రాయ్పూర్: ఛత్తీస్గడ్ పోలీసులు గురువారం కీలక మహిళా మావోయిస్టును అరెస్టు చేశారు. ఆమెపై రూ.మూడు లక్షల రివార్డు కూడా ఉంది. దంతెవాడ జిల్లాలోని దుర్లి గ్రామంలో ఆమెను అదుపులోకి తీసుకున్నామని, మావోయిస్టు కేడర్లో ఆమె ఎక్కువ ప్రభావం చూపగల మహిళ అని పోలీసులు తెలిపారు.
దుర్లి ప్రాంతానికి కీలక మహిళా మావోయిస్టు సోమ్లీ తేలం(27) కొన్ని పనుల నిమిత్తం వస్తుందని సమాచారం తెలుసుకున్న పోలీసులు ముందుగానే అక్కడికి వెళ్లి మాటు వేశారు. ఆమె వచ్చిందని తెలుసుకున్న వెంటనే ఆ గ్రామం మొత్తాన్ని చుట్టుముట్టి సోమ్లీని అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై దోపిడీ, హత్య, దాడులు వంటి పలు ఆరోపణలతో ఇప్పటికే చాలా కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు.
కీలక మహిళా మావోయిస్టు అరెస్టు
Published Thu, Oct 22 2015 5:12 PM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM
Advertisement
Advertisement