టాప్-10 పర్యాటక ప్రాంతాల్లో ముంబై
న్యూఢిల్లీ : ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని టాప్-10 పర్యాటక ప్రదేశాల జాబితాలో దేశ వాణిజ్య రాజధాని ముంబై స్థానం దక్కించుకుంది. ముంబైకి అంతర్జాతీయ సందర్శకుల సంఖ్య పెరిగిందని మాస్టర్‌కార్డ్ తెలిపింది. మాస్టర్‌కార్డ్ సూచీ టాప్-10 జాబితాలో బ్యాంకాక్ అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాతి స్థానాల్లో సింగపూర్ (2వ స్థానం), కౌలాలంపూర్ (3వ స్థానం), సియోల్ (4వ స్థానం), హాంగ్‌కాంగ్ (5వ స్థానం), టోక్యో (6), తైపే (7), షాంఘై (8), ముంబై (9), ఒసాకా (10) ఉన్నాయి.
ప్రపంచంలోని పర్యాటక ప్రాంతాలతో పోలిస్తే ఆసియాలోని పర్యాటక ప్రాంతాలు విమాన ప్రయాణికులను ఎక్కువగా ఆకర్షిస్తున్నట్లు మాస్టర్‌కార్డ్ చీఫ్ ఎకనమిస్ట్ యువా హెడ్రిక్ వాంగ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే సందర్శకుల తాకిడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో లండన్ అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో బ్యాంకాక్, పారిస్ ఉన్నాయి. గత ఆరేళ్లలో సందర్శకుల సంఖ్య వేగంగా పెరుగుతున్న ఆసియా ప్రాంతాల్లో కొలంబో, చెంగ్దు, అబుధాబి ఉన్నాయి.