
అత్యాచారం కేసులో యువకుడికి జీవితఖైదు
బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఓ యువకుడికి ఉత్తరప్రదేశ్ కోర్టు జీవితఖైదు, రూ. 50 వేల జరిమానా విధించింది. దుర్గేష్ అలియాస్ పప్పు (26) అనే ఈ యువకుడు ఏడేళ్ల బాలికపై 2013 ఏప్రిల్ నెలలో అత్యాచారం చేశాడు. అతడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదైంది.
కోర్టులో అతడి నేరం కూడా రుజువైంది. ఇదే నేరానికి అతడు పదేళ్ల కఠిన కారాగారశిక్ష కూడా అనుభవించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఈ రెండు శిక్షలూ ఒకే సమయంలో అమలవుతాయి. అతడు చెల్లించే రూ. 50 వేల జరిమానాలో రూ. 40 వేల మొత్తాన్ని బాధితురాలికి ఇవ్వాలని కోర్టు తెలిపింది.