
రేపు మాల్యాపై వారెంటు తీర్పు
ముంబై: విజయ్ మాల్యాపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేయాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) వేసిన పిటిషన్‌ను ముంబై ప్రత్యేక కోర్టు సోమవారం వరకు రిజర్వులో ఉంచింది.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం ఐడీబీఐ నుంచి రూ.950 కోట్లు అప్పుతీసుకున్న మాల్యా ఇందులోనుంచి రూ.430 కోట్లతో విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసిన ఆధారాలను కోర్టుకు ఈడీ సమర్పించింది.