అప్పటికప్పుడు అనుకుని తీసుకున్న కొన్ని బీమా పాలసీలు కాలం గడిచే కొద్దీ .. మన అవసరాలకు ఉపయోగపడనివిగా అనిపించవచ్చు. ఒకోసారి ప్రీమియాలు భారమై.. కట్టలేని పరిస్థితి ఎదురవ్వొచ్చు. ఇలాంటి సందర్భాల్లో పాలసీ నుంచి వైదొలిగితే ఎదురయ్యే లాభనష్టాల గురించి వివరించేదే ఈ కథనం.
డిస్‌కంటిన్యూ చేస్తే వచ్చే ప్రయోజనాలు..బీమా పాలసీని తీసుకున్నాకా గడిచిన సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. కొత్తగా తీసుకున్న పాలసీకి, అప్పుడెప్పుడో తీసుకున్న పాలసీకి వ్యత్యాసముంటుంది. కొత్తగా తీసుకున్న పాలసీ సంగతి విషయానికొస్తే .. ప్రతి బీమా పాలసీలోనూ 15 పని దినాల ఫ్రీ-లుక్ పీరియడ్ ఉంటుంది. డాక్యుమెంట్ మన చేతికి వచ్చాక ఒకవేళ పాలసీని వద్దనుకుంటే ఈ వ్యవధిలోగా బీమా కంపెనీకి తిప్పి పంపేయొచ్చు. ఇలాంటి సందర్భాల్లో కంపెనీ స్టాంపు డ్యూటీ, మెడికల్ టెస్టులు వంటి ఖర్చులు మినహాయించుకుని మీరు కట్టిన పూర్తి ప్రీమియం డబ్బు వాపసు చేయాల్సి ఉంటుంది. అదే యూనిట్ ఆధారిత బీమా పాలసీలైతే (యులిప్) పాలసీని వాపసు చేసిన తేదీ నాడు యూనిట్ విలువ (ఎన్‌ఏవీ)ని లెక్కగట్టి, ఇతర వ్యయాలు మినహాయించుకుని.. మిగతా మొత్తాన్ని కంపెనీ తిరిగి చెల్లిస్తుంది.
పాత పాలసీలైతే: గతంలో ఎప్పుడో తీసుకున్న పాలసీలను డిస్‌కంటిన్యూ చేయడానికి మరో విధానం అనుసరించాల్సి ఉంటుంది. సాధారణంగా సంప్రదాయ పాలసీల్లో కనీసం మూడేళ్ల పాటు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మధ్యలో మానేస్తే ..అప్పటిదాకా కట్టిన డబ్బు కూడా కంపెనీకే వెళ్లిపోతుంది. పాలసీని డిస్‌కంటిన్యూ చేసినా పైసా కూడా చేతికి రాదు. అదే మూడేళ్ల పాటు క్రమం తప్పకుండా చెల్లించిన పక్షంలో .. పాలసీని నిలిపేయడానికి రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మొదటిదాని విషయానికొస్తే.. మూడేళ్ల అనంతరం తదుపరి ప్రీమియం చెల్లింపులను ఆపేయొచ్చు. అప్పటిదాకా పాలసీ ప్రయోజనాలు ఆనాటితో నిల్చిపోతాయి. పాలసీ వ్యవధి ముగిసిన తర్వాత మెచ్యూరిటీ మొత్తాన్ని కంపెనీ తిరిగి చెల్లిస్తుంది. ఇక రెండో ప్రత్యామ్నాయం సంగతి చూస్తే.. మీరు ఒక అయిదేళ్ల పాటు ప్రీమియంలు చెల్లించి, నిలిపివేసిన పక్షంలో .. ఆ అయిదేళ్ల కాలం తర్వాత వచ్చే ప్రయోజనాలన్నీ కూడా యథాతథంగా కొనసాగుతాయి. పాలసీ గడువు తీరిన తర్వాత మీ చేతికి అందుతాయి. అంత కాలం ఆగే అవకాశం లేక మధ్యలోనే పాలసీని రద్దు చేసి వచ్చినంత తీసుకుందామనుకుంటే.. ఆ పనీ చేయొచ్చు. కానీ, ఇలాంటి సందర్భాల్లో డబ్బు తక్షణమే చేతికి వస్తుంది..కానీ బీమా కంపెనీ భారీ మొత్తంలో చార్జీలు మినహాయించుకుంటుంది.
నచ్చని పాలసీ.. వైదొలిగేదెలా?
Published Sun, Sep 22 2013 12:47 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM
Advertisement
Advertisement