అందుకే మనకు పతకాలు రావడం లేదట! | Why India fails at Olympics.. Chinese media thinks it knows the answer | Sakshi
Sakshi News home page

అందుకే మనకు పతకాలు రావడం లేదట!

Published Thu, Aug 11 2016 6:22 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

అందుకే మనకు పతకాలు రావడం లేదట!

అందుకే మనకు పతకాలు రావడం లేదట!

ప్రపంచంలో ఆరోవంతు జనాభా భారత్‌లోనే ఉన్నారు.. అయినా విశ్వక్రీడలు ఒలింపిక్స్‌లో ఇప్పటికీ బోణీ కొట్టలేదు. ఎన్నో చిన్నాచితకా దేశాలు పతకాలు సాధించి సగర్వంగా తమ క్రీడాస్ఫూర్తిని చాటుతుంటే.. సగటు భారతీయుడు మాత్రం మనకెప్పుడు పతకమని నిట్టూర్చాల్సిన పరిస్థితి.

మరీ ఒలింపిక్స్‌లో మనకు పతకాలు రాకపోవడానికి కారణం ఏమిటంటే.. చైనీస్‌ మీడియా తనకు తెలుసనంటోంది. భారత్‌కు పతకాలు రాకపోవడానికి ఇవే కారణమై ఉంటుందని తాను భావిస్తున్నట్టు చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది.

ఆ కారణలేమిటంటే..

  • మౌలిక వసతులు లేకపోవడం
  • ప్రజారోగ్యం బలహీనంగా ఉండటం
  • పేదరికం
  • క్రీడల్లో పాల్గొనేందుకు బాలికలను అనుమతించకపోవడం
  • బాలురు డాక్టర్లో, ఇంజినీర్లో కావాలని బలవంతపెట్టడం
  • మిగతా క్రీడల కన్నా క్రికెట్‌కు ఎక్కువ ప్రజాదరణ ఉండటం
  • భారత జాతీయ క్రీడ అయిన హాకీ వైభవం కోల్పోవడం
  • గ్రామీణ ప్రాంతాల్లో ఒలింపిక్స్‌ గురించి తెలియకపోవడం


తాజా ఒలింపిక్స్‌లో భారత వైఫల్యం గురించి వ్యాఖ్యానిస్తే కేవలం కారణాలను మాత్రమే చైనా వెబ్‌సైట్‌ టౌటియో.కామ్‌ ఓ వ్యాసంలో పేర్కొంది. చైనా గొప్ప అని చంకలు గుద్దుకోలేదు, భారత్‌ అథమం అని వ్యాఖ్యలు చేయలేదు. కేవలం కారణాలను మాత్రమే విశ్లేషించింది.

'భారత్‌లో 120 కోట్ల జనాభా ఉంది. చైనా తర్వాత అత్యధిక జనాభా కలిగిన దేశం అదే. అయినా ఒలింపిక్స్‌లో ఆ దేశానికి పథకాలు ఎందుకు రావడం లేదు? జనాభాపరంగా పతకాలను బేరిజు వేసి చూస్తే గత ఒలింపిక్స్‌లో అట్టడుగున నిలిచింది భారతే. 2012 ఒలింపిక్స్‌లో భారత్‌ ఆరు పతకాలు సాధించింది. అందులో ఒక్క స్వర్ణం కూడా లేదు' అని చైనా మీడియా పేర్కొంది. ఒలింపిక్స్‌ క్రీడల్లో భారత వైఫల్యానికి కారణాలను సోదాహరణంగా వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement