కేంద్రమంత్రి కాన్వాయ్పై దాడి
ప్రతాప్గఢ్: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్లో రాజకీయవేడి రాజుకుంది. ఇప్పటికే వలసలు జోరందుకోవడం, ప్రచారంతో ఆ రాష్ట్రం హోరెత్తిపోతుండగా, ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల నాయకులపై దాడులకు దిగుతున్నారు. కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ కాన్వాయ్పై ఆదివారం దాడి జరిగింది. అనుప్రియ ప్రతాప్గఢ్ జిల్లా పర్యటనకు వెళ్లినపుడు ఈ ఘటన చోటుచేసుకుంది. అధికార సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలే తన కాన్వాయ్పై దాడిచేశారని ఆమె ఆరోపించారు. తన కాన్వాయ్పై దాడి చేయడం పట్ల కేంద్రమంత్రి నిరసన వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆప్నా దళ్కు చెందిన ఎంపీ అనుప్రియకు స్థానం దక్కిన సంగతి తెలిసిందే. యూపీ ఎన్నికల్లో ఆమె బీజేపీ తరపున ప్రచారం చేయనున్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం యూపీలో ఎన్నికల ప్రచారయాత్ర నిర్వహిస్తున్నారు.