
ఆడవాళ్ల ముష్టి యుద్ధాలు..
వరుణుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురవాలని కప్పలకు పెళ్లిళ్లు చేయడం లాంటి ఆచారాలు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇలాంటి ఆచారాలను మనదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ నమ్ముతారు. అమెరికాలోని మెక్సికో ఉన్న కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసేం దుకు ప్రతి ఏటా ఓ పండుగ జరుపుకొంటారు. పండుగ రోజున అక్కడి ఆడవాళ్లంతా ముష్టి యుద్ధాలు చేస్తుంటారు. ఒకరినొకరు రక్తం వచ్చేలా కొట్టుకుంటారు. అంతేకాదు ఆ రక్తాన్ని మట్టిలో కలిపి చేలల్లో చల్లితే వర్షాలు అధికంగా కురుస్తాయని వారి నమ్మకం.