ఇన్వెస్ట్‌మెంట్‌.. ఇన్సూరెన్స్‌ కలపొద్దు | Insurance & Investment | Sakshi
Sakshi News home page

ఇన్వెస్ట్‌మెంట్‌.. ఇన్సూరెన్స్‌ కలపొద్దు

Published Mon, Jan 9 2017 2:06 AM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM

ఇన్వెస్ట్‌మెంట్‌.. ఇన్సూరెన్స్‌ కలపొద్దు

ఇన్వెస్ట్‌మెంట్‌.. ఇన్సూరెన్స్‌ కలపొద్దు

పిల్లల పొదుపునకు సుకన్య పథకం మంచిదే
లాంగ్‌టర్మ్‌ సిప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కూడా చూడండి  


నాకు ఇటీవలే పాప పుట్టింది. మంచి చదువు చెప్పించాలనుకుంటున్నాను. అందుకు 20 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. సుకన్య సమృద్ధి యోజనలో నెలకు రూ.2,000 చొప్పున పెట్టుబడి పెడతాను. అదీకాక 20 ఏళ్ల పాటు  రిస్క్‌ తక్కువగా ఉండి, మంచి రాబడులనిచ్చే ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలేమైనా ఉన్నాయా?
– రియాజ్, హైదరాబాద్‌

కొత్తగా పుట్టిన పాప కోసం ఇప్పటి నుంచే ఇన్వెస్ట్‌  చేయడమన్నది మంచి ఆలోచన. డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమాటిక్‌  ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌)లో ఇన్వెస్ట్‌  చేయడం మంచి పద్ధతి. నెలకు రూ.2,000 చొప్పున 12 శాతం రాబడినిచ్చే మ్యూచువల్‌ ఫండ్‌లో మీరు 20 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. మీరు ఇన్వెస్ట్‌ చేసే మొత్తం రూ.4.8 లక్షలవుతుంది. 20 ఏళ్ల తర్వాత దీని విలువ రూ.18.4 లక్షలుగా ఉంటుంది. ఇక ఈ మొత్తాన్ని మీకు డబ్బులు అవసరమైన 2–3 ఏళ్లకు ముందు (మీరు 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, 17–18 ఏళ్లు దాటిన తర్వాత) ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏదైనా డెట్‌ ఫండ్‌లోకి మార్చండి. ఇలా చేయడం వల్ల స్టాక్‌ మార్కెట్లో వచ్చే çస్వల్పకాలిక ఒడిదుడుకుల నుంచి మీరు తగిన విధంగా రక్షణ పొందగలుగుతారు. ఇక సుకన్య సమృద్ధి యోజన(ఎస్‌ఎస్‌వై) అనేది పోస్ట్‌ ఆఫీస్‌ స్కీమ్‌. తమ కూతుళ్ల భవిష్యత్‌ కోసం ఆదా చేయాలనుకునే తల్లిదండ్రుల కోసం ఈ స్కీమ్‌ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ స్కీమ్‌ 8.6 శాతం వడ్డీరేటును ఆఫర్‌ చేస్తోంది. ఈ స్కీమ్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే వడ్డీకి పన్ను రాయితీ ఉంటుంది. గత ఏడాది ఈ వడ్డీరేటు 9.1 శాతంగా ఉంది. వడ్డీరేటు తగ్గినప్పటికీ, పోస్ట్‌ ఆఫీస్‌ స్కీముల్లో అధిక వడ్డీ వస్తున్న స్కీమ్‌ ఇదే. మీరు నెలకు రూ.2,000 చొప్పున 20 ఏళ్లపాటు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. ప్రస్తుతమున్న రేటునే పరిగణనలోకి తీసుకుంటే, మీకు 20 ఏళ్ల తరా>్వత రూ.12.28 లక్షలు వస్తాయి. మీరు 20 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారు కనక ఈ స్కీమ్‌ కన్నా కూడా బ్యాలెన్స్‌డ్‌ లేదా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడి పొందవచ్చు. రిస్క్‌  వద్దనుకుంటే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 60 శాతం ఈక్విటీ ఫండ్స్‌లో, 40 శాతం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. ఇక మీరు ఇన్వెస్ట్‌ చేయడానికి కింద ఉదహరించిన ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. బిర్లా సన్‌ లైఫ్‌ ఈక్విటీ, ఫ్రాంక్లిన్‌ ఇండియా హై గ్రోత్‌ కంపెనీస్‌ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బ్యాలన్స్‌డ్, డీఎస్‌పీ బ్లాక్‌రాక్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్, కోటక్‌ సెలెక్ట్‌ ఫోకస్‌ ఫండ్, క్వాంటమ్‌ లాంగ్‌టర్మ్‌ ఈక్విటీ, మిరా అసెట్‌ ఇండియా ఆపర్చునిటీస్‌.

నేను గతంలో ఒక సంస్థ నుంచి గృహ రుణం తీసుకున్నాను. ఇప్పుడు ఈ రుణ ఖాతాలో నా భార్య పేరు కూడా జత చేసి జాయింట్‌ లోన్‌ అకౌంట్‌గా మార్చుకోవాలనుకుంటున్నాను. వీలుంటుందా?
– రవి, విశాఖపట్టణం
సాధారణంగా గృహ రుణసంస్థలు గృహ రుణాల్లో మార్పులు, చేర్పులకు అంగీకరించవు. ఒకవేళ అంగీకరించినా అది చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న పని. మీరు గృహరుణం తీసుకున్న సంస్థను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మార్చుకోవడం తప్పనిసరి అయితే, మీ గృహరుణ ఖాతాను రీ ఫైనాన్స్‌ చేయడం ఒక మార్గం. లేదా జాయింట్‌గా కొత్త మార్ట్‌గేజ్‌ రుణాన్ని తీసుకోవడం. . మరో మార్గం.

నేను 2010లో ఎల్‌ఐసీ వెల్త్‌ ప్లస్‌ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ప్రారంభించాను. ఈ ప్లాన్‌ వల్ల కంపెనీయే లాభపడింది. కానీ నాలాంటి ఇన్వెస్టర్లకు ఏమీ ఒరగలేదనిపిస్తోంది. నేను ఇప్పుడేం చేయాలి? ఈ ప్లాన్‌లో కొనసాగమంటారా? లేక వైదొలగమంటారా?
– ప్రశాంత్, విజయవాడ
ఎల్‌ఐసీ వెల్త్‌ ప్లస్‌ అనేది.. యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌  ప్లాన్‌(యులిప్‌). ఈ తరహా ప్లాన్‌లలో ఖర్చులు ఎక్కువ. రాబడులు తక్కువ. మీరు చెల్లించే ప్రీమియమ్‌ నుంచి జీవిత బీమా (మోర్టాలిటీ) చార్జీలు, నిర్వహణ వ్యయాలు, ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ వ్యయాలు అన్నీ మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్ట్‌  చేస్తారు. ఈ వ్యయాల వల్ల మార్కెట్‌ బాగా ఉన్నప్పటికీ. మీకు అంతంత మాత్రం రాబడులే వస్తాయి. కమీషన్లు అధికంగా వస్తాయి కాబట్టి ఏజెంట్లు ఈ ప్లాన్‌ల గురించి ఉన్నవి, లేనివి కల్పించి ఇన్వెస్టర్లకు అంటగడతారు. భవిష్యత్తు నష్టాలను తగ్గించుకోవడానికైనా ఈ పాలసీని సరెండర్‌ చేస్తేనే మంచిది. ఈ పాలసీలకు ఐదేళ్ల లాక్‌ ఇన్‌  పీరియడ్‌  ఉంటుంది. మీరు ఈ పాలసీ తీసుకొని ఐదేళ్లు పూర్తయింది కనక సరెండర్‌ చేయవచ్చు. మీరు సరెండర్‌ చేసేటప్పుడు ఎంతయితే  ఫండ్‌  విలువ ఉంటుందో, అదే మీ సరెండర్‌ వేల్యూ అవుతుంది. లాక్‌  ఇన్‌  పీరియడ్‌ పూర్తయింది కనక మీకు ఎలాంటి పన్నుపోటు, జరిమానాలు ఉండవు. భవిష్యత్తులో ఎప్పుడూ ఇన్వెస్ట్‌మెంట్‌ను, ఇన్సూరెన్స్‌ను కలపకండి  జీవిత బీమా కోసం ఎప్పుడూ టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీనే తీసుకోవాలి. వీటికి ప్రీమియమ్‌  తక్కువగానూ, రాబడులు ఎక్కువగానూ ఉంటాయి.  ఇక ఇన్వెస్ట్‌మెంట్‌  అవసరాల కోసం ఏదైనా మంచి రేటింగ్‌ ఉన్న ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ను ఎంచుకొని, ఆ ఫండ్‌లో నెలకు కొంత మొత్తాన్ని సిస్టమాటిక్‌  ఇన్వెస్ట్‌మెంట్‌  ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement