Unit linked insurance plan
-
యులిప్.. లోతుగా తెలుసుకున్నాకే!
ఆర్యన్ (60) క్రమం తప్పకుండా ఆదాయం కోసం ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేద్దామని బ్యాంక్‌కు వెళ్లాడు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి (ఎఫ్డీ), దానిపై ప్రతి నెలా వడ్డీ రాబడి తీసుకోవాలన్నది ఆయన ప్రణాళిక. కానీ, బ్యాంక్ ఉద్యోగి చేసిన పనికి అతడు నష్టపోవాల్సి వచి్చంది. అనుకున్నది ఒకటి అయింది మరొకటి. ఎఫ్డీ పేరు చెప్పి బ్యాంక్ ఉద్యోగి ఆర్యన్‌తో యులిప్ పథకంపై సంతకం చేయించాడు. ఆ తర్వాతే అది ఎఫ్డీ కాదని అతడికి తెలిసొచ్చింది. దీంతో క్రమం తప్పకుండా ఆదాయం పొందాలన్న అతడి ప్రణాళిక దారితప్పింది. ఇలా తప్పుదోవ పట్టించి బీమా పాలసీలు, పెట్టుబడి పథకాలను అంటగట్టే ప్రయత్నాలు సహజంగానే కనిపిస్తూనే ఉంటాయి. యస్ బ్యాంక్ కేసులోనూ ఇదే చోటు చేసుకుంది. ఏటీ–1 (అడిషనల్ టైర్) బాండ్లను ఎఫ్డీ పేరు చెప్పి లక్షలాది మంది నుండి పెట్టుబడులు సమీకరించింది. యస్ బ్యాంక్ సంక్షోభంలో పడినప్పుడు ఏటీ–1 బాండ్లను రైటాఫ్ చేసేశారు. అంటే పెట్టుబడి పెట్టిన వారికి రూపాయి ఇవ్వలేదు. ఎఫ్‌డీల్లో అధిక రాబడి ఇస్తుందని చెప్పారే కానీ, ఏటీ–1 బాండ్లలో ఉండే రిస్క్ గురించి చెప్పలేదు. మన దేశంలో పెట్టుబడి సాధనాలను మార్కెట్ చేసే వారు కేవలం రాబడులు, ఆకర్షణీయమైన ఫీచర్ల గురించే చెబుతుంటారు. ఆయా సాధనాల్లోని రిస్్క ల గురించి తెలుసుకోవడం ఇన్వెస్ట్ చేసే వారి బాధ్యత అని గుర్తించాలి. బీమా పాలసీలను తప్పుడు సమాచారంతో విక్రయించే ధోరణులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందులో యులిప్‌లు కూడా ఒకటి. ‘‘ఇవి ఏజెంట్లకు ఎక్కువ కమీషన్‌ను అందిస్తాయి. దీంతో పాలసీ తీసుకునే వారికి గరిష్ట ప్రయోజనం కల్పించడానికి బదులు, ఏజెంట్‌కు ఎక్కువ ప్రయోజనం కలిగించే ఉత్పత్తి విక్రయానికి దారితీస్తుంది’’ అని ఆనంద్‌రాఠి వెల్త్ ప్రొడక్ట్ అండ్ రీసెర్చ్ హెడ్ చేతన్ షెనాయ్ వివరించారు. ఎండోమెంట్ బీమా ప్లాన్లలో కమీషన్ మెదటి ఏడాది 10–35 శాతం మేర ఏజెంట్లకు అందుతుంది. యులిప్ ప్లాన్ల ప్రీమియంలో 10 శాతం ఏజెంట్ కమీషన్‌గా వెళుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్స్పెన్స్ రేషియో కేవలం 0.3–1.5 శాతం మధ్యే ఎక్కువ పథకాల్లో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ మాదిరే పనిచేస్తాయంటూ యులిప్‌లను మార్కెట్ చేస్తుంటారు ఏజెంట్లు. కానీ, పూర్తిగా తెలుసుకోకుండా అంగీకారం తెలపకపోవడమే మంచిది. యులిప్‌లు – మ్యూచువల్ ఫండ్స్ యులిప్‌లు, మ్యూచువల్ ఫండ్స్ ఒక్కటి కావు. వీటి మధ్య సారూప్యత కొంత అయితే, వైరుధ్యాలు బోలెడు. యులిప్‌లు అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు. అంటే పెట్టుబడులతో ముడిపడిన బీమా పథకాలు. చెల్లించే ప్రీమియంలో కొంత బీమా కవరేజీకి పోను, మిగిలిన మొత్తాన్ని తీసుకెళ్లి ఈక్విటీ, డెట్ సాధనాల్లో (ఇన్వెస్టర్ ఎంపిక మేరకు) పెట్టుబడిగా పెడతారు. కనుక ఇందులో రిస్క్‌లు, రాబడుల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. బీమా కంపెనీల ఫండ్ మేనేజర్లు యులిప్ పాలసీలకు సంబంధించిన పెట్టుబడులను మార్కెట్ లింక్డ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. యులిప్‌ల ప్లాన్లను మ్యూచువల్ ఫండ్ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)గా కొందరు మార్కెట్ చేస్తుంటారు. నెట్ అసెట్ వేల్యూ (ఎన్ఏవీ)ని చూపిస్తుంటారు. యులిప్‌లను మ్యూచువల్ ఫండ్స్‌కు ప్రత్యామ్నాయం అంటూ విక్రయిస్తుంటారు. దీంతో మ్యూచువల్ ఫండ్స్ మాదిరే రాబడులు వస్తాయని కొనుగోలు చేసే వారూ ఉన్నారు. కానీ వాస్తవంలో మెరుగ్గా పనిచేసే యులిప్‌ల రాబడులను గమనించినప్పుడు.. మ్యూచువల్ ఫండ్స్ కంటే తక్కువే ఉండడాన్ని చూడొచ్చు. దీనికి కారణం యులిప్‌లలో పలు రకాల చార్జీల పేరుతో పాలసీదారుల నుంచి బీమా సంస్థలు ఎక్కువ రాబట్టుకునే చర్యలు అమలు చేస్తుంటాయి. సంక్లిష్టత.. పారదర్శకత లిక్విడిటీ (కొనుగోలు, విక్రయాలకు కావాల్సినంత డిమాండ్), చార్జీలు అనేవి యులిప్‌లు, ఫండ్స్‌లో పూర్తిగా భిన్నం. యులిప్‌లు ఐదేళ్ల లాకిన్ పీరియడ్‌తో వస్తాయి. ఫండ్స్ పెట్టుబడులను కోరుకున్నప్పుడు ఉపసంహరించుకోవచ్చు. యులిప్‌లలో విధించే చార్జీలు ఎక్కువగా ఉంటాయి. ‘‘మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్స్పెన్స్ రేషియో సాధారణంగా అయితే 0.5–1.5 శాతం మధ్య ఉంటుంది. అదే యులిప్‌లలో 20 ఏళ్ల కాలానికి లోడింగ్ 60 శాతంగా ఉంటుంది. అంటే ఏటా 3 శాతం చార్జీల రూపంలో కోల్పోవాల్సి వస్తుంది’’ అని ఇన్వెస్ట్ ఆజ్ ఫర్ కల్ అనే ఫైనాన్షియల్ అడ్వైజరీ సంస్థ వ్యవస్థాపకుడు అనంత్ లోధా తెలిపారు. చార్జీల పరంగా సంక్లిష్టత ఇందులో కనిపిస్తుంది. ప్రీమియం అలోకేషన్ చార్జీలు, మోరా్టలిటీ చార్జీలు, ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలు, పాలసీ అడ్మిని్రస్టేటివ్ చార్జీలు, ఫండ్ స్విచింగ్ (ఫండ్‌ను మార్చుకున్నప్పుడు) చార్జీలు, పాక్షిక ఉపసంహరణ చార్జీలు, ప్రీమియం రీడైరెక్షన్ చార్జీలు, ప్రీమియం నిలిపివేత చార్జీలు.. ఇన్నేసీ చార్జీలు మరే పెట్టుబడి సాధనంలో కనిపించవు. యులిప్ ప్లాన్లను తీసుకున్న వారిలోనూ చాలా మందికి ఈ చార్జీల గురించి తెలియదు. ఫండ్ మేనేజ్మెంట్ చార్జీల గురించే ఎక్కువ మందికి తెలుసు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల నిర్వహణకు గాను ఎక్స్పెన్స్ రేషియో విధిస్తుంటారు. దీన్నే ఫండ్ మేనేజ్మెంట్ చార్జీగానూ భావించొచ్చు. యులిప్ ప్లాన్లలో దీర్ఘకాలంలో రాబడులు 7–9 శాతం మధ్య ఉంటాయి. కానీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలంలో వార్షిక రాబడిని 12 శాతానికి పైనే ఆశించొచ్చు. రాబడులపై గ్యారంటీ లేదు మ్యూచువల్ ఫండ్స్ మాదిరే యులిప్‌లు సైతం రాబడికి హామీ ఇవ్వవు. వీటిల్లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లపై ఆధారపడి ఉంటాయి. కాకపోతే దీర్ఘకాలంలో ఫిక్స్డ్ డిపాజిట్ కంటే మెరుగైన రాబడి యులిప్‌లలో ఉంటుందని భావించొచ్చు. ఎందుకంటే ఇవి పెట్టుబడులను తీసుకెళ్లి ఈక్విటీల్లో పెడుతుంటాయి. దీర్ఘకాలంలో ఈక్విటీలు మెరుగైన రాబడులు ఇస్తాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. కనుక అన్ని రకాల చార్జీల పేరుతో బాదిన తర్వాత కూడా ఎఫ్డీ కంటే కొంచెం ఎక్కువ రాబడి యులిప్‌లలో ఉంటుంది. పైగా ఎఫ్డీ రాబడిపై పన్ను ఉంటుంది. యులిప్ మెచ్యూరిటీ మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. అందుకే బీమా ఏజెంట్లు ఎఫ్‌డీల కంటే మెరుగైనవిగా మార్కెట్ చేస్తుంటారు. యులిప్ పెట్టుబడులను సైతం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు డెట్, ఈక్విటీ మధ్య మార్చుకునే స్వేచ్ఛ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ కూడా ఇదే పనిచేస్తుంటాయి. పన్ను పరిధిలో ఉన్న వారికి యులిప్‌లు అనుకూలమేనని చెప్పుకోవాలి. ఎందుకంటే వీటిల్లో పెట్టుబడులు, రాబడులపైనా పన్ను ప్రయోజనాలు ఉండడమే. ‘బెనిఫిట్ ఇలి్రస్టేషన్’ (ఎంత రావచ్చన్న అంచనాలు)లో రాబడిని 4–8 శాతం మించి చూపించకూడదు. యులిప్లలోనూ కన్జర్వేటివ్, బ్యాలన్స్డ్, అగ్రెస్సివ్ ఫండ్స్ ఉంటాయి. వీటిల్లో రాబడి, రిస్క్ వేర్వేరు. ఏ ఫండ్ ఎంపిక చేసుకుంటున్నారన్నదాని ఆధారంగానే రాబడులు ఆధారపడి ఉంటాయి. అగ్రెసివ్ ఫండ్‌తో దీర్ఘకాలంలో రాబడి అధికంగా ఉంటుంది. రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆకర్షణలు కాదు.. అవసరాలు కుటుంబ పెద్దకు అనుకోనిది ఏదైనా జరిగితే కుటుంబాన్ని ఆదుకుంటుందనే మార్కెటింగ్ ప్రచారం కూడా యులిప్ ప్లాన్ల విషయంలో కనిపిస్తుంది. కానీ, ఇందులో వాస్తవం పాళ్లు కొంతే. ఎందుకంటే యులిప్ ప్లాన్లలో బీమా రక్షణ తగినంత ఉండదు. అచ్చమైన కవరేజీ కోసం అనువైనది టర్మ్ ఇన్సూరెన్స్. అలాగే, యులిప్‌లో చెల్లించే ప్రీమియం సెక్షన్ 80సీ కింద మినహాయింపు పరిధిలోకి వస్తుందని, మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను ఉండదని కూడా చెబుతారు. కానీ, 2021 ఫిబ్రవరి 1 తర్వాత కొనుగోలు చేసిన యులిప్ ప్లాన్లకు సంబంధించి అందుకునే మెచ్యూరిటీపై పన్ను ఉండకూడదని కోరుకుంటే, ప్రీమియం రూ.2.5 లక్షలు మించకూడదు. మరీ ముఖ్యంగా యులిప్ ప్లాన్ల విషయంలో వృద్ధులను ఏజెంట్లు లక్ష్యంగా చేసుకోవడాన్ని గమనించొచ్చు. ఎందుకంటే వారికి వీటిపై తగినంత అవగాహన లేకపోవడమే. సింగిల్ ప్రీమియం పాలసీలు, గ్యారంటీడ్ ఇన్కమ్ (హామీతో కూడిన రాబడి) పాలసీల గురించి వృద్ధులు అడుగుతుంటారని, అవి వారి అవసరాలకు అనుకూలమైనవి కావని నిపుణుల సూచన. అలాగే, యులిప్ ప్లాన్లలో పెట్టుబడికి ఐదేళ్ల పాటు లాకిన్‌లో ఉంటుంది. దీన్ని కూడా వృద్ధులు గమనించాలి. సీనియర్ సిటిజన్లలో ఎక్కువ మందికి వారు చెల్లించే ప్రీమియానికి పది రెట్ల బీమా కవరేజీ ఇతర ప్లాన్లలో రాకపోవడం ఆకర్షణకు ఒక కారణం. మార్గమేంటి..? అది యులిప్ అయినా, ఎండోమెంట్ ప్లాన్ అయినా సరే బీమాను, పెట్టుబడిని కలపకూడదన్నది ప్రాథమిక సూత్రం. అచ్చమైన బీమా రక్షణ కోరుకుంటే అందుకు టర్మ్ ఇన్సూరెన్స్ మెరుగైన సాధనం. పెట్టుబడి కోసం ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఎన్నో ఉన్నాయి. అటు బీమా, ఇటు పెట్టుబడిపై గరిష్ట ప్రయోజనాన్ని పొందాలంటే వీటిని విడివిడిగానే తీసుకోవాలి. పన్ను ఆదా కోరుకునేట్టు అయితే, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించే ప్రీమియంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కోరుకోవచ్చు. టర్మ్ ప్లాన్లలో గడువు ముగిసే వరకు జీవించి ఉంటే ఎలాంటి ప్రయోజనం అందదు. ఇక పెట్టుబడులపై పన్ను ఆదా కోరుకునే వారు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. వీటిలో చేసే పెట్టుబడిని సెక్షన్ 80సీ కింద చూపించి పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులో దీర్ఘకాలంలో సగటు రాబడి 15 శాతానికి పైనే ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం.. ఈఎల్ఎస్ఎస్ నుంచి వచ్చే రాబడిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. యులిప్‌లో అయితే మెచ్యూరిటీపైనా పన్ను మిహాయింపు ప్రయోజనం లభిస్తుంది. కానీ, ఈల్ఎస్ఎస్ఎస్లో అది లేదు. కాకపోతే యులిప్తో పోలిస్తే ఈక్విటీ ఫండ్స్ రాబడులు ఎంతో మెరుగ్గా ఉంటాయి. దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్షకు మించిన మొత్తంపై 10 శాతం పన్ను చెల్లించిన తర్వాత కూడా నికర రాబడి, యులిప్‌లలో కంటే ఈఎల్ఎస్ఎస్ ప్లాన్లలో ఎక్కువే ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. డెట్‌లో పీపీఎఫ్ సాధనంలో మెచ్యూరిటీ మొత్తంపై పన్ను ఉండదు. ఇంత చెప్పినా, యులిప్ ప్లాన్ తీసుకుకోవడానికే మొగ్గు చూపేవారు.. బ్యాంకుల నుంచి కాకుండా నేరుగా బీమా సంస్థల నుంచి తీసుకోవడం వల్ల సరైన మార్గనిర్దేశం లభిస్తుందనేది నిపుణుల సూచన. -
యులిప్స్‌కు పెరుగుతున్న డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం పాలసీదారులు తమ ఆర్థిక అవసరాలు, లక్ష్యాల సాధన కోసం యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు (యులిప్‌లు), గ్యారంటీ ప్లాన్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థ ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ (సీడీవో) రాహుల్ అగర్వాల్ తెలిపారు. ఇందుకు అనుగుణంగానే తాము ఇటీవలే ఎక్సైడ్ లైఫ్ స్మార్ట్ ఇన్‌కం ప్లాన్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు. ఇది ఇటు జీవితాంతం లైఫ్ కవరేజీ ఇవ్వడంతో పాటు అటు క్రమానుగతంగా ఆదాయం కూడా అందించే సాధనమని వివరించారు. మరోవైపు, పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో టర్మ్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాల్సిన సాధనమని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా జీవిత బీమా పాలసీలంటే మరణానంతరం మాత్రమే ప్రయోజనం చేకూర్చే సాధనాలుగా ఒక ప్రతికూల అభిప్రాయం ఉండటం వల్ల వీటి గురించి మాట్లాడేందుకు ఎక్కువగా ఎవరూ ఇష్టపడరని అగర్వాల్ చెప్పారు. అయితే, కోవిడ్ రాకతో పరిస్థితులు మారాయని, జీవితంలో అనిశ్చితి గురించి అందరూ గ్రహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ పరిణామాల అనంతరం తాము కూడా గణనీయంగా డిజిటల్‌కు మళ్లుతున్నామని వివరించారు. -
ఎండోమెంట్ ప్లాన్లు.. రెండూ కావాలంటే!
యూనిట్ లింక్డ్ పాలసీల్లో ఇన్వెస్ట్ చేస్తే స్టాక్ మార్కెట్ పతనాల్లో చేతికి అందేదేమీ ఉండదు. టర్మ్ ప్లాన్లలో తక్కువకే ఎక్కువ పరిహారం వస్తున్నా... చెల్లించిన ప్రీమియం పాలసీదారులు జీవించి ఉంటే వెనక్కి రాదు. ఒకవేళ పాలసీ కాల వ్యవధిలో దురదృష్టవశాత్తూ మరణిస్తే పరిహారం రావాలి.. లేదా జీవించి ఉన్నా తాము చెల్లించిన మొత్తానికి హామీతో కూడిన రాబడి కలసి అందుకోవాలి. అందుకే వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికల్లో అత్యధికులు ఎండోమెంట్ ప్లాన్లకు చోటిస్తుంటారు. ఆకర్షణీయమైన ఎండోమెంట్ ప్లాన్ల వివరాలు చూస్తే... హెచ్డీఎఫ్సీ సంచయ్ ప్లస్ పాలసీదారులకు హామీతో కూడిన (గ్యారంటీడ్) రాబడులను ఆఫర్ చేస్తుంది. ఈ పాలసీలో నాలుగు ఆప్షన్లు ఉన్నాయి. గ్యారంటీడ్ మెచ్యూరిటీ.. అంటే కాల వ్యవధి ముగిసిన తర్వాత హామీ మేరకు చెల్లించేది. గ్యారంటీడ్ ఇన్కమ్, లైఫ్‌లాంగ్ ఇన్కమ్, లాంగ్‌టర్మ్ ఇన్కమ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఐదేళ్ల ప్రీమియం చెల్లించే వ్యవధి ఎంచుకున్న వారికి పదేళ్లకు.. ఆరేళ్లు ప్రీమియం చెల్లింపును ఎంచుకుంటే 12 ఏళ్లకు.. పదేళ్ల ప్రీమియం కాల వ్యవధిని ఎంచుకున్నవారికి 20 ఏళ్లకు హామీ ఇచ్చిన మేరకు ఏక మొత్తంలో కంపెనీ చెల్లిస్తుంది. గ్యారంటీడ్ ఇన్కమ్ ఆప్షన్లో.. పాలసీ కాల వ్యవధి పూర్తయ్యే వరకు కంపెనీ నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తుంది. అలాగే, లైఫ్‌లాంగ్ ఇన్కమ్లో.. పాలసీదారునికి 99 ఏళ్లు వచ్చే వరకు చెల్లింపులు చేస్తుంది. లాంగ్‌టర్మ్ ఇన్కమ్ ఆప్షన్లో 25 ఏళ్ల పాటు చెల్లింపులు జరుగుతాయి. అన్ని ఆప్షన్లలోనూ పాలసీ కాల వ్యవధి ముగిసిన తర్వాత రెండేళ్ల నుంచి చెల్లింపులు మొదలవుతాయి. పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే.. సమ్ ఇన్సూర్డ్ లేదా అప్పటి వరకు ప్రకటించిన గ్యారంటీడ్ అడిషన్స్‌తో కూడిన మెచ్యూరిటీ ప్రయోజనాలను.. ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తారు. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ 40 ఏళ్ల వ్యక్తికి 5–5.5% మధ్య ప్రస్తుతం ఉంది. ప్రీమియం చెల్లింపు కాలం ఎక్కువ ఉంటే రాబడుల రేటూ ఎక్కువగా వస్తుంది. ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ ఏఎస్ఐపీ ఇది హెచ్డీఎఫ్సీ లైఫ్ సంచయ్ ప్లస్ మాదిరి ప్లాన్. రెండు రకాల ప్లాన్ ఆప్షన్లను అందిస్తోంది. పదేళ్ల ప్లాన్‌కు ఐదేళ్లు, 15 ఏళ్ల ప్లాన్‌కు ఏడేళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా 60 ఏళ్ల వయసు వరకు పాలసీని తీసుకోవచ్చు. గ్యారంటీడ్ అడిషన్స్, గ్యారంటీడ్ లంప్సమ్ మొత్తాన్ని చెల్లిస్తారు. గ్యారంటీడ్ అడిషన్స్ అన్నవి ఏడాదికోసారి పాలసీకి జోడించడం జరుగుతుంది. పాలసీ కాల వ్యవధిని అనుసరించి ఇది ఏటా 10–15% మధ్య ఉండొచ్చు. మరణ పరిహారం సమ్ అష్యూరెన్స్ లేదా గ్యారంటీడ్ మెచ్యూరిటీ ప్రయోజనం ఏది ఎక్కువ అయితే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. గడువు తీరిన తర్వాత ప్రయోజనం ఏకమొత్తంలో తీసుకునే ఆప్షన్ ఒక్కటే ఉంది. క్రమం తప్పకుండా ఆదాయం కోరుకుంటే తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందే. ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ ప్లాటినా అష్యూర్ 50 ఏళ్లు, ఆలోపు వయసున్న ఎవరైనా ఈ ప్లాన్ తీసుకునేందుకు అర్హులే. 12 ఏళ్లు, 15 ఏళ్ల కాల వ్యవధితో వస్తాయి. 12 ఏళ్ల పాలసీకి ఆరేళ్లు, 15 ఏళ్ల పాలసీకి ఏడేళ్లపాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. త్రైమాసికం, అర్ధ సంవత్సరం ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు లేవు. అలాగే, ఈ పాలసీలో కనీస వార్షిక ప్రీమియం రూ.50,000. ఈ పాలసీలో ఇంటర్నల్ రేటు ఆఫ్ రిటర్న్ (ఐఆర్ఆర్) 5.5 శాతంగా ఉంది. ఐసీఐసీఐ లక్ష్య లైఫ్‌లాంగ్ ప్రీమియం చెల్లించిన ఐదేళ్ల తర్వాత నుంచి పాలసీదారులకు ఇందులో ఏటా ఆదాయం లభిస్తుంది. పాలసీదారు మరణించేంత వరకు లేదా 99 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ చెల్లింపులు కొనసాగుతాయి. ఎంత మేర ప్రీమియం చెల్లించడానికి అంగీకారం తెలిపారన్న దాని ఆధారంగా పాలసీ జారీ చేసే సమయంలోనే గ్యారంటీడ్ చెల్లింపులు ఎంత మేర అన్నవి నిర్ణయమవుతాయి. 15 ఏళ్ల ప్రీమియం చెల్లింపు ఆప్షన్లో 50 ఏళ్ల వయసు వారి వరకే ఈ పాలసీని తీసుకునేందుకు అవకాశం ఉంది. 12 ఏళ్ల ప్రీమియం చెల్లింపు ఆప్షన్లో ప్రవేశానికి గరిష్ట వయసు 53 ఏళ్లు. అదే విధంగా పదేళ్ల ప్రీమియం ఆప్షన్లో గరిష్ట ప్రవేశ వయసు 55 ఏళ్లు. హెచ్డీఎఫ్సీ లైఫ్ సంచయ్ ప్లస్ ఇది కూడా హోల్‌లైఫ్ పాలసీయే. అంటే జీవితాంతం బీమా రక్షణ కల్పించే ఉత్పత్తి. 55–65 ఏళ్ల వయసు వరకు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఎంచుకునే వ్యవధిపై ఇది ఆధారపడి ఉంటుంది. 100లో తమ వయసును తీసివేయగా మిగిలే కాలానికి పాలసీ వర్తిస్తుంది. లేదంటే 30 నుంచి 40 ఏళ్ల కాలానికీ పాలసీని ఎంపిక చేసుకోవచ్చు. ఆరు, ఎనిమిది, పది, పన్నేండేళ్ల ప్రీమియం చెల్లింపు ఆప్షన్లలో అనుకూలమైనదానిని ఎంచుకోవచ్చు. తక్షణ ఆదాయం (ఇమీడియట్ ఇన్‌మక్), తర్వాత ఆదాయం (డిఫర్డ్ ఇన్కమ్) అనే ఆప్షన్లు ఉన్నాయి. తక్షణ ఆదాయ ఆప్షన్ ఎంచుకుంటే, ఏటా ప్రకటించే బోనస్‌ను చెల్లించడం జరుగుతుంది. గడువు తీరిన తర్వాత జీవించి ఉంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంకు సమాన మొత్తం ఒకే సారి చెల్లిస్తారు. అదే తర్వాత తీసుకునే ఆదాయ ఆప్షన్లో.. హామీతో కూడిన ఆదాయం, క్యాష్ బోనస్‌ను ప్రీమియం చెల్లింపు గడువు తీరిన ఏడాది తర్వాత నుంచి పాలసీ గడువు ముగిసే వరకు చెల్లించడం మొదలవుతుంది. ప్రీమియం చెల్లింపు గడువు తీరిన నాటి నుంచి పాలసీ ముగియడానికి వరకు ఉండే కాలం లేదా 25 ఏళ్లు ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అప్పటి వరకు ఏటా ఈ చెల్లింపులు జరుగుతాయి. గడువు తీరిన తర్వాత సమ్ అష్యూర్డ్, టర్మినల్ బోనస్ చెల్లిస్తారు. ఎల్ఐసీ జీవన్ ఆనంద్ 50 ఏళ్ల వయసు, ఆలోపున్న వారు పాలసీ తీసుకునేందుకు అర్హులు. కనీస పాలసీ కాల వ్యవధి 15 ఏళ్లు. గరిష్టంగా 35 ఏళ్ల కాలానికి పాలసీ తీసుకోవచ్చు. పూర్తి పాలసీ కాలవ్యవధి వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాక్షిక కాలానికే ప్రీమియం ఆప్షన్ లేదు. పాలసీ అమల్లో ఉన్న కాలంలో మరణం చోటు చేసుకుంటే సమ్ అష్యూరెన్స్ మొత్తాన్ని చెల్లిస్తారు. కాల వ్యవధి తీరే వరకు జీవించి ఉంటే అప్పటి వరకు సమకూరిన బోనస్‌లు అందుకోవచ్చు. అయితే, ఈ పాలసీ కాల వ్యవధి తీరిన తర్వాత కూడా పాలసీదారునికి జీవితాంతం బీమా రక్షణ కొనసాగుతుంది. అంటే కాల వ్యవధి తీరిన తర్వాత ఒకసారి ప్రయోజనం చెల్లించగా, తిరిగి పాలసీదారు మరణానంతరం నామినీలకు సమ్ అష్యూరెన్స్‌ను చెల్లిస్తారు. ప్రతీ రూ.1,000 సమ్ అష్యూరెన్స్ మొత్తంపై 15 ఏళ్ల కాల వ్యవధి ఎంచుకున్న వారికి 2018–19 సంవత్సరానికి జీవన్ ఆనంద్ పాలసీలో రూ.41ను బోనస్‌గా ప్రకటించారు. 16–20 ఏళ్ల కాల వ్యవధి ఎంచుకున్న వారికి ప్రతీ రూ.1,000 బీమాపై ప్రకటించిన బోనస్ రూ.45. అదే 20 ఏళ్లకు పైగా కాల వ్యవధి కలిగిన పాలసీదారులకు రూ.1,000 బీమాపై రూ.49 బోనస్ అందుకున్నారు. వీటిని గుర్తుంచుకోవాలి.. ఎండోమెంట్ పాలసీల్లో సరెండర్ చార్జీలు అధికం. అంటే పాలసీదారులు గడువు తీరకుండానే పాలసీని స్వాధీనం చేయాలనుకుంటే నష్టపోయేది ఎక్కువ. అలాగే, పార్టిసిపేటింగ్ ప్లాన్లలో బోనస్‌లకు గ్యారంటీ లేదు. ఎండోమెంట్ ప్లాన్లలో రాబడులు నికర రాబడి రేటు తక్కువే. కానీ, ఇందులో మెచ్యూరిటీ తీరిన తర్వాత చేసే చెల్లింపులపై ఎటువంటి పన్ను ఉండదు. మరణంపై వచ్చే పరిహారానికి కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. కనుక పన్ను ఆదాను పరిగణనలోకి తీసుకుంటే రాబడి రేటు ఫిక్స్డ్ డిపాజిట్ల స్థాయిలో ఉంటుందని భావించొచ్చు. బీమా పాలసీలకు చేసే ప్రీమియంను సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా పొందొచ్చు. -
ఇన్వెస్ట్మెంట్.. ఇన్సూరెన్స్ కలపొద్దు
పిల్లల పొదుపునకు సుకన్య పథకం మంచిదే లాంగ్‌టర్మ్ సిప్ మ్యూచువల్ ఫండ్ కూడా చూడండి నాకు ఇటీవలే పాప పుట్టింది. మంచి చదువు చెప్పించాలనుకుంటున్నాను. అందుకు 20 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సుకన్య సమృద్ధి యోజనలో నెలకు రూ.2,000 చొప్పున పెట్టుబడి పెడతాను. అదీకాక 20 ఏళ్ల పాటు రిస్క్ తక్కువగా ఉండి, మంచి రాబడులనిచ్చే ఇన్వెస్ట్మెంట్ సాధనాలేమైనా ఉన్నాయా? – రియాజ్, హైదరాబాద్ కొత్తగా పుట్టిన పాప కోసం ఇప్పటి నుంచే ఇన్వెస్ట్ చేయడమన్నది మంచి ఆలోచన. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేయడం మంచి పద్ధతి. నెలకు రూ.2,000 చొప్పున 12 శాతం రాబడినిచ్చే మ్యూచువల్ ఫండ్‌లో మీరు 20 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం రూ.4.8 లక్షలవుతుంది. 20 ఏళ్ల తర్వాత దీని విలువ రూ.18.4 లక్షలుగా ఉంటుంది. ఇక ఈ మొత్తాన్ని మీకు డబ్బులు అవసరమైన 2–3 ఏళ్లకు ముందు (మీరు 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, 17–18 ఏళ్లు దాటిన తర్వాత) ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏదైనా డెట్ ఫండ్‌లోకి మార్చండి. ఇలా చేయడం వల్ల స్టాక్ మార్కెట్లో వచ్చే çస్వల్పకాలిక ఒడిదుడుకుల నుంచి మీరు తగిన విధంగా రక్షణ పొందగలుగుతారు. ఇక సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్వై) అనేది పోస్ట్ ఆఫీస్ స్కీమ్. తమ కూతుళ్ల భవిష్యత్ కోసం ఆదా చేయాలనుకునే తల్లిదండ్రుల కోసం ఈ స్కీమ్‌ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ స్కీమ్ 8.6 శాతం వడ్డీరేటును ఆఫర్ చేస్తోంది. ఈ స్కీమ్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే వడ్డీకి పన్ను రాయితీ ఉంటుంది. గత ఏడాది ఈ వడ్డీరేటు 9.1 శాతంగా ఉంది. వడ్డీరేటు తగ్గినప్పటికీ, పోస్ట్ ఆఫీస్ స్కీముల్లో అధిక వడ్డీ వస్తున్న స్కీమ్ ఇదే. మీరు నెలకు రూ.2,000 చొప్పున 20 ఏళ్లపాటు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ప్రస్తుతమున్న రేటునే పరిగణనలోకి తీసుకుంటే, మీకు 20 ఏళ్ల తరా>్వత రూ.12.28 లక్షలు వస్తాయి. మీరు 20 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కనక ఈ స్కీమ్ కన్నా కూడా బ్యాలెన్స్డ్ లేదా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడి పొందవచ్చు. రిస్క్ వద్దనుకుంటే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 60 శాతం ఈక్విటీ ఫండ్స్‌లో, 40 శాతం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇక మీరు ఇన్వెస్ట్ చేయడానికి కింద ఉదహరించిన ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ, ఫ్రాంక్లిన్ ఇండియా హై గ్రోత్ కంపెనీస్ ఫండ్, హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలన్స్డ్, డీఎస్పీ బ్లాక్‌రాక్ ఆపర్చునిటీస్ ఫండ్, కోటక్ సెలెక్ట్ ఫోకస్ ఫండ్, క్వాంటమ్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ, మిరా అసెట్ ఇండియా ఆపర్చునిటీస్. నేను గతంలో ఒక సంస్థ నుంచి గృహ రుణం తీసుకున్నాను. ఇప్పుడు ఈ రుణ ఖాతాలో నా భార్య పేరు కూడా జత చేసి జాయింట్ లోన్ అకౌంట్‌గా మార్చుకోవాలనుకుంటున్నాను. వీలుంటుందా? – రవి, విశాఖపట్టణం సాధారణంగా గృహ రుణసంస్థలు గృహ రుణాల్లో మార్పులు, చేర్పులకు అంగీకరించవు. ఒకవేళ అంగీకరించినా అది చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న పని. మీరు గృహరుణం తీసుకున్న సంస్థను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మార్చుకోవడం తప్పనిసరి అయితే, మీ గృహరుణ ఖాతాను రీ ఫైనాన్స్ చేయడం ఒక మార్గం. లేదా జాయింట్‌గా కొత్త మార్ట్గేజ్ రుణాన్ని తీసుకోవడం. . మరో మార్గం. నేను 2010లో ఎల్ఐసీ వెల్త్ ప్లస్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. ఈ ప్లాన్ వల్ల కంపెనీయే లాభపడింది. కానీ నాలాంటి ఇన్వెస్టర్లకు ఏమీ ఒరగలేదనిపిస్తోంది. నేను ఇప్పుడేం చేయాలి? ఈ ప్లాన్‌లో కొనసాగమంటారా? లేక వైదొలగమంటారా? – ప్రశాంత్, విజయవాడ ఎల్ఐసీ వెల్త్ ప్లస్ అనేది.. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్). ఈ తరహా ప్లాన్లలో ఖర్చులు ఎక్కువ. రాబడులు తక్కువ. మీరు చెల్లించే ప్రీమియమ్ నుంచి జీవిత బీమా (మోర్టాలిటీ) చార్జీలు, నిర్వహణ వ్యయాలు, ఫండ్ మేనేజ్మెంట్ వ్యయాలు అన్నీ మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఈ వ్యయాల వల్ల మార్కెట్ బాగా ఉన్నప్పటికీ. మీకు అంతంత మాత్రం రాబడులే వస్తాయి. కమీషన్లు అధికంగా వస్తాయి కాబట్టి ఏజెంట్లు ఈ ప్లాన్ల గురించి ఉన్నవి, లేనివి కల్పించి ఇన్వెస్టర్లకు అంటగడతారు. భవిష్యత్తు నష్టాలను తగ్గించుకోవడానికైనా ఈ పాలసీని సరెండర్ చేస్తేనే మంచిది. ఈ పాలసీలకు ఐదేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. మీరు ఈ పాలసీ తీసుకొని ఐదేళ్లు పూర్తయింది కనక సరెండర్ చేయవచ్చు. మీరు సరెండర్ చేసేటప్పుడు ఎంతయితే ఫండ్ విలువ ఉంటుందో, అదే మీ సరెండర్ వేల్యూ అవుతుంది. లాక్ ఇన్ పీరియడ్ పూర్తయింది కనక మీకు ఎలాంటి పన్నుపోటు, జరిమానాలు ఉండవు. భవిష్యత్తులో ఎప్పుడూ ఇన్వెస్ట్‌మెంట్‌ను, ఇన్సూరెన్స్‌ను కలపకండి జీవిత బీమా కోసం ఎప్పుడూ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీనే తీసుకోవాలి. వీటికి ప్రీమియమ్ తక్కువగానూ, రాబడులు ఎక్కువగానూ ఉంటాయి. ఇక ఇన్వెస్ట్మెంట్ అవసరాల కోసం ఏదైనా మంచి రేటింగ్ ఉన్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకొని, ఆ ఫండ్‌లో నెలకు కొంత మొత్తాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. -
ఫండ్స్‌పై పన్నులు ఎలా ఉంటాయి?
నేను 2015, మార్చిలో ఎస్బీఐ ఈవెల్త్ యులిప్‌ను కొనుగోలు చేశాను. దీనికి నెలకు ప్రీమియం రూ.2,500 చొప్పున చెల్లిస్తూ వచ్చాను. ఈ ప్లాన్‌ను సరెండర్ చేయమంటారా ? లేక ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమంటారా? –విజయ్, వరంగల్ ఎస్బీఐ ఈవెల్త్ అనేది యునిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్) ఇలాంటి ఇన్సూరెన్స్–కమ్–ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్ సరైన రాబడులు రావనే ఉద్దేశంతో వీటిల్లో ఇన్వెస్ట్ చేయవద్దని సూచిస్తూ ఉంటాం. ఇవి ఖరీదైనవి. ఇవి మంచి రాబడులను కూడా ఇవ్వలేవు. ఈ స్కీమ్‌ను ఐదేళ్లు గడవక ముందే, అంటే 2020 కంటే ముందే సరెండర్ చేస్తే, వచ్చే మొత్తాన్ని డిస్కంటిన్యూడ్ ఫండ్‌కు బదిలీ చేస్తారు. ఐదేళ్ల లాక్ ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాత వర్తించే చార్జీలను మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని మీకు చెల్లిస్తారు. మీరు సరెండర్ చేసేటప్పుడు ఎన్ఏవీ ఎంత ఉంటుందో అంతే మీకు సరెండర్ వేల్యూగా వస్తుంది. ఈ పాలసీని సరెండర్ చేయడం వల్ల మీకు నష్టాలు వచ్చినప్పటికీ, ఈ పాలసీని సరెండర్ చేస్తేనే మంచిదని మేము భావిస్తున్నాం. ఇక ఈ యులిప్‌లో నెలకు రూ.2,500 చొప్పున ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ మొత్తాన్ని ఇప్పుడు మంచి రాబడులు వచ్చే విధంగా ఇన్వెస్ట్ చేయండి. మీ బీమా అవసరాలకు అనుగుణంగా ఉండే తగిన టర్మ్ బీమా పాలసీని ఎంచుకోండి. వీటితో పాటు రెండు డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఫలితంగా మీకు బీమా అవసరాలు, ఇన్వెస్ట్మెంట్ అవసరాలూ తీరతాయి. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే లాభాలు, డివిడెండ్లపై పన్నులు ఎలా ఉంటాయి? వివరించగలరు. –నరేశ్, తిరుపతి మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల్లో డివిడెండ్, గ్రోత్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. మీరు డివిడెండ్ ఆప్షన్ ఎంచుకున్నారనుకుందాం. ఈక్విటీ, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీకు లభించే డివిడెండ్స్‌పై మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. డెట్ ఫండ్స్‌ను నిర్వహిస్తున్న ఫండ్ హౌస్ 28.33 శాతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ)ని చెల్లించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని డివిడెండ్‌గా ఇన్వెస్టర్లకు చెల్లిస్తాయి. ఇక మూలధన లాభాల పన్ను పరంగా చూస్తే, మ్యూచువల్ ఫండ్స్‌ను ఈక్విటీ, ఈక్విటీయేతర ఫండ్స్‌గా విభజిస్తారు. ఈక్విటీ ఫండ్స్‌ను కొనుగోలు చేసిన ఏడాదిలోపు విక్రయిస్తే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను, ఏడాది తర్వాత విక్రయిస్తే, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈక్విటీ ఫండ్స్‌పై సల్పకాలిక మూలధన లాభాల పన్ను 15 శాతంగా ఉండగా, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ఏమీ ఉండదు. ఇక ఈక్విటీయేతర మ్యూచువల్ ఫండ్స్ విషయానికొస్తే, కొనుగోలు చేసిన మూడేళ్లలోపు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను విక్రయిస్తే, వాటిపై వచ్చిన లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాల పన్నుగానూ, మూడేళ్ల తర్వాత విక్రయిస్తే వచ్చే లాభాలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును విధిస్తారు. ఈక్విటీయేతర మ్యూచువల్ ఫండ్స్‌కు స్వల్ప కాల మూలధన లాభాల పన్ను మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి, ఇక దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును 20 శాతం ఇండేక్సేషన్‌తో కలిపి విధిస్తారు. లార్జ్ క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్, బ్యాలెన్స్డ్ ఫండ్స్(ఈక్విటీ ఆధారిత), సెక్టర్ ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌గా పరిగణిస్తారు. లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్, మనీ మార్కెట్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ ఫండ్ (డెట్ ఓరియంటెడ్), ఈక్విటీ–ఇంటర్నేషనల్ తదితర ఫండ్స్‌ను ఈక్విటీయేతర మ్యూచువల్ ఫండ్స్‌గా పరిగణిస్తారు. నేను ఒక బీమా సంస్థ నుంచి రూ.3 లక్షలకు ఫ్యామిలీ ప్లోటర్ మెడిక్లెయిమ్ పాలసీ తీసుకున్నాను. రూ. 7 లక్షలకు టాప్ అప్ కవర్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. ఫ్యామిలీ ప్లోటర్ మెడిక్లెయిమ్ పాలసీ తీసుకున్న సంస్థ నుంచి కాకుండా వేరే సంస్థ నుంచి టాప్–అప్ కవర్ పాలసీ తీసుకోవచ్చా? – గణేశ్, వైజాగ్ మెడిక్లెయిమ్ పాలసీ ఒక సంస్థ నుంచి, టాపప్ కవర్ పాలసీ మరో కంపెనీ నుంచి తీసుకోవచ్చు. మీరు మెడిక్లెయిమ్ పాలసీ తీసుకోకపోయినా, టాపప్ కవర్ పాలసీ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. నేను ఆర్బిట్రేజ్ ఫండ్‌లో కొంత మొత్తం ఇన్వెస్ట్చేశాను. ఈ ఫండ్ ద్వారా నాకు నెలనెలా కొంత మొత్తంలో డివిడెండ్లు వస్తున్నాయి. ఈ డివిడెండ్ ఆదాయంపై నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? – వినీత్, హైదరాబాద్ పన్ను అంశాల పరంగా చూస్తే, ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్‌గా పరిగణిస్తారు. అందుకని ఈ ఫండ్స్ ద్వారా లభించే డివిడెండ్లపై మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్10(35) ప్రకారం, ఈక్విటీ ఫండ్స్‌గా పరిగణించే ఆర్బిట్రేజ్ ఫండ్స్ (పన్ను అంశాల పరంగా) నుంచి మీకు లభించే డివిడెండ్లపై మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. -
యులిప్స్.. మ్యూచువల్ ఫండ్స్.. ఏవి ఉత్తమం?
యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్)లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? లేక మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నాకు సెక్షన్ 80 సీ ప్రయోజనాలు అవసరం లేదు. కేవలం ఇన్వెస్ట్మెంట్ కోసమే ఈ ఫండ్‌ను ఎంచుకున్నాను. నా నిర్ణయం సరైనదేనా? - ఆనంద్, హైదరాబాద్ బీమా కోసం కానీ, ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ యులిప్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదు. మ్యూచువల్ ఫండ్స్‌ల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలోనే ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమని చెప్పవచ్చు. సౌకర్యం, వ్యయాలు ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటే యులిప్‌ల కన్నా సిప్ విధానమే ఉత్తమం. యులిప్‌లకు సంబంధించి మొదటి 4,5 ఏళ్లలో అధిక వ్యయాలు చార్జీలుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక మ్యూచువల్ ఫండ్స్ గరిష్టంగా 2.5 శాతం చార్జీలను (ఈక్విటీ ఫండ్స్ అయితే 2.25 శాతం మాత్రమే) వసూలు చేస్తాయి. యులిప్‌లు అయితే స్కీమ్ ప్రారంభ సంవత్సరాల్లో కనీసం 5 నుంచి 6 శాతం చార్జీలను వసూలు చేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ విషయంలో పెట్టుబడి వ్యూహాలు, పోర్ట్‌ఫోలియో తదితర అంశాలు పారదర్శకంగా ఉంటాయి. అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్స్ పనితీరు, రాబడులు మీరు ఆశించిన విధంగా లేకపోతే వాటి నుంచి ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. యులిప్‌ల్లో అలా కాదు. మీ ఇన్వెస్ట్మెంట్స్ ఐదేళ్ల కాలానికి లాకిన్ అయి ఉంటాయి. ఇక మీ ఆర్థిక అవసరాలు, మీరు భరించగలిగే రిస్క్‌ను బట్టి ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ ప్లాన్ అనేది లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఈక్విటీ ఫండ్. మా వాల్యూ రీసెర్చ్ దీనికి ఫోర్ స్టార్ రేటింగ్‌ను ఇచ్చింది. మీరు ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒక మ్యూచువల్ ఫండ్‌కు సంబంధించి ఎగ్జిట్లోడ్లోని మార్పులను తెలుసుకునే వీలుందా? ఎగ్జిట్ లోడ్ మార్పుల వివరాలను ఇన్వెస్టర్లకు తెలియజేయాల్సిన బాధ్యత మ్యూచువల్ ఫండ్ సంస్థలకు లేదా? - నిర్మల్ కుమార్, కొత్తగూడెం మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన సమయంలో ఉండే ఎగ్జిట్ లోడ్.. మీ ఇన్వెస్ట్మెంట్ కాలానికి వర్తిస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎగ్జిట్లోడ్లో మార్పులు, చేర్పులు వచ్చినా వాటితో మీకేమీ సంబంధం ఉండదు. ఏదైనా స్కీమ్‌లకు సంబంధించి ఎగ్జిట్ లోడ్‌లో ఏమైనా మార్పులు, చేర్పులు చేస్తే సదరు మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఆ వివరాలను వార్తాపత్రికల ద్వారా తెలియజేయాలి. ఈ వివరాలను తమ వెబ్‌సైట్‌ల్లో కూడా పబ్లిష్ చేయాలి. అయితే నేరుగా ఇన్వెస్టర్లకు తెలియజేయాల్సిన తప్పనిసరి నిబంధన ఏదీ లేదు. ఇలా చేయడం వ్యయంతో కూడుకున్నందున మ్యూచువల్ ఫండ్ సంస్థలకు ఈ వెసులుబాటు ఉంటుంది. ఇన్వెస్టర్లు తాము ఇన్వెస్ట్ చేసిన ఫండ్ రాబడుల గురించే కాకుండా తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ప్రభావం చూపే వ్యయాలు, చార్జీలపై కూడా ఒక కన్నేసి ఉంచడం మంచిది. ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు, లేదా మ్యూచువల్ ఫండ్స్ నుంచి తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకునేటప్పుడు తెలుసుకోవలసిన అన్ని వివరాలను (ప్రతీ స్కీమ్‌కు సంబంధించి) మా వెబ్సైట్ అందిస్తుంది నా వయసు 54 సంవత్సరాలు. నా భార్య వయసు 50 సంవత్సరాలు. మాకు 16 సంవత్సరాల వయసున్న కూతురు ఉంది. మా ముగ్గురి కోసం నేను న్యూ ఇండియా ఎష్యూరెన్స్ నుంచి ఒక మెడిక్లెయిమ్ పాలసీ తీసుకున్నాను. ఒక్కొక్కరికి రూ.5 లక్షల కవర్ ఉండేలా ఏడాదికి రూ.35,000 ప్రీమియం చెల్లిస్తున్నాను. ఇదే కాకుండా రూ.10 లక్షలకు ఐసీఐసీఐ హెల్త్ ఫ్లోటర్ పాలసీ కూడా తీసుకున్నాను. ఈ రెండు పాలసీలకు గత ఏడు సంవత్సరాలుగా ఎలాంటి క్లెయిమ్స్ చేసుకోలేదు. ఈ హెల్త్ పాలసీల్లో కొనసాగమంటారా? వద్దంటారా? తగిన సలహా ఇవ్వండి? - సదాశివరావు, విజయవాడ ఈ వయసులో మెడిక్లెయిమ్ పాలసీల నుంచి వైదొలగడం సరైనది కాదు. మధ్య వయసు తర్వాత ఆరోగ్య పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి. గత ఏడేళ్లుగా మీరు ఎలాంటి క్లెయిమ్ చేయలేదు. కాబట్టి లాయల్టీ అడిషన్స్, నో క్లెయిమ్ బోనస్‌లను మీరు అదనంగా పొందుతారు. ఈ పాలసీల్లోనే కొనసాగడం ఉత్తమం. కొత్తగా మీరు పాలసీ తీసుకుంటే ఈ ప్రయోజనాలు మీకు లభించవు. భవిష్యత్తులో కూడా మీరు ఎలాంటి క్లెయిమ్‌లు చేయాల్సిన అవసరం ఉండకూడదనే ఆశిద్దాం. ఒకవేళ వైద్య సాయం అవసరమైన పక్షంలో ఈ పాలసీలు మీకు తగిన విధంగా వైద్య ఖర్చులను తట్టుకోవడంలో భరోసాను ఇస్తాయని చెప్పవచ్చు. -
నచ్చని పాలసీ.. వైదొలిగేదెలా?
అప్పటికప్పుడు అనుకుని తీసుకున్న కొన్ని బీమా పాలసీలు కాలం గడిచే కొద్దీ .. మన అవసరాలకు ఉపయోగపడనివిగా అనిపించవచ్చు. ఒకోసారి ప్రీమియాలు భారమై.. కట్టలేని పరిస్థితి ఎదురవ్వొచ్చు. ఇలాంటి సందర్భాల్లో పాలసీ నుంచి వైదొలిగితే ఎదురయ్యే లాభనష్టాల గురించి వివరించేదే ఈ కథనం. డిస్కంటిన్యూ చేస్తే వచ్చే ప్రయోజనాలు..బీమా పాలసీని తీసుకున్నాకా గడిచిన సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. కొత్తగా తీసుకున్న పాలసీకి, అప్పుడెప్పుడో తీసుకున్న పాలసీకి వ్యత్యాసముంటుంది. కొత్తగా తీసుకున్న పాలసీ సంగతి విషయానికొస్తే .. ప్రతి బీమా పాలసీలోనూ 15 పని దినాల ఫ్రీ-లుక్ పీరియడ్ ఉంటుంది. డాక్యుమెంట్ మన చేతికి వచ్చాక ఒకవేళ పాలసీని వద్దనుకుంటే ఈ వ్యవధిలోగా బీమా కంపెనీకి తిప్పి పంపేయొచ్చు. ఇలాంటి సందర్భాల్లో కంపెనీ స్టాంపు డ్యూటీ, మెడికల్ టెస్టులు వంటి ఖర్చులు మినహాయించుకుని మీరు కట్టిన పూర్తి ప్రీమియం డబ్బు వాపసు చేయాల్సి ఉంటుంది. అదే యూనిట్ ఆధారిత బీమా పాలసీలైతే (యులిప్) పాలసీని వాపసు చేసిన తేదీ నాడు యూనిట్ విలువ (ఎన్ఏవీ)ని లెక్కగట్టి, ఇతర వ్యయాలు మినహాయించుకుని.. మిగతా మొత్తాన్ని కంపెనీ తిరిగి చెల్లిస్తుంది. పాత పాలసీలైతే: గతంలో ఎప్పుడో తీసుకున్న పాలసీలను డిస్కంటిన్యూ చేయడానికి మరో విధానం అనుసరించాల్సి ఉంటుంది. సాధారణంగా సంప్రదాయ పాలసీల్లో కనీసం మూడేళ్ల పాటు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మధ్యలో మానేస్తే ..అప్పటిదాకా కట్టిన డబ్బు కూడా కంపెనీకే వెళ్లిపోతుంది. పాలసీని డిస్కంటిన్యూ చేసినా పైసా కూడా చేతికి రాదు. అదే మూడేళ్ల పాటు క్రమం తప్పకుండా చెల్లించిన పక్షంలో .. పాలసీని నిలిపేయడానికి రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మొదటిదాని విషయానికొస్తే.. మూడేళ్ల అనంతరం తదుపరి ప్రీమియం చెల్లింపులను ఆపేయొచ్చు. అప్పటిదాకా పాలసీ ప్రయోజనాలు ఆనాటితో నిల్చిపోతాయి. పాలసీ వ్యవధి ముగిసిన తర్వాత మెచ్యూరిటీ మొత్తాన్ని కంపెనీ తిరిగి చెల్లిస్తుంది. ఇక రెండో ప్రత్యామ్నాయం సంగతి చూస్తే.. మీరు ఒక అయిదేళ్ల పాటు ప్రీమియంలు చెల్లించి, నిలిపివేసిన పక్షంలో .. ఆ అయిదేళ్ల కాలం తర్వాత వచ్చే ప్రయోజనాలన్నీ కూడా యథాతథంగా కొనసాగుతాయి. పాలసీ గడువు తీరిన తర్వాత మీ చేతికి అందుతాయి. అంత కాలం ఆగే అవకాశం లేక మధ్యలోనే పాలసీని రద్దు చేసి వచ్చినంత తీసుకుందామనుకుంటే.. ఆ పనీ చేయొచ్చు. కానీ, ఇలాంటి సందర్భాల్లో డబ్బు తక్షణమే చేతికి వస్తుంది..కానీ బీమా కంపెనీ భారీ మొత్తంలో చార్జీలు మినహాయించుకుంటుంది.