట్‌గా పనిచేశారని, జయంతి వేడుకలు జరుపుకోవాల్సినంత గొప్పవాడేం కాదని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి పేర్కొన్నారు. నేతాజీపై ఓపెన్ ఫోరమ్ కార్యక్రమానికి హాజరయిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 18వ శతాబ్దంలో టిప్పు మైసూర్ పాలించడం తప్ప, ప్రజారంజక పాలన అందించినట్లు ఎక్కడా లేదని అన్నారు. టిప్పు.. తనకు తానుగా బ్రిటీష్ పాలకులపై పోరాడలేదని, ఫ్రెంచ్ వారి ప్రోద్బలంతోనే అది జరిగిందని స్వామి చెప్పారు.
ఇదిలా ఉండగా.. మహాత్మా గాంధీ, సుభాష్‌చంద్రబోస్‌తో పాటు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్‌దయాళ్ ఉపాద్యాయల మరణం కేసులపై పునర్విచారణ జరిపించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.