పాపం ఆమె‌! రోడ్డు గుంతను తప్పించబోయి.. | woman biker tries to avoid pothole, gets crushed by truck | Sakshi
Sakshi News home page

పాపం ఆమె‌! రోడ్డు గుంతను తప్పించబోయి..

Published Mon, Jul 24 2017 4:11 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

పాపం ఆమె‌! రోడ్డు గుంతను తప్పించబోయి.. - Sakshi

పాపం ఆమె‌! రోడ్డు గుంతను తప్పించబోయి..

ముంబై: 34 ఏళ్ల ముంబై బైకర్‌ జాగృతి విరాజ్‌ హోగాలే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఓ బైకర్స్‌ బృందానికి నాయకత్వం వహిస్తున్న ఆమె రోడ్డుమీద ఉన్న గుంతను తప్పించుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఓ ట్రక్కు ఢీకొట్టింది. జవ్‌హర్‌-దాహాను హైవేపై ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

బాంద్రాకు చెందిన మహిళల బైకర్స్‌ క్లబ్‌కు చెందిన జాగృతి తోటి బైకర్లతో కలిసి వారాంతం సందర్భంగా జవ్‌హర్‌కు బయలుదేరింది. ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలోని వైతి గ్రామం వద్ద ఓ ట్రక్కును ఆమె ఓవర్‌టేక్‌ చేయబోయిందని, అయితే, రోడ్డుపై గుంత ఉన్న విషయాన్ని ఆమె గుర్తించలేదని, చివరినిమిషంలో గుంత నుంచి తప్పించడానికి ఆమె ప్రయత్నిస్తుండగా ట్రక్కు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. హెల్మెట్‌ ధరించిన ఆమె సరిగ్గానే డ్రైవింగ్‌ చేసిందని, కానీ ట్రక్కు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ఆమె ప్రాణాన్ని బలిగొన్నాడని జాగృతి స్నేహితులు చెప్తున్నారు. డ్రైవర్‌పై 304 సెక్షన్‌ కింద నమోదుచేసినట్టు తెలిపారు. జాగృతికి భర్త విరాజ్‌, తొమ్మిదేళ్ల కొడుకు ఉన్నాడు. ఆమె బైకర్ని మోటర్‌ సైకిల్‌ క్లబ్‌లో క్రియాశీలక సభ్యురాలు. క్లబ్‌లో భాగంగా ఆమె లేహ్‌, లడఖ్‌లకు పలుమార్లు ప్రయాణించారు.
 


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement