బరాక్ ఒబామా
బీజింగ్: భారత్-చైనా, భారత్-రష్యాల మధ్య సంబంధాలను దెబ్బతీయాలనే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని చైనా మీడియా భారత్‌ను హెచ్చరించింది. ఆసియాలో చైనాను అదుపుచేసేందుకు అమెరికా భారత్‌ను ఆయుధంగా వాడుకుంటోందని ఆరోపించాయి. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌ను కీలక శక్తిగా నిలబెట్టడమే లక్ష్యంగా నరేంద్ర మోదీ యూఎస్ పక్షాన నిలుస్తున్నారని షాంగైలోని అంతర్జాతీయ వ్యవహారాల యూనివర్సిటీ పరిశోధకుడు హూ జీయాంగ్ విమర్శించారు.
భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం విషయంలో భారత్‌కు మద్ధతుగా నిలుస్తామని వ్యాఖ్యానించడంతో ఒబామా మోదీని తనవైపు తిప్పుకున్నారని పేర్కొన్నారు. కానీ, ఆర్థికాభివద్ధికి, ప్రాంతీయ సుస్థిరతకు చైనా- భారత్ సంబంధాలు కీలకమైనవని మోదీ గుర్తించాలన్నారు.