Latif Mehsud
-
పాకిస్థాన్‌కు తాలిబన్ టాప్ కమాండర్ అప్పగింత
పెషావర్: ఆఫ్ఘనిస్థాన్‌లో అరెస్ట్ చేసిన తాలిబన్ టాప్ మిలిటెంట్ కమాండర్ లతీఫ్ మషూద్తో పాటు మరో ఇద్దరిని పాకిస్థాన్‌కు అప్పగించినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తాలిబన్ కార్యక్రమాల్లో మాజీ చీఫ్ హకీముల్లా మషూద్ తర్వాత లతీఫ్ది రెండో స్థానం. లతీఫ్ ఆయుధాలు కొనడానికి ఆఫ్ఘనిస్థాన్ నుంచి పాకిస్థాన్ వెళ్తుండగా, సరిహద్దుల్లో ఆప్ఘన్ దళాలు అతన్ని అరెస్ట్ చేశాయి. లతీఫ్ కొంతకాలంగా ఆఫ్ఘనిస్థాన్, నాటో దళాల అదుపులో ఉన్నాడు. పాక్ కోరిక మేరకు అతన్ని అప్పగించినట్టు వార్తలు వచ్చాయి. -
యూఎస్ భద్రత దళాల అదుపులో తాలిబన్ కమాండర్
తాలిబాన్ తీవ్రవాద సంస్థకు చెందిన సీనియర్ కమాండర్ లతీఫ్ మసూద్‌ను అమెరికా మిలటరీ దళాలు పట్టుకున్నట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి మేరి హర్ఫ్ వెల్లడించారు. తేహ్రిక్ - ఈ - తాలిబాన్ (టీటీపీ) అగ్రనేత హకిముల్లా ముసూద్కు లతీప్ అనుచరుడని పేర్కొంది.అయితే భద్రతా దళాల గాలింపు చర్యల్లో భాగంగా అతడిని పట్టుకున్నట్లు చెప్పారు. అంతకు మినహా లతీఫ్‌ను ఎక్కడ,ఎప్పుడు పట్టుకున్నది సమాచారం తెలియలేదని తెలిపారు. 2010లో యూఎస్‌లో టైమ్స్ స్కేర్ వద్ద బాంబు పేలుళ్లలో ఘటనకు పాల్పడింది తామేనని టీటీపీ ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.యూఎస్‌లో మరోసారి దాడులకు పాల్పడేందుకు టీటీపీ ప్రయత్నిస్తుందని నిఘా వర్గాల ద్వారా తమకు సమాచారం అందిందని తెలిపారు.