టుడే న్యూస్‌ రౌండప్‌ | today news roundup | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Published Wed, Jul 5 2017 5:41 PM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM

నేటి వార్తావిశేషాలు..




నేటి వార్తావిశేషాలు..

‘లోకేశ్‌.. మీ నాన్నను జైలుకు పంపిస్తా’
చంద్రబాబు, లోకేశ్‌ బెదిరింపులకు తాను భయపడబోనని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు.

‘త్వరలో జైలుకు చంద్రబాబు’
జైలు అనే మాట వింటే సీఎం చంద్రబాబు భయపడుతున్నారని వైఎస్సార్‌ సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు.

కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీహెచ్‌డీ ఫలితాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు.

<<<<<<<<<<<<<<<<  అంతర్జాతీయం  >>>>>>>>>>>>>>>>

అమెరికాపై కిమ్‌ తీవ్ర అసభ్య పదజాలం..!
ఖండాతర బాలిస్టిక్‌ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన ఉత్తర కొరియా అమెరికాకు పుండుమీద కారం చల్లేరీతిలో వ్యాఖ్యలు చేసింది.

చైనా ముందు భారత తుపాకులు తుస్సు....
సిక్కిం సరిహద్దుల్లో భారత్, చైనా దేశాలకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైనాకు పోటీగా భారత్‌ మాటల తూటాలను పేలుస్తోంది.

ప్లాన్ చేసి.. క్యాబ్‌లో రైడ్‌కు తీసుకెళ్లి!
భార్యతో తన వైవాహిక బంధంపై విసుగు చెందిన ఓ భర్త ప్లాన్ ప్రకారం ఆమెను హత్యచేశాడు.

భారతీయ యూదుల్లో ‘మోదీ’ ఆనందం
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన సందర్భంగా అక్కడి భారతీయ యూదుల్లో ఆనందం వెల్లి వెరిసింది.

<<<<<<<<<<<<<<<<<  జాతీయం  >>>>>>>>>>>>>>>>>>

 సీఎంకు ఝలక్‌.. ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్‌!
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి త్రిపురలో ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది.

అసెంబ్లీ సాక్షిగా మంత్రి సంచలన వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర మంత్రి ఇమ్రాన్ అన్సారీ ప్రతిపక్ష పార్టీ నేత దేవేందర్ రాణాను సభలోనే చంపి పాతరేస్తానంటూ బెదిరించారు.

<<<<<<<<<<<<<<<<<  సినిమా  >>>>>>>>>>>>>>>>>>
భరత్‌ మృతి: విమర్శలపై స్పందించిన రవితేజ

రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన భరత్‌ను కడసారి చూడలేకనే.. అతని అంత్యక్రియలకు తానుగానీ, తన తల్లిగానీ వెళ్లలేదని హీరో రవితేజ తెలిపారు.

తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్లో విషాదం
ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మనవడు (కుమార్తె చరిత కొడుకు) సాకేత్ రామ్ వెల్లంకి(19) మంగళవారం అమెరికాలో మృతి చెందారు.

<<<<<<<<<<<<<<<<<  స్పోర్ట్స్  >>>>>>>>>>>>>>>>>>

 ఐ యామ్ బ్యాక్..ఇక నుంచి దూకుడే..
ఇక నుంచి  విధ్వంసకర బ్యాటింగ్ తో జట్టుకు విజయాలందిస్తానని ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఆటతీరుపై స్పందించాడు.

ధోనికి 'ఏ' గ్రేడ్‌ ఎందుకు?
భారత్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి 'ఏ' గ్రేడ్‌ ఎలా కేటాయించారని బీసీసీఐని పాక్‌ మాజీ ఆటగాడు రమీజ్‌ రాజా ప్రశ్నించాడు.

<<<<<<<<<<<<<<<<<  బిజినెస్  >>>>>>>>>>>>>>>>>>

రూ.200 నోట్లపై షాకింగ్‌ నిర్ణయం?
రూ.200 కరెన్సీ నోట్లను ఏటీఎంల ద్వారా అందించకూడదని రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా యోచిస్తున్నట్టు తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి.


డబ్బు కట్టకపోతే యాంబీ వ్యాలీ వేలమే
సహారా అధినేత సుబ్రతారాయ్‌ పెరోల్‌ గడువును సుప్రీంకోర్టు జూలై 20 వరకు పొడిగించింది. జూలై15 వరకు రూ.552 కోట్లను సెబీ-సహారా అకౌంట్లో డిపాజిట్‌ చేయాలని, లేకపోతే యాంబీ వ్యాలీని వేలం వేస్తామని హెచ్చరించింది.

డిపాజిట్ల రేట్లపై కోత పెట్టిన ఎస్‌బీఐ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటి రూపాయల లోపు  ఫిక్స్‌డ్‌ వార్షిక డిపాజిట్లపై వడ్డీరేటును 15 బేసిస్‌ పాయింట్లను తగ్గించి  6.75 శాతంగా నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement