Global Times newspaper
-
చైనా భూగర్భంలో ఉక్కు గోడ
బీజింగ్: దాడుల నుంచి అణ్వస్త్రాలను కాపాడుకునేందుకు పర్వతాల కింద, భూగర్భంలో పెద్ద ఉక్కు గోడను చైనా నిర్మించిందని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖలో పనిచేసే శాస్త్రవేత్త క్వియాన్ క్విహు (82) వెల్లడించారు. ఇటీవలే ఈయనకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, చైనా రక్షణ శాఖలో అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. ఈ భారీ ఉక్కు గోడ చైనా వ్యూహాత్మక ఆయుధాలకు రక్షణగా నిలుస్తుందనీ, ఎవరైనా చైనాపై దాడులు చేసినపక్షంలో ఆయుధాలు ధ్వంసం కాకుండా కాపాడుతుందని క్విహు వెల్లడించినట్లు చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ తెలిపింది. పర్వతాల కింద భాగాల్లో చైనాకు రక్షణ స్థావరాలున్నాయి. సాధారణంగా శత్రు దాడుల నుంచి ఆ పర్వతాలే ఆయుధాలకు రక్షణ కల్పిస్తాయి. రక్షణ స్థావరాల్లోకి ప్రవేశించే, నిష్క్రమించే చోట్ల మాత్రం ఎవరైనా దాడులు చేస్తే ఆయుధాలు ధ్వంసం అయ్యే అవకాశం ఉండటంతో ద్వారాల దగ్గర మరింత భద్రంగా ఉండేలా చేసే బాధ్యతను చైనా ప్రభుత్వం క్విహుపై పెట్టింది. ఆయన ఆ పనిని పూర్తి చేయడంతో 2018 ఏడాదికి ‘స్టేట్ ప్రీమినెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డ్’ను చైనా ప్రభుత్వం క్విహుకు ప్రదానం చేసింది. ఓ కార్యక్రమంలో క్విహు మాట్లాడుతూ ‘బల్లెం పదును ఎక్కువవుతున్నప్పుడు కవచం కూడా దృఢంగా తయారైతేనే రక్షణను ఇవ్వగలదు. సవాళ్లకు దీటుగా ఈ భూగర్భ ఉక్కు గోడను నిర్మించాం’ అని చెప్పారు. -
సుష్మా ప్రసంగంపై చైనా మీడియా అక్కసు
-
సుష్మా ప్రసంగం.. దురహంకార వైఖరి
సాక్షి : ఉగ్రవాదాన్ని పెంచి పోసిస్తోంది మీరు కాదా? అంటూ ఐక్యరాజ్య సమితిలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్థాన్‌ను నిలదీసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతి విమర్శలు చేయబోయి ప్రపంచ దేశాల ముందు పాక్ పరువు కూడా పొగొట్టుకుంది. అయితే సుష్మా ప్రసంగంలో తమ దేశ ప్రస్తావన కూడా రావటంపై చైనాకు మండిపోయింది. మిత్ర దేశం పాక్‌కు గట్టి మద్ధతు ప్రకటిస్తూ మరోపక్క భారత్ పై తీవ్ర విమర్శలు గుప్పించింది. సుష్మా ప్రసంగం మొత్తం దురహంకారంగా ఉందంటూ చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ సోమవారం తన సంపాదకీయంలో ప్రచురించింది. ‘పాకిస్థాన్‌లో ఉగ్రవాదం విస్తరించి ఉండొచ్చు. కానీ, ఏ దేశం కూడా దానిని ఒక విధానంగా అంగీకరించబోదు. ఉగ్రవాదాన్ని పెంచిపోషించడం ద్వారా పాక్ సాధించేంది ఏంటి? డబ్బా గౌరవమా?. పొరుగుదేశాలతో సజావుగా సాగిపోతున్న సంబంధాలను, వాణిజ్య ఒప్పందాలను గత కొంత కాలంగా భారత్ తనకు తానుగా దెబ్బ తీసుకుంటోంది. మతపరమైన వైరంతోనే పాక్ పైన ఇలాంటి విమర్శలు గుప్పిస్తోంది’ అంటూ తెలిపింది. చైనా, పాక్‌లతో వైషమ్యాలు మాని ఇకనైనా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తే మంచిదని సూచించింది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌పై నిషేధం విధించాలని ఐరాసలో భారత ప్రతిపాదనను పదే పదే భద్రతామండలి సభ్య దేశం చైనా అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో భారత మీడియా చైనాపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తోందని గ్లోబల్ టైమ్స్ చెప్పింది. అదే సమయంలో డోక్లామ్ వ్యవహారంలో భారత్‌దే ముమ్మాటికీ తప్పని ఆ కథనం ప్రస్తావించింది. -
మేకిన్ ఇండియాకు ట్రంప్ నిర్ణయం సవాలే
చైనా మీడియా హెచ్చరిక బీజింగ్: స్థానికులకు ఉద్యోగాలివ్వాలం టూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెస్తున్న విధానాలు.. భారత ప్రధాని మోదీ ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి సవాలేనని చైనా మీడియా హెచ్చరించింది. అయితే, ఆసియా మిత్రులతో అమెరికా సాగిస్తున్న సత్సంబంధాలు భారత్–అమెరికా మైత్రి ని బలోపేతం చేస్తాయని పేర్కొంది. ‘చదువుకున్న, శిక్షణ పొందిన యువకులు ప్రపంచంలో అత్యధికంగా భారత్‌లోనే ఉన్నారు. అమెరికా కంపెనీలకు వారే కీల కం. అందువల్ల అమెరికన్లకే ట్రంప్ నిర్ణయాలు (హెచ్1బీ వీసాలపై ఆంక్షలు) అక్కడి భారత ఐటీ ఉద్యోగులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. అమెరికాకు ఔట్సోర్సింగ్ చేస్తున్న భారత ఐటీ, ఫార్మాకంపెనీలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మేకిన్ ఇండియా నినాదానికి ది ఇబ్బందికరమే’ అంటూ చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.