యూఎస్ భద్రత దళాల అదుపులో తాలిబన్ కమాండర్ | US captures senior Taliban militant | Sakshi
Sakshi News home page

యూఎస్ భద్రత దళాల అదుపులో తాలిబన్ కమాండర్

Published Sat, Oct 12 2013 10:05 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM

US captures senior Taliban militant

తాలిబాన్ తీవ్రవాద సంస్థకు చెందిన సీనియర్ కమాండర్ లతీఫ్ మసూద్ను అమెరికా మిలటరీ దళాలు పట్టుకున్నట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి మేరి హర్ఫ్ వెల్లడించారు. తేహ్రిక్ - ఈ - తాలిబాన్ (టీటీపీ) అగ్రనేత హకిముల్లా ముసూద్కు లతీప్ అనుచరుడని పేర్కొంది.అయితే భద్రతా దళాల గాలింపు చర్యల్లో భాగంగా అతడిని పట్టుకున్నట్లు చెప్పారు.

 

అంతకు మినహా లతీఫ్ను ఎక్కడ,ఎప్పుడు పట్టుకున్నది సమాచారం తెలియలేదని తెలిపారు. 2010లో యూఎస్లో టైమ్స్ స్కేర్ వద్ద బాంబు పేలుళ్లలో ఘటనకు పాల్పడింది తామేనని టీటీపీ ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.యూఎస్లో మరోసారి దాడులకు పాల్పడేందుకు  టీటీపీ ప్రయత్నిస్తుందని నిఘా వర్గాల ద్వారా తమకు సమాచారం అందిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement