
ప్రతీకాత్మక చిత్రం
రాంచీ, జార్ఖండ్ : భారతీయ రైల్వేకు చెందిన రైలు బోగీలు కనిపించకుండా పోవడం జార్ఖండ్‌లో కలకలం రేపుతోంది. ప్రీమియం రైళ్ల కోసం రాంచీ రైల్వేస్టేషన్‌కు అధికారులు ఆధునిక బోగీలను తెప్పించారు. రాజధాని ఎక్స్‌ప్రెస్, సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్ల కోసం ఈ బోగీలను తెప్పించినట్లు జాతీయ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది.
ఢిల్లీ-రాంచీల మధ్య నడిచే రైళ్లకు వీటిని అమర్చాలని రాంచీ అధికారులు భావించి వాటిని స్టేషన్ యార్డులో ఉంచారు. అయితే, అవి అక్కడి నుంచి కనిపించకుండా పోవడంతో వారు అవాక్కయ్యారు. బోగీల మాయం వెనుక పెద్ద ముఠా ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment