'స్వచ్ఛ భారత్' కు యూనిసెఫ్ ప్రశంస | UNICEF offers support to Clean India Mission | Sakshi
Sakshi News home page

'స్వచ్ఛ భారత్' కు యూనిసెఫ్ ప్రశంస

Published Mon, Oct 27 2014 6:51 PM | Last Updated on Sat, Sep 2 2017 3:28 PM

'స్వచ్ఛ భారత్' కు యూనిసెఫ్ ప్రశంస

'స్వచ్ఛ భారత్' కు యూనిసెఫ్ ప్రశంస

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ పథకానికి యూనిసెఫ్ ప్రశంస లభించింది. అంతేకాదు ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు భారత ప్రభుత్వానికి అవసరమైన మద్దతు ఇచ్చేందుకు ముందుకువచ్చింది.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు అండదండలు అందిస్తామని యూనిసెఫ్ భారత్ ప్రతినిధి లూయిస్-జార్జెస్ ఆర్సెనాల్ట్ ప్రకటించారు. 'స్వచ్ఛ భారత్ పథకాన్ని స్వాగతిస్తున్నాం. దీనికి మా వంతు మద్దతు ఇస్తాం' అని లూయిస్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా పరిసరాల పరిశుభ్రతపై భారతీయుల్లో చైతన్యం పెరుగుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement