మా వాళ్లు.. దే బ్రీఫ్డ్ మీ! | ys jagan mohan reddy reminds Cash for Vote scam in ap assembly | Sakshi
Sakshi News home page

మా వాళ్లు.. దే బ్రీఫ్డ్ మీ!

Published Tue, Sep 1 2015 1:01 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

మా వాళ్లు.. దే బ్రీఫ్డ్ మీ! - Sakshi

మా వాళ్లు.. దే బ్రీఫ్డ్ మీ!

హైదరాబాద్: ప్రత్యేక హోదా గురించి చర్చ సమయంలో ఓటుకు కోట్లు అంశం సభలో చర్చకు రావడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పదే పదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి అధికార పక్ష సభ్యులు వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. దాంతో జీఎస్టీ లాంటి ముఖ్యమైన అంశాలపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇదే సమయంలో ఓటుకు కోట్లు అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. వైఎస్ జగన్ ఏమన్నారంటే...

  • జీఎస్టీ లాంటి అత్యంత ప్రధానమైన అంశంపై చంద్రబాబు ఎందుకు పోరాటం చేయట్లేదు?
  • ఇటీవలే తెలంగాణలో ఓటుకు కోట్లు ఇస్తూ దొరికిపోయిన పరిస్థితుల మధ్య ఆయన ఉన్నారు. అందుకే కేంద్రంపై పోరాటం చేయలేకపోతున్నారు.
  • పట్టిసీమ నుంచి ఇసుక మాఫియా దాకా పర్సంటేజీలు తీసుకుంటూ, మట్టి నుంచి బొగ్గు దాకా కమీషన్లు తీసుకుంటున్నారు
  • జీవో 21 నుంచి లైసెన్సులు ఇచ్చేవరకు, స్టీలు ధరలు తగ్గుతున్నా.. అన్ని ధరలు తగ్గుతున్నా విద్యుత్ ఉత్పత్తి ధర మాత్రం పెరుగుతూనే ఉంది
  • కృష్ణపట్నంలో మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 8 కోట్ల రూపాయలు ఉంది
  • ఆర్టీపీపీలో ఒక మెగావాట్కు 6 కోట్లు ఉంది
  • వీటిలో వచ్చిన మొత్తాలను లంచాలుగా తీసుకున్నారు. వాటిని ఇష్టారాజ్యంగా ఖర్చుపెట్టారు.
  • 26 సార్లు మీపేరు చార్జిషీట్లో పెట్టారు.. గుర్తుంచుకోండి.
  • ''మా వాళ్లు దే బ్రీఫ్డ్ మీ..  ఫర్‌ ఎనీ థింగ్‌ ఐయామ్‌ విత్‌ యూ, డోంట్ బాదర్.. వాట్‌ ఆర్ దే స్పోక్‌ వి విల్‌ ఆనర్‌''
  • ఇదంతా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వాళ్లు నిర్ధారించారు

అంటూ చంద్రబాబు కుట్ర మొత్తాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించారు. దాంతో అధికార పక్ష సభ్యులంతా ఒక్కసారిగా లేచి విరుచుకుపడ్డారు. మంత్రి రావెల కిశోర్ బాబు, విప్ ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు లేచి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎదురుదాడికి దిగారు. ఈ సమయంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి వచ్చి నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement