China media
-
గల్వాన్‌పై చైనాలో అసమ్మతి సెగ!
బీజింగ్: గల్వాన్ ప్రాంతంలో దురాక్రమణకు పాల్పడటం ద్వారా పొరుగుదేశం చైనా ఏం బావుకుందో ఏమో తెలియదుగానీ.. దేశంలోనే కాకుండా.. విదేశాల్లోని స్వదేశీయుల నుంచి అసమ్మతిని మాత్రం మూటగట్టుకుంటోంది. చైనాలో ప్రభుత్వం కనుసన్నలలో నడిచే మీడియా, సామాజిక మాధ్యమాల్లో భారత వ్యతిరేక వ్యాఖ్యానాలు చర్చలు కొనసాగుతున్నా.. ఇతర మాధ్యమాల్లో, విదేశాల్లోని చైనీయుల మధ్య జరుగుతున్న ఆన్లైన్ సంభాషణల్లోనూ గల్వాన్ లోయలో చైనా వ్యవహారంపై పలువురు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే పూర్తయి వివరాలు వెల్లడి కావాల్సిన ఓ ఆన్లైన్ సర్వే ద్వారా ఈ విషయం తెలుస్తోందని జాతీయ స్థాయి టెలివిజన్ చానల్ ఒకటి ఒక కథనాన్ని ప్రచురించింది. సుమారు 75 వేల మంది సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్‌లను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు సెక్‌ల్యాబ్ అండ్ సిస్టమ్స్ అనే సంస్థ చెబుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చైనా ప్రభుత్వం మద్దతుతో నడిచే కొన్ని వ్యూహాత్మక సంస్థల్లో పనిచేసే వారు కూడా ప్రభుత్వం తీరు సరికాదని వ్యాఖ్యానించడం. సెక్ ల్యాబ్ అండ్ సిస్టమ్స్ సోషల్‌మీడియా నెట్‌వర్క్‌లను గణిత శాస్త్ర సూత్రాల ఆధారంగా విశ్లేషించింది. ప్రవాస చైనా జర్నలిస్టుల సోషల్ మీడియా పోస్టుల్లో గల్వాన్ విషయంలో చైనా వైఖరిపై అసంతృప్తి వ్యక్తమవుతూండగా.. అదృశ్య శక్తి ఒకటి ఒకటి వీటన్నింటి వెనుక ఉందని చైనా ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని వీరు భావిస్తున్నారు. వీరే కాకుండా.. హాంకాంగ్, తైవాన్లలో ప్రజాస్వామ్యానికి మద్దతుగా ఆందోళనలు నిర్వహిస్తున్న వారు, ఇతర మద్దతుదారుల్లోనూ ఇదే తరహా సెంటిమెంట్లు నడుస్తున్నాయి. ట్విట్టర్లో సుమారు 34 వేల మంది ఫాలోయర్లు ఉన్న జర్నలిస్ట్, చైనీస్ కుమిన్‌టాంగ్ విప్లవ కమిటీ సభ్యుడు డెంగ్ యూవెన్ భారత్‌తో సరిహద్దు గొడవలు చైనా నేతలకు ఏమాత్రం తగని పని అని ఒక కథనంలో వ్యాఖ్యానించారు. భారత్ చైనాల మధ్య యుద్ధం అసాధ్యమని గతంలో అనుకునేవాళ్లమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని యూవెన్ వ్యాఖ్యానిస్తున్నారు. ట్విట్టర్లో రెండు లక్షల కంటే ఎక్కువమంది ఫాలోయర్లు ఉన్న హు పింగ్ కూడా యూవెన్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చైనాలోనే కొంతమంది పౌరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేస్తూండటం గమనార్హం. ప్రభుత్వ పెద్దల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని, కమ్యూనిస్టు పార్టీ అంతర్గత సమావేశాల రికార్డింగ్‌లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వాంగ్ కియాన్‌కిన్ ఒక ట్వీట్ చేశారు. కొంత కాలానికే ఈ ట్వీట్ డెలిట్ కావడం గమనార్హం. భారత్ అత్యవసరంగా రష్యా నుంచి 33 యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తూండటం వారి సంబంధాలు చైనా కంటే ఆ దేశంతోనే బాగున్నాయని నిరూపిస్తున్నాయని ట్వీట్ ద్వారా వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు, ట్వీట్లు, ఆలోచనలు ఒక పద్ధతి ప్రకారం వస్తున్నవి ఏమీ కావని, ప్రస్తుతానికి వీటిని గుసగుసలుగానే పరిగణించాలని సెక్‌ల్యాబ్స్ నిర్వహించిన సర్వే చెబుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఊపిరిపోసుకుని ఆ తరువాత ఓ వ్యవస్థీకృత ఉద్యమంగా మారిన పలు ఉద్యమాలు కూడా ఇలాంటి చెదురుమదురు అసంతృప్తికర వ్యాఖ్యలతోనే మొదలైన విషయాన్ని గుర్తించాలని చెబుతోంది. -
పాప్ సాంగ్ మ్యాజిక్
-
మ్యాజిక్ చేసిన పాప్ సాంగ్...
సంగీతానికి రాళ్లను సైతం కరిగించే శక్తి ఉందంటారు. ఆ మాట ఎంతవరకు నిజమో తెలీదు గానీ.. 4 నెలలుగా కోమాలో ఉన్న ఓ అమ్మాయిని స్పృహలోకి వచ్చేలా చేసింది మాత్రం ఒక పాటే. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలోని సన్నివేశాన్ని గుర్తుచేసే..ఈ అరుదైన సంఘటన చైనాలో చోటుచేసుకుందని స్థానిక వార్తా పత్రిక పేర్కొంది. ఇంతకీ విషయమేమిటంటే.. చైనాకు చెందిన 24 ఏళ్ల యువతి గత నవంబర్‌లో కోమాలోకి వెళ్లింది. రక్తంలో ఆక్సీజన్ సరఫరా సరిగా లేనందున మెదడు పనిచేయకపోవడంతో ఆమెకు ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో ఉన్న ఆమెకు ఓ నర్స్ సేవలు అందిస్తోంది. ఎలాగైనా ఆమెలో చలనం కలిగించాలనుకున్న నర్స్.. ప్రతీరోజూ జోకులు చెప్తూ ఆమెను నవ్వించడానికి ప్రయత్నించేది. అందులో భాగంగానే ఓ రోజు తనకెంతో ఇష్టమైన.. తైవాన్ పాప్‌స్టార్ జే చో ‘రోజీమేరీ’ పాటను ప్లే చేసింది. ఆ పాట వినగానే యువతి నెమ్మదిగా కళ్లు తెరిచింది. ఈ విషయాన్ని గమనించిన నర్స్.. డాక్టర్‌ను పిలుచుకొని వచ్చింది. నాలుగు నెలలుగా జీవచ్చవంలా పడి ఉన్న పేషెంట్ ఇలా స్పృహలోకి రావడంతో ఆస్పత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఆమెకు మెరుగైన చికిత్సను అందించి తిరిగి మామూలు మనిషయ్యేలా చేశారు. -
భారత్‌ను సులభంగా ఓడించేస్తాం
♦ చైనా మీడియా ప్రేలాపన ♦ పార్లమెంటులో సుష్మా స్వరాజ్ అబద్ధాలు చెప్పారని విమర్శ బీజింగ్: సిక్కిం సరిహద్దు వివాదంపై చైనా అధికార మీడియా మాటలు శ్రుతిమించిపోతున్నాయి. ‘భారత్..చైనా సహనాన్ని పరీక్షించింది. ఆ దేశం డోక్లాం నుంచి తన బలగాలను ఉపసంహరించుకోకపోతే చైనా చేయాల్సింది ఇక యుద్ధమే. యుద్ధమే వస్తే భారత్ సులభంగా ఓడిపోతుంది.. తన ప్రాంతాలనూ కోల్పోతుంది.. భారత ఆర్మీని చైనా ఆర్మీతో పోల్చడం హాస్యాస్పదం.. చైనా సైన్యంతో పోలిస్తే భారత సైన్యం ఎంతో వెనకబడి ఉంది. చైనా సైనిక వ్యయం భారత్ సైనిక వ్యయం కంటే నాలుగు రెట్లు ఎక్కువ’ అని చైనా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోని ‘గ్లోబల్ టైమ్స్’ పత్రిక శుక్రవారం పేర్కొంది. సరిహద్దులోని టిబెట్‌లో ఇటీవల చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) బలగాలు చేసిన కాల్పులు, ఇతర సైనిక విన్యాసాలు, ఆ ప్రాంతానికి తరలించిన సైనిక సామగ్రి కేవలం ప్రదర్శన కోసం చేసినవి కావని హెచ్చరించింది. ఆ బలగాలు తమ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే వరకు వెనక్కి రావని, చైనా ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోదని, ఇది చైనా ప్రజల పవిత్ర ఆశయమని చెప్పుకొచ్చింది. పీఎల్ఏ వాస్తవాధీన రేఖను దాటి అవతలికి వెళ్లే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. భారత్‌కు ఏ దేశమూ మద్దతివ్వదు.. తాము చైనా భూభాగాన్ని ఆక్రమించుకోలేదని, సిక్కిం వివాదంపై అన్ని దేశాలు తమకు మద్దతిస్తున్నాయంటూ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంటులో అబద్ధాలు చెప్పారని గ్లోబల్ టైమ్స్ విమర్శించింది. ‘భారత్ చైనా భూభాగంలోకి చొరబడిన మాట వాస్తవం. దీనిపై అంతర్జాతీయ సమాజం ఆశ్చర్యపోయింది. ఏ దేశమూ భారత దురాక్రమణకు మద్దతివ్వదు’ అని పేర్కొంది. చర్చల కోసం ఇరుపక్షాలు వివాదాస్పద ప్రాంతం నుంచి బలగాలను వెనక్కి పిలవాలని భారత్ చెబుతుండటం ఆ దేశం అపరాధ భావనతో ఉందనడానికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. చర్చల కోసం ముందస్తు షరతుగా సరిహద్దు నుంచి తమ బలగాలను వెనక్కి పిలిపించే ప్రసక్తే లేదని పేర్కొంది. భారత్‌పై చైనా సైనిక ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతుందని, భారత్ చివరకు అవమాన భారంతో మిగిలిపోతుందని ప్రేలాపనలు చేసింది. ఆర్సీఈపీ ఒప్పందానికి విఘాతం కలగొద్దు: చైనా సిక్కిం సరిహద్దు వివాదం వల్ల ఆసియా–పసిఫిక్ దేశాలు కుదుర్చుకోవడానికి యత్నిస్తున్న ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య(ఆర్సీఈపీ) ఒప్పందానికి విఘాతం కలగకూడదని చైనా అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ పేర్కొంది. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో వాణిజ్య, పెట్టుబడుల సరళీకరణకు ఉద్దేశించిన ఈ ఒప్పందం కోసం 16 దేశాలు ఈ నెల 18 నుంచి హైదరాబాద్‌లో చర్చలు జరుపుతున్నాయి. గమనిస్తున్నాం: అమెరికా వాషింగ్టన్: భారత్, చైనా సరిహద్దు వివాదాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా తెలిపింది. రెండు దేశాలు ప్రత్యక్ష చర్చలతో ఉద్రిక్తత తగ్గించుకోవాలని విదేశాంగ ప్రతినిధి హీదర్ నాయెర్ట్ సూచించారు. ‘ప్రత్యక్ష చర్చలను ప్రోత్సహిస్తాం. భారత్, చైనాల పరస్పర చర్చలు జరపనున్నాయి’ అని వెల్లడించారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల(ఎన్ఎస్ఏ) సమావేశం కోసం భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ ఈ నెలాఖర్లో చైనాకు వెళ్తున్న నేపథ్యంలో నాయెర్ట్ చర్చల అంశాన్ని ప్రస్తావించారు. -
మోదీపై చైనా మీడియా ప్రశంసల జల్లు
బీజింగ్: ఓ పక్క సిక్కిం విషయంలో భారత్‌పై అవాకులు చెవాకులు పేలుతూ రాతలు రాస్తున్న చైనా మీడియా అనూహ్యంగా భారత ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసలు కురిపించింది. భారత్‌లో తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను విధానం చరిత్రాత్మకం అంటూ కితాబునిచ్చింది. ఈ ఘనత ప్రధాని నరేంద్రమోదీకే దక్కుతుందంటూ వ్యాఖ్యానించింది. 'అతి తక్కువ ఖర్చుతో కూడిన తయారీ రంగం మెల్లగా చైనా నుంచి వెళ్లిపోతుంది. ఇప్పుడు భారత్‌కు క్లిష్టతరంగా మారనుంది. త్వరలో ప్రపంచ మార్కెట్లో చైనాను భారత్ భర్తీ చేయగలదు' అంటూ అక్కడి వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ కథనాన్ని వెలువరించింది. భారత్-చైనాకు సరిహద్దుగా ఉన్న సిక్కిం ప్రాంతం విషయంలో చైనా ప్రతి రోజు భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే కథనాలు వెలువరిస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా నెల రోజులుగా ఈ తంతు కొనసాగుతోంది. కానీ అనూహ్యంగా గ్లోబల్ టైమ్స్ ఈ కథనం వెలువరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ మౌలిక వసతుల లేమి ఉంటుందని, విధానాల అమలులో ఆయా రాష్ట్రాల మధ్య ఇబ్బందులు ఎదురవుతుంటాయనే ఇదే భారత్‌కు కొంత వెనుకకు లాగే అంశమని కూడా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. అయితే, ఆ సమస్యను కూడా ప్రస్తుతం భారత్ అధిగమిస్తుందని పేర్కొంటూ 'కొత్త పన్ను శకం(జీఎస్టీ) భారత్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మరింత ఊపునిస్తుంది. ఎందుకంటే, ఆయా రాష్ట్రాల మధ్య పన్ను వైరుధ్యాలను ఈ కొత్త నిర్ణయం రూపుమాపుతుంది. కేంద్ర, రాష్ట్ర పన్నులను ఏకం చేస్తుంది. దీంతో కామన్ నేషన్ మార్కెట్ ఏర్పడుతుంది. దీంతో మౌలిక రంగంలో పోటీని కూడా అధిగమించనుంది. ప్రధాని నరేంద్రమోదీ మేక్ ఇండియా కార్యక్రమం ప్రారంభించిన 2014 సెప్టెంబర్నాటి నుంచి భారత్‌ను మరింత ఐక్యంగా ఉంచేందుకు శాయాశక్తులా భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇది ప్రపంచ మార్కెట్‌ను ఆకర్షించేందుకు మంచి చర్య' అంటూ చైనా మీడియా వెల్లడించింది. -
మేకిన్ ఇండియాకు ట్రంప్ నిర్ణయం సవాలే
చైనా మీడియా హెచ్చరిక బీజింగ్: స్థానికులకు ఉద్యోగాలివ్వాలం టూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెస్తున్న విధానాలు.. భారత ప్రధాని మోదీ ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి సవాలేనని చైనా మీడియా హెచ్చరించింది. అయితే, ఆసియా మిత్రులతో అమెరికా సాగిస్తున్న సత్సంబంధాలు భారత్–అమెరికా మైత్రి ని బలోపేతం చేస్తాయని పేర్కొంది. ‘చదువుకున్న, శిక్షణ పొందిన యువకులు ప్రపంచంలో అత్యధికంగా భారత్‌లోనే ఉన్నారు. అమెరికా కంపెనీలకు వారే కీల కం. అందువల్ల అమెరికన్లకే ట్రంప్ నిర్ణయాలు (హెచ్1బీ వీసాలపై ఆంక్షలు) అక్కడి భారత ఐటీ ఉద్యోగులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. అమెరికాకు ఔట్సోర్సింగ్ చేస్తున్న భారత ఐటీ, ఫార్మాకంపెనీలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మేకిన్ ఇండియా నినాదానికి ది ఇబ్బందికరమే’ అంటూ చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. -
భారత్‌కు ట్రంప్ చేరువయ్యే అవకాశం
చైనాను కట్టడి చేసేందుకు ప్రయత్నం: చైనా మీడియా - దీని ప్రభావం చైనాపై తక్కువే అని విశ్లేషణ బీజింగ్: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానంలో భారత్-అమెరికా సంబంధాలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని చైనా మీడియా పేర్కొంది. చైనాను కట్టడి చేసే ప్రయత్నాల్లో భాగంగా ట్రంప్ భారత్‌కు దగ్గరయ్యే అవకాశం ఉందని విశ్లేషించింది. అరుుతే దీని ప్రభావం చైనాపై పెద్దగా ఉండబోదని, అలాగే స్వతంత్ర విదేశాంగ విధానం ఉన్న భారత్ కూడా అమెరికాతో కలిసే అవకాశాలు తక్కువే అని చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది. ‘ట్రంప్ దౌత్య విధానంలో భారత్-అమెరికా సంబంధాలు చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. విదేశాంగ విధానాన్ని పటిష్టపరుచుకోవడానికి.. స్వదేశంలో సమస్యల నుంచి బయటపడేందుకు ట్రంప్ పాలనా యంత్రాంగం భారత్‌తో సంబంధా లు మరింత మెరుగు పరుచుకునేందుకు యత్నించవచ్చు’ అని గ్లోబల్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. ‘స్వదేశంలోని సమస్యల కారణంగా భారత్ అమెరికా ఇబ్బందుల విషయంలో తక్కువగా జోక్యం చేసుకునే అవకాశం ఉంది. దీంతో ట్రంప్ పాలనా యంత్రాంగం భారత్-అమెరికా సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం కుదరకపోవచ్చు. దీనివల్ల భారత్‌తో పాక్షిక కూటమి నిర్మించాలన్న అమెరికా ప్రయత్నం ఫలించకపోవచ్చు’’ అని వెల్లడించింది. వాతావరణ మార్పులు, అణ్వాయుధాల నియంత్రణ, ఉగ్రవాదం వంటి అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికాకు భారత్ మద్దతు అవసరమని, అరుుతే ఇందులో కొన్నింటికే అమెరికా ప్రాధాన్యమి చ్చే అవకాశం ఉందంది. దీనివల్ల అమెరికాపై భారత్‌కు నమ్మకం తగ్గుతుందని, అలాగే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యే అవకాశాలు సన్నగిల్లుతాయని పేర్కొంది. వీటివల్ల భారత్‌తో అమెరికా సంబంధాల ప్రభావం చైనాపై తక్కువగా ఉంటుందని విశ్లేషించింది. -
'పాక్, చైనాలపై దాడి కోసమే రఫేల్ విమానాలు'
రఫేల్ యుద్ధ విమానాలను భారత దేశం ఎందుకు కొనుగోలు చేస్తోంది.. తమ అణ్వస్త్రాలను పాకిస్థాన్, చైనాల మీద ప్రయోగించడానికేనా? అందుకేనని చైనా మీడియా అంటోంది. ప్రపంచంలో ఆయుధాల కొనుగోళ్లలో భారతదేశమే అగ్రగామిగా ఉందని చెబుతోఉంది. రఫేల్ జెట్ విమానాలకు అణు వార్హెడ్లను తీసుకెళ్లగల సామర్థ్యం ఉందని, అంటే భారత అణ్వస్త్ర సామర్థ్యం మరింత పెరుగుతుందని గ్లోబల్ టైమ్స్ అనే పత్రికలో ప్రచురించిన కథనంలో పేర్కొన్నారు. భారత్ దాదాపు రూ. 85వేల కోట్లతో 36 రఫేల్ యుద్ధవిమానాలను కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. మూడేళ్ల తర్వాత అందే ఈ విమానాలతో పాకిస్థాన్, చైనాలలో ఉన్న లక్ష్యాలపై భారత భూభాగం నుంచే దాడులు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత వైమానిక దళంలో 33 ఫైటర్ స్క్వాడ్రన్లు ఉన్నాయి. ప్రతిదాంట్లో 18 చొప్పున యుద్ధవిమానాలున్నాయి. కానీ.. చైనా, పాకిస్థాన్ రెండు దేశాల నుంచి ఉన్న ముప్పును ఎదుర్కోవాలంటే కనీసం 45 యుద్ధ యూనిట్లు కావాల్సి ఉంటుందని అంచనా. 'చైనా బూచి'ని చూపించి తమ ఆయుధ సంపత్తిని పెంచుకోడానికి భారతదేశంతో సహా చైనా పొరుగుదేశాలు ప్రయత్నిస్తున్నాయని గ్లోబల్ టైమ్స్ కథనం పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలోనే ఈ కథనం వెలువడటం విశేషం. ఈ దాడుల గురించి చైనా ఇంతవరకు స్పందించలేదు. ఇన్నాళ్లూ పాకిస్థాన్‌కు గట్టి మద్దతుదారుగా ఉన్న చైనా దీనిపై స్పందించకపోవడం ఒకరకంగా పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బే అవుతుంది. పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లోనే రఫేల్ యుద్ధ విమానాలను భారతదేశం మోహరిస్తుందని అంచనా వేస్తున్నట్లు చైనా పత్రిక పేర్కొంది. నరేంద్రమోదీ ప్రధాన మంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు 6.66 లక్షల కోట్ల రూపాయలను ఆయుధాల కొనుగోలుకు, సైనిక సామర్థ్యాన్ని పెంచుకోడానికి ఖర్చుపెట్టారని ఆ కథనంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. భారతదేశంతో పాటు వియత్నాం, దక్షిణ కొరియా కూడా టాప్ 10 ఆయుధాల కొనుగోలుదారుల్లో ఉన్నాయని చెప్పారు. -
అందుకే మనకు పతకాలు రావడం లేదట!
ప్రపంచంలో ఆరోవంతు జనాభా భారత్‌లోనే ఉన్నారు.. అయినా విశ్వక్రీడలు ఒలింపిక్స్‌లో ఇప్పటికీ బోణీ కొట్టలేదు. ఎన్నో చిన్నాచితకా దేశాలు పతకాలు సాధించి సగర్వంగా తమ క్రీడాస్ఫూర్తిని చాటుతుంటే.. సగటు భారతీయుడు మాత్రం మనకెప్పుడు పతకమని నిట్టూర్చాల్సిన పరిస్థితి. మరీ ఒలింపిక్స్‌లో మనకు పతకాలు రాకపోవడానికి కారణం ఏమిటంటే.. చైనీస్ మీడియా తనకు తెలుసనంటోంది. భారత్‌కు పతకాలు రాకపోవడానికి ఇవే కారణమై ఉంటుందని తాను భావిస్తున్నట్టు చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఆ కారణలేమిటంటే.. మౌలిక వసతులు లేకపోవడం ప్రజారోగ్యం బలహీనంగా ఉండటం పేదరికం క్రీడల్లో పాల్గొనేందుకు బాలికలను అనుమతించకపోవడం బాలురు డాక్టర్లో, ఇంజినీర్లో కావాలని బలవంతపెట్టడం మిగతా క్రీడల కన్నా క్రికెట్‌కు ఎక్కువ ప్రజాదరణ ఉండటం భారత జాతీయ క్రీడ అయిన హాకీ వైభవం కోల్పోవడం గ్రామీణ ప్రాంతాల్లో ఒలింపిక్స్ గురించి తెలియకపోవడం తాజా ఒలింపిక్స్‌లో భారత వైఫల్యం గురించి వ్యాఖ్యానిస్తే కేవలం కారణాలను మాత్రమే చైనా వెబ్సైట్ టౌటియో.కామ్ ఓ వ్యాసంలో పేర్కొంది. చైనా గొప్ప అని చంకలు గుద్దుకోలేదు, భారత్ అథమం అని వ్యాఖ్యలు చేయలేదు. కేవలం కారణాలను మాత్రమే విశ్లేషించింది. 'భారత్‌లో 120 కోట్ల జనాభా ఉంది. చైనా తర్వాత అత్యధిక జనాభా కలిగిన దేశం అదే. అయినా ఒలింపిక్స్‌లో ఆ దేశానికి పథకాలు ఎందుకు రావడం లేదు? జనాభాపరంగా పతకాలను బేరిజు వేసి చూస్తే గత ఒలింపిక్స్‌లో అట్టడుగున నిలిచింది భారతే. 2012 ఒలింపిక్స్‌లో భారత్ ఆరు పతకాలు సాధించింది. అందులో ఒక్క స్వర్ణం కూడా లేదు' అని చైనా మీడియా పేర్కొంది. ఒలింపిక్స్ క్రీడల్లో భారత వైఫల్యానికి కారణాలను సోదాహరణంగా వివరించింది. -
ఒబామా భారత పర్యటన పై చైనా విమర్శలు
-
'ఒబామా వ్యూహాత్మక అడుగులు'
బీజింగ్: భారత్-చైనా, భారత్-రష్యాల మధ్య సంబంధాలను దెబ్బతీయాలనే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని చైనా మీడియా భారత్‌ను హెచ్చరించింది. ఆసియాలో చైనాను అదుపుచేసేందుకు అమెరికా భారత్‌ను ఆయుధంగా వాడుకుంటోందని ఆరోపించాయి. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌ను కీలక శక్తిగా నిలబెట్టడమే లక్ష్యంగా నరేంద్ర మోదీ యూఎస్ పక్షాన నిలుస్తున్నారని షాంగైలోని అంతర్జాతీయ వ్యవహారాల యూనివర్సిటీ పరిశోధకుడు హూ జీయాంగ్ విమర్శించారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం విషయంలో భారత్‌కు మద్ధతుగా నిలుస్తామని వ్యాఖ్యానించడంతో ఒబామా మోదీని తనవైపు తిప్పుకున్నారని పేర్కొన్నారు. కానీ, ఆర్థికాభివద్ధికి, ప్రాంతీయ సుస్థిరతకు చైనా- భారత్ సంబంధాలు కీలకమైనవని మోదీ గుర్తించాలన్నారు.