న్యూఢిల్లీ: బ్యాంకుల పనితీరును సమీక్షించటంతోపాటు ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు వల్ల చేకూరే ప్రయోజనాలను ఖాతాదారులకు బదలాయించే విషయమై ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ బుధవారం అన్ని ప్రభుత్వ బ్యాంకుల సీఈఓలతో సమావేశం కానున్నారు. జనవరి నుంచి ఇప్పటిదాకా ఆర్‌బీఐ రె ండు సార్లు వడ్డీరేట్లను తగ్గించినా కూడా దాని వల్ల కలిగే ప్రయోజనాలను బ్యాంకులు మాత్రం రుణగ్రహీతలకు అందించలేదు. ఈ సమావేశంలో జన్‌ధన్ యోజన కార్యక్రమం పురోగతితోపాటు బ్యాంకులకు మూలధనాన్ని సమకూర్చటం ద్వారా వాటి పనితీరును మెరుగుపరచడం వంటి తదితర అంశాలపై చర్చించనున్నారు. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం రుణ వృద్ధిని సమీక్షించనున్నారు.