వొడాఫోన్ బంపర్ ఆఫర్: వారికి ఫ్రీ డేటా | Women's Day: Vodafone Offers Free 2GB Data to Women Red Postpaid Subscribers in Delhi NCR | Sakshi
Sakshi News home page

వొడాఫోన్ బంపర్ ఆఫర్: వారికి ఫ్రీ డేటా

Published Tue, Mar 7 2017 6:47 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

వొడాఫోన్ బంపర్ ఆఫర్: వారికి ఫ్రీ డేటా

వొడాఫోన్ బంపర్ ఆఫర్: వారికి ఫ్రీ డేటా

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వొడాఫోన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహిళలకు ఉచితంగా 2జీబీ డేటాను అందించనున్నట్టు పేర్కొంది. వొడాఫోన్ రెడ్ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ కింద మహిళా సబ్స్క్రైబర్లందరికీ ఉచితంగా 2జీబీ డేటాను అందించనున్నట్టు వొడాఫోన్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వొడాఫోన్ రెడ్ పోస్ట్ పెయిడ్ సబ్ స్క్రైబర్లకు మాత్రమేనని కంపెనీ తెలిపింది. కేవలం ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ అందిచనుంది. సబ్ స్క్రైబర్ ప్లాన్ కు 2జీబీ ఉచిత డేటా ఆటోమేటిక్ గా యాడ్ అవుతుందని, మహిళలకు ఈ విషయం టెస్ట్ మెసేజ్ ద్వారా తెలుపుతామని కంపెనీ వివరించింది. ఒకవేళ టెస్ట్ మెసేజ్ ద్వారా  ఈ ఉచిత గిఫ్ట్ ను అందుకోలేని వారు దగ్గర్లోని వొడాఫోన్ స్టోర్ ను సంప్రదించాల్సిందిగా కంపెనీ తెలిపింది.
 
వర్క్ ప్లేస్లో మహిళలకు తమ సంస్థ సమాన అవకాశాలు కల్పిస్తుందని తాము నమ్ముతున్నట్టు వొడాఫోన్ ఇండియా ఢిల్లీ-ఎన్సీఆర్ బిజినెస్ హెడ్ అలోక్ వర్మ తెలిపారు. తమ పురుష కస్టమర్లు మాదిరిగానే మహిళా కస్టమర్లు కూడా మొబైల్ ఇంటర్నెట్ ను ఎక్కువగా వాడుతున్నట్టు తమ డేటా అనాలిస్ట్ లో గుర్తించామన్నారు. ఈ ఆఫర్ మహిళలు జీవితంలో మరింత సాధించేలా తమ ప్రయత్నాలను పునరుద్ధాటిస్తుందన్నారు. కాగ జనవరి నెలలో వొడాఫోన్, రిలయన్స్ జియోకు కౌంటర్ గా అపరమిత కాల్స్, ఎక్కువ డేటాను అందిస్తూ రెడ్ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ప్లాన్స్ రూ.499 నుంచి రూ.1,999 వరకు ఉన్నాయి. రూ.2999 ప్లాన్ కింద ఎంపికచేసిన నగరాల్లో హోమ్ నెట్ వర్క్ పై అపరిమిత కాల్స్, రోమింగ్ అందిస్తోంది. 100 టెస్ట్ మెసేజ్ లు, 40జీబీ 4జీ/3జీ డేటాను 4జీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు కల్పిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement