రైలు బోగీలపై రమణీయ దృశ్యాలు
న్యూఢిల్లీ: సాదాసీదాగా కనిపిస్తున్న రైల్వే బోగీలు.. ఇకపై ప్రకృతి రమణీయ దృశ్యాలతో ఆకర్షణీయంగా మారనున్నాయి. వాటిపై రకరకాల వన్యప్రాణులు, ప్రకృతి దృశ్యాలను బోగీలపై ముద్రించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. పర్యాటకాభివృద్ధి కోసం రైల్వే బోగీలు, స్టేషన్లలో వివిధ రకాల ఆకర్షణీయ దృశ్యాలను ముద్రించాల్సిందిగా ప్రపంచ వన్యప్రాణి నిధి(డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రకృతి ఆవాసాలు, పక్షులు, జంతువులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించడంతో పాటు పర్యాటకానికి ఊతమిచ్చినట్లవుతుందని అధికారులు భావిస్తున్నారు. రాజస్తాన్‌లోని సవాయి మాధోపుర్, భరత్‌పుర్‌లోని స్టేషన్లలో, నిజాముద్దీన్-కోటా జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ బోగీలపై మొదటిసారిగా ఈ ప్రాజెక్టు అమలుపరచనున్నారు.