న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అన్యాయం చేయబోమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. విభజన చట్టం హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారు.
కేంద్ర మంత్రి ఇందర్ జిత్ సింగ్ వ్యాఖ్యలు బీహార్కు సంబంధించినవని సీతారామన్ పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులనే ఇందర్జిత్ సింగ్ తెలిపారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను బీహార్తో కలిపి చూడలేమని తెలిపారు. పార్లమెంట్ జరిగితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న భయంతోనే కాంగ్రెస్ అడ్డుకుంటోందని నిర్మలా సీతారామన్ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం అసాధ్యమని కేంద్ర మంత్రి ఇందర్జిత్ సింగ్ పార్లమెంట్లో ప్రకటన చేసిన నేపథ్యంలో సీతారామన్ పైవిధంగా స్పందించారు.
'ఏపీని బీహార్తో కలిపి చూడలేం'
Published Sun, Aug 2 2015 5:10 PM | Last Updated on Wed, Oct 17 2018 5:55 PM
Advertisement
Advertisement