వొడాఫోన్కు భారీ జరిమానా
వొడాఫోన్కు భారీ జరిమానా
Published Wed, Oct 26 2016 2:43 PM | Last Updated on Tue, Oct 2 2018 4:26 PM
లండన్ : కస్టమర్ ఫిర్యాదులను సరిగా హ్యాండిల్ చేయకుండా తరుచూ యూకే వ్యాపారాల్లో ఫెయిల్యూర్స్కు పాల్పడుతుండటంతో ప్రపంచ టెలికాం దిగ్గజం వొడాఫోన్కు భారీ జరిమానా పడింది. కస్టమర్ ఫెయిల్యూర్స్పై సీరియస్గా స్పందించిన బ్రిటన్ ఆ కంపెనీపై 4.6 మిలియన్ ఫౌండ్ల జరిమానా ( రూ.37 కోట్లకు పైగా) విధించింది. ఈ కమ్యూనికేషన్ దిగ్గజంపై రెండు సార్లు విచారణ చేపట్టిన అనంతరం బ్రిటన్ రెగ్యులేటరీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కస్టమర్ల ఫిర్యాదులన్నింటినీ న్యాయమైన పద్ధతిలో, వెంటనే పరిష్కరించడంలో వొడాఫోన్ ప్రక్రియలు పూర్తిగా విఫలమైనట్టు యూకే కమ్యూనికేషన్ పరిశ్రమల స్వతంత్ర రెగ్యులేటరీ ఆఫ్కామ్ తెలిపింది. ఈ జరిమానాను 20 పనిదినాల లోపు ఆఫ్కామ్కు చెల్లించాలని వొడాఫోన్ను ఆదేశించింది. ప్రపంచంలోనే రెండోఅతిపెద్ద మొబైల్ ఆపరేటర్ వొడాఫోన్. కానీ ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే గుర్తించి, పరిష్కరించడంలో మాత్రం విఫలమవుతుందని ఆఫ్కామ్ అసహనం వ్యక్తంచేసింది.
ఈ సమస్యలతో 2013 చివరి నుంచి 2015 ఏప్రిల్ మధ్యవరకున్న 17 నెలల కాలంలో కస్టమర్లు దాదాపు లక్షా 50వేల డాలర్లు నష్టపోయినట్టు రెగ్యులేటరీ తెలిపింది. తమ సిస్టమ్, ప్రాసెస్ ఫెయిల్యూర్స్పై వొడాఫోన్ పశ్చాత్తాపం వ్యక్తంచేసింది. ప్రభావిత కస్టమర్లందరికీ ఇప్పటికే తాము రీఫండ్ చేశామని పేర్కొంది. ఈ జరిమానా నేపథ్యంలో అన్ని టెలికాం కంపెనీలను రెగ్యులేటరీ హెచ్చరించింది. కస్టమర్లకు అందించే సేవల్లో విఫలమవ్వడాన్ని తాము సీరియస్గా తీసుకుంటామని తెలిపింది. ఫోన్ సర్వీసులు దైనిందిక జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని, కస్టమర్లందరికీ న్యాయబద్ధంగా సేవలు అందిస్తారని తాము ఆశిస్తున్నట్టు ఆఫ్కామ్ బుధవారం వెల్లడించింది. కాగ బిల్లింగ్ డేటాలోను, ఫ్రైస్ ప్లాన్స్లో వొడాఫోన్ కంపెనీ కస్టమర్లకు సమస్యలు తలెత్తాయి. కంపెనీకి ఫిర్యాదులు భారీగా వెల్లువెత్తినప్పటికీ, వెనువెంటనే పరిష్కరించడంలో వొడాఫోన్ విఫలమైంది.
Advertisement
Advertisement