
మూడు రోజులు ఆలయంలో ఓ సీఎం !!
దతియా: గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు హోమాలు, ప్రత్యేక పూజలు తమను కొంతైనా కాపాడతాయని నమ్మేవారి జాబితాలో ఆ ముఖ్యమంత్రి పేరు ముందుంటుంది. ఇప్పటికే పలుమార్లు రకరకాల క్రతువులు నిర్వహించిన ఆ సీఎం.. మూడురోజులపాటు ఏకాంతంగా ఓ ఆలయంలో గడిపారు. ఇంతకీ ఎవరా సీఎం? ఎక్కడుందా ఆలయం?
గడిచిన రెండు నెలలుగా దేశాన్ని.. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తున్న 'లలిత్ గేట్'లో రాజస్థాన్ సీఎం వసుంధర రాజే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొటున్నసంగతి తెలిసిందే. ఆమెతోపాటు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాల్సిందేనంటూ విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా సీఎం రాజే గడ్డుపరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. విపక్షాల దూకుడుతో రాజకీయంగా ఈ అంశం ఇప్పుడప్పుడే పరిష్కారం కాదనుకున్నారో ఏమోగానీ.. అడ్డంకులు తొలిగిపోవాలని అమ్మవారిని ఆశ్రయించారు వసుంధరా రాజే.
ఆ క్రమంలోనే తన తల్లిగారి ఊరికి సమీపంగా ఉండే (మధ్యప్రదేశ్, గ్వాలియర్ లోని) దతియా పట్టణంలోని పీతాంబర అమ్మవారి ఆలయంలో ఏకధాటిగా మూడురోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు ప్రారంభమైననాటి నుంచి ముగిసే వరకు ఆలయంలోని ఒక గదిలో ఏకాంతంగా గడిపారు. ప్రధాన పూజారి మినహా ఎవ్వరితోనూ మాట్లాడలేదు. జులై 29న ఆలయానికి చేరుకున్న ఆమె.. 31న గురుపౌర్ణిమనాడు ప్రత్యేక పూజల అనంతరం తిరిగి రాజస్థాన్ వెళ్లిపోయారు.
జులై ప్రారంభంలోనూ ఓ సారి ఆలయానికి వచ్చిన వసుంధర.. కుమారుడు దుష్యంత సింగ్ తో కలిసి పూజలు చేశారు. ఇక్కడి పీతాంబర మాతా భక్తుల కష్టాలను దూరం చేస్తుందని ప్రతీతి. దేశం నలుమూలల నుంచి అనేక మంది రాజకీయనాయకులు దతిచా అందుకే ఎంతో మంది రాజకీయనాయకులు దతియాకు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తూంటారు.