దివ్యాంగుల కోసం రైల్వే శాఖ 2018 నాటికి 3 వేల ప్రత్యేక బోగీలను తయారుచేయనుంది.
నాగ్‌పూర్: దివ్యాంగుల ప్రయాణ సౌకర్యార్థం రైల్వే శాఖ 2018 నాటికి 3 వేల ప్రత్యేక బోగీలను తయారుచేయనుంది. వీటిలో దివ్యాంగుల ప్రయాణం సజావుగా సాగేలా పలు వసతులను కల్పించనున్నట్లు దివ్యాంగుల విభాగం ముఖ్య కమిషనర్ కమలేశ్ పాండే చెప్పారు. నాగ్‌పూర్ జిల్లాలో దివ్యాంగుల కోసం ప్రవేశపెట్టిన పథకాల సమీక్ష సమావేశం తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రత్యేక బోగీలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తారని, వీటిలో ఎక్కువ సీట్లు, అధిక స్థలంతో పాటు వీటిని గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక చిహ్నాలను అమరుస్తామని తెలిపారు. ముంబై, నాసిక్, నాగ్‌పూర్‌లోని సుమారు180 ప్రభుత్వ భవనాలను దివ్యాంగులకు అనుకూలంగా మార్చేందుకు వాటిలో ర్యాంపులు, లిఫ్టులు లాంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.