పంజాబీ ఫేమస్ డాన్స్ 'బాంగ్రా', జపానీస్ ఇష్టపడే 'పీఎస్ వై' స్టైలు స్టెప్పులతో యూకేలోని బర్మింహామ్ లో ముగ్గురు బామ్మలు దంచేశారు. నిశ్శబ్దంగా ఎవరికి వారు తమ పనులను చూసుకుంటన్న వీధిని స్టేజ్ గా ఎంచుకున్న వీరు తమ నైపుణ్యాన్ని ప్రజలకు చూపారు. 43 నుంచి 56ల మధ్య వయసు కలిగిన వీరందరి డాన్స్ ను చిత్రించుకునేందుకు అక్కడి వారు ఎగబడ్డారు. స్థానికంగా ఉన్న ఫిజాగ్ ప్రొడక్షన్స్ లో పనిచేసే సూ హాకిన్స్, జాకీ ఫెలోస్, డెబ్ నికోలస్ లు ఈ డాన్స్ లను చేశారు.
కొంతమంది ఆ డాన్స్ లను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. మిలియన్ల కొద్దీ లైక్స్, షేర్ లతో ఒక్కసారిగా వీరు ఫేమస్ అయిపోయారు. వీరు ఎంతలా ఫేమస్ అయ్యారంటే.. కొన్ని సంస్థలు వీరిని షోలు నిర్వహించాలని కలుస్తున్నాయి. దేశవిదేశాల్లో వీరి డాన్స్ చూసిన వాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారని ముగ్గరిలో ఒక బామ్మ హాకిన్స్ తెలిపారు. దాదాపు 14 సంవత్సరాలుగా ముగ్గురూ కలిసే ఉంటున్నట్లు వివరించారు.