
ప్రజా ప్రతినిధులా.. జాగీర్దారులా?
- టీజేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో కోదండరాం ఆగ్రహం
- తెలంగాణ వచ్చాక సమస్యలు పోతాయనుకుంటే పెరుగుతున్నాయి
సాక్షి, హైదరాబాద్: పాలకులు అధికారాన్ని ప్రజల సమస్యల పరిష్కారానికి కాకుండా గతంలో జాగీర్దార్లులా తమ వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ధ్వజమె త్తాతరు. తెలంగాణ జేఏసీ విస్తృత స్థాయి సమా వేశం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మానాలు, భవిష్యత్ కార్యా చరణను కోదండరాం మీడియాకు వివరిస్తూ, పాలక పక్ష నేతలు ప్రజాప్రతినిధులుగా సమస్యలపై దృష్టిలేకుండా వ్యక్తిగత ప్రయోజనాలకు అధి కారాన్ని సాధనంగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ వస్తే ప్రజాస్వామ్య పాలన ఏర్పడుతుందని ఉద్యమ సమయం లో ఆశించామని, అయితే అందుకు భిన్నంగా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంద న్నారు. ప్రజల సమస్యలు పెరిగిపో తున్నా యని, ఈ నేపథ్యంలో తాము ప్రజల దగ్గరకే వెళతామని, వాస్తవాలను వివరిస్తామన్నారు.
డిజైనింగ్‌తో కాంట్రాక్టర్లకే మేలు..
సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్ వల్ల అంచనాలు, ఖర్చులు పెరిగి కాంట్రాక్టర్లకు మేలు జరుగుతుంది తప్ప ప్రజలకు ఉపయోగం లేదని కోదండరాం అన్నారు. ఈ సమా వేశంలో జేఏసీ కన్వీనర్ కె.రఘు, నేతలు గురజాల రవీందర్‌రావు, గోపాలశర్మ, ఇటికాల పురుషోత్తం, వెంకటరెడ్డి, బైరి రమేశ్, జిల్లాల నేతలు, రాష్ట్ర బాధ్యులు పాల్గొన్నారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు
- కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతం, కేజీ టు పీజీదాకా ఉచితనిర్బంధ విద్య అమలుకోసం ఏప్రిల్‌లో జిల్లాల సదస్సులు, ధర్నాలు ఊ మే నెల నాటికి జేఏసీ గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు
- జూన్ 21 నుంచి బతుకు తెలంగాణ సాధనకై జయశంకర్ స్ఫూర్తి యాత్ర