లండన్: ఓ విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరేళ్ల బాలునికి పెద్ద కష్టం వచ్చిపడింది. ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్న ఆ బాలుడు తల్లి దండ్రులను కోల్పోయి దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. కనీసం తన తల్లి దండ్రులను కోల్పోయానన్న వార్త కూడా ఆ బాలునికి తెలియకపోవడం తీవ్రంగా కలిచివేస్తోంది.
యునైటెడ్ కింగ్ డమ్ లోని హమ్ షైర్ దేశంలో శనివారం జరిగిన విమాన ప్రమాద ఘటన ఆ బాలుని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వారు బయల్దేరిన తేలికపాటి విమానం ల్యాండింగ్ చేసే సమయంలో ప్రమాదంలో చిక్కుకుంది. మళ్లీ ఆ విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లే యత్నంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆ బాలుని తల్లి దండ్రులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. అయితే తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఆ బాలుని పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం సృహ కోల్పోయిన ఆ బాలుడు మృత్యువుతో పోరాడుతున్నాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
విమాన ప్రమాదం: దయనీయ స్థితిలో ఆరేళ్ల బాలుడు!
Published Mon, Jan 5 2015 9:20 AM | Last Updated on Tue, Nov 6 2018 4:56 PM
Advertisement
Advertisement