టాప్-5 నుంచి అమెరికా అవుట్ | U.S. slips to seventh best country in the world after Trump election, Switzerland tops the list | Sakshi
Sakshi News home page

టాప్-5 నుంచి అమెరికా అవుట్

Published Tue, Mar 7 2017 5:12 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

టాప్-5 నుంచి అమెరికా అవుట్ - Sakshi

టాప్-5 నుంచి అమెరికా అవుట్

ప్రపంచాధినేతగా.. టాప్ దేశాల్లో తామే ముందంజలో ఉంటామంటూ ఊదరగొట్టే అమెరికాకు మరోసారి షాక్ తగిలింది. ఉత్తమ దేశాల జాబితా నుంచి మరో మూడు స్థానాలు కిందకు పడిపోయింది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాస్ వార్టన్ స్కూల్ , గ్లోబల్ బ్రాండ్ కన్సల్టెంట్స్ బీఏఈ కన్సల్టింగ్ భాగస్వామ్యంలో ''బెస్ట్ కంట్రీస్'' ర్యాంకింగ్స్ జాబితాను అమెరికా న్యూస్, వరల్డ్ రిపోర్టు మంగళవారం విడుదలచేసింది. ఈ రిపోర్టులో ఉత్తమ దేశాల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న అమెరికా మరో మూడు స్థానాలు పడిపోయి ఏడవ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్ లో ఉత్తమ దేశంగా స్విట్జర్లాండ్ అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంది. స్విట్జర్లాండ్ తర్వాత రెండో స్థానంలో కెనడా, మూడు స్థానం బ్రిటన్ నిలిచాయి.  అయితే మొత్తంగా ఆస్ట్రేలియా కంటే అమెరికా ముందజంలోనే ఉన్నప్పటికీ, జపాన్, స్వీడన్, జర్మనీల కంటే వెనుకంజలోకి పడిపోయింది.
 
2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల తర్వాత అమెరికా నాయకత్వంపై కొంత గౌరవం కోల్పోయినట్టు 75 శాతం మంది రెస్పాడెంట్లు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అమెరికాపై అసంతృప్తిగా ఉన్నట్టు సర్వే గుర్తించింది. దీంతో  నాలుగో స్థానంలో ఉన్న 2016 ర్యాంకింగ్స్  నుంచి కూడా పడిపోయినట్టు వెల్లడించింది. వ్యాపారాలు, పౌరసత్వం, విద్య, పారదర్శకత, సాహస పర్యాటకంలో అమెరికా వెనుకంజలో పడినట్టు తెలిపింది. 90 శాతం అమెరికా వెలుపల సర్వేలో పాల్గొన్న వారు 2016 అమెరికా ఎన్నికలపై ఎక్కువగా దృష్టిసారించినట్టు పేర్కొన్నారు. హిల్లరీ క్లింటన్ గెలుస్తుందని భావించామని, కానీ అనూహ్యంగా ట్రంప్ గెలిచినట్టు చెప్పారు.  21వేల మంది బిజినెస్ లీడర్లు, సాధారణ ప్రజానీకం, పలు ప్రముఖులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వివిధ దేశాల్లో పలు అంశాలపై వారి వద్ద నుంచి ఈ సర్వే అభిప్రాయాలు సేకరించింది.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement