ట్రంప్ కొత్త ఆర్డర్: దేశీయ ఐటీ సంస్థలపై ప్రభావం
వాషింగ్టన్: అమెరికా అధ‍్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ఆర్డర్‌పై చేసిన సంతకం దేశీయ ఐటీ సంస్థల్లో గుబులు రేపింది. భారత ఐటీ రంగానికి మరోసారి భారీ షాకిస్తూ హైర్ అమెరికన్స్ అంటూ మొదటనుంచి చెబుతున్న ట్రంప్ దేశీయులు అమెరికాలో పని చేసేందుకు వీలుగా జారీ చేసే హెచ్1బీ వీసా నిబంధనల మార్పులకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ట్రంప్ సంతకం చేశారు.
ఉద్యోగాల్లో అమెకరిన్లనే నియమించుకోవాలన్న ట్రంప్ ఆదేశాలు దేశీయ ప్రముఖ ఐటీ సంస్థలపై భారీగా పడనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ లాంటి ఇతర ఐటీ సంస్థలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అలాగే భారతీయ వృత్తి నిపుణుల(టెక్కీల)ను కూడా ఇది ప్రభావితం చేయనుంది. అమెరికాలో ఐటీ సేవలందిస్తున్న ఈ సంస్థలకు చెందిన విదేశీ ఇంజనీర్లు ప్రోగ్రామర్లు ప్రభావితం కానున్నారు. వీటిని ప్రత్యేక విధులకే మాత్రమే కేటాయిస్తారు. వీటిల్లో కూడా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉండాలి.
అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే బై అమెరికన్, హైర్ అమెరికన్ నినాదాన్ని అమలు చేశారు. ఈ నిర్ణయంతో ఫెడరల్ కాంట్రాక్ట్‌లు కూడా అమెరికా సంస్థలకే వచ్చే అవకాశం ఉంది. ఇది దేశ ఆర్థిక వ్వవస్థకు కూడా ఊతం ఇస్తుందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.
తమ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ విస్తృతంగా దుర్వినియోగమైందని, ఇక హైర్ అమెరికన్స్ నినాదానికే ప్రాధాన్యత అని డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. లాటరీ విధానం ద్వాఆరా హెచ్1 బీసా ఎంపిక విధానం సరియైందికాదని ఆర్డర్‌పై సంతకం చేసు ముందు విస్కాన్సిన్ లో చెప్పారు. దీని స్థానంలో అత్యుత్తమ నైపుణ్యం ఉన్నవారికే హెచ్1బీ వీసాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అంతేకాదు అత్యధిక వేతనం.. అత్యధిక ఉపాధి కల్పించాలన్న తన లక్ష్యం నెరవేరుతుందని ట్రంప్ చెప్పారు. దీంతో ఉద్యోగాల కోసం అమెరికాలోకి రాకపోకలు సాగించే వారిపై గట్టి నిఘా కూడా ఉండనుంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం దేశీయ ఐటీ కంపెనీలపై భారీగా పడనుంది.
దేశంలోని అతిపెద్ద ఐటి సేవల సంస్థ ఇన్ఫోసిస్ వీసా నియంత్రణ మార్పులను పరిశీలిస్తున్నామని ప్రకటించింది. అమెరికాలో లోకల్ టాలెంట్ గుర్తించిన శిక్షణ ఇప్పించే దిశగా కృషి చేస్తున్నట్టు గతంలో చెప్పింది. అటు టీసీఎస్ కూడా దీనికనుగుణంగా చర్యలుచేపడతామని ప్రకటించింది. యాక్సెంచర్, ఐబీఎం, గూగుల్ లాంటి ఇతర టెక్ సంస్థలు ఇప్పటికే అమెరిక్లను నియమించుకునే ప్రక్రియ మొదలు పెట్టాయి. మరోవైపు ఈ సంవత్సరం హెచ్1బీ వీసాల దరఖాస్తుల సంఖ్య భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే.