మేకిన్ ఇండియాకు ట్రంప్ నిర్ణయం సవాలే
చైనా మీడియా హెచ్చరిక
బీజింగ్: స్థానికులకు ఉద్యోగాలివ్వాలం టూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెస్తున్న విధానాలు.. భారత ప్రధాని మోదీ ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి సవాలేనని చైనా మీడియా హెచ్చరించింది. అయితే, ఆసియా మిత్రులతో అమెరికా సాగిస్తున్న సత్సంబంధాలు భారత్–అమెరికా మైత్రి ని బలోపేతం చేస్తాయని పేర్కొంది.
‘చదువుకున్న, శిక్షణ పొందిన యువకులు ప్రపంచంలో అత్యధికంగా భారత్‌లోనే ఉన్నారు. అమెరికా కంపెనీలకు వారే కీల కం. అందువల్ల అమెరికన్లకే ట్రంప్ నిర్ణయాలు (హెచ్1బీ వీసాలపై ఆంక్షలు) అక్కడి భారత ఐటీ ఉద్యోగులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. అమెరికాకు ఔట్‌సోర్సింగ్ చేస్తున్న భారత ఐటీ, ఫార్మాకంపెనీలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మేకిన్ ఇండియా నినాదానికి ది ఇబ్బందికరమే’ అంటూ చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.