ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు!
-
సార్వత్రిక ‘సమరం’పై ఈసీ యోచన
-
ఐదారు విడతల్లో నిర్వహించే అవకాశం
-
లోక్‌సభతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నిక లు కూడా..
-
హర్యానా అసెంబ్లీకీ ముందే ఎన్నికలు
-
ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదటివారంలో షెడ్యూల్!
-
జూన్ 1తో ముగియనున్న ప్రస్తుత లోక్‌సభ గడువు
-
జూన్ 2వ తేదీతో ముగియనున్న రాష్ట్ర అసెంబ్లీ గడువు
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఐదారు విడతల్లో లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. ఫిబ్రవరి చివరి రోజుల్లో లేదా మార్చి మొదటి మూడురోజుల్లోగా షెడ్యూల్ వెలువడవచ్చని ఈసీలోని అత్యున్నతస్థారుు వర్గాలు వెల్లడించాయి. జమ్మూ-కాశ్మీర్, ఈశాన్య భారతం, ఛత్తీస్‌గఢ్, యూపీ, బీహార్, బెంగాల్ వంటి సమస్యాత్మక రాష్ట్రాలు, ఇతర కీలక అంశాల దృష్ట్యా దేశవ్యాప్తంగా ఒకే విడత ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సార్వత్రిక ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని వెల్లడించాయి. హర్యానా ప్రభుత్వం కోరితే ఆ రాష్ట్ర అసెంబ్లీకి కూడా ముందే ఎన్నికలను నిర్వహించే అంశాన్ని కూడా ఈసీ గట్టిగా పరిశీలిస్తోందని తెలిపాయి.
భద్రతా దళాల రవాణా ఏర్పాట్లు, ఎండల తీవ్రత, స్కూళ్లు, కాలేజీల సెలవులను దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ రెండోవారం తర్వాత, మే మొదటివారంలోగా పలు విడతల్లో ఎన్నికలు జరపాలని ఈసీ భావిస్తున్నట్టు వివరించాయి. ఈసీ వర్గాల కథనం ప్రకారం... ఎన్నికల సన్నాహకాల విషయమై ఇప్పటికే ఓ రోడ్‌మ్యాప్ సిద్ధమైంది. ఈ మేరకు ఫిబ్రవరిలో సంబంధితులందరితో చర్చించిన తర్వాత షెడ్యూల్ వెలువడుతుంది. దీనితో పాటే మే, జూన్ మాసాల్లో కాలపరిమితి ముగియనున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పోలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించే ప్రతిపాదనను ఈసీ పరిశీలిస్తోంది. అలాగే, అక్టోబర్‌లో కాలపరిమితి ముగియనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలను కూడా ముందుకు జరిపి లోక్‌సభతోపాటే నిర్వహించే అంశం కూడా ఎన్నికల కమిషన్ దృష్టిలో ఉంది. రాష్ట్రాల ఎన్నికల అధికారులు ఆయూ రాష్ట్రాల డీజీపీలతో బలగాల లభ్యతపై ఇప్పటికే చర్చలు కొనసాగిస్తున్నట్లు ఈసీ వర్గాలు వెల్లడించారుు. లోక్‌సభ ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకులుగా నియమించడానికి ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలను తయారుచేసే పని కొనసాగుతున్నట్టు కూడా తెలిపాయి.
80 కోట్ల మందికి ఓటు హక్కు!
ఓటరు జాబితాల్లో కొత్త ఓటర్ల చేర్పు తర్వాత రానున్న ఎన్నికల్లో ఓటు వేసే అర్హత ఉన్నవారి సంఖ్య దాదాపు 80 కోట్లు ఉంటుందని అంచనా. ఓటరు జాబితాల తుది విడత సవరణ ప్రస్తుతం జరుగుతోంది. 2004 ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 67.10 కోట్లుగా ఉంది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఈ సంఖ్య 71.4 కోట్లు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు 1.1 కోట్లమంది పోలింగ్ సిబ్బంది (భద్రతాబలగాలతో కలుపుకొని) అవసరమని అంచనా వేశారు. దేశవ్యాప్తంగా కనీసం 8 లక్షల పోలింగ్ కేంద్రాలు నెలకొల్పనున్నారు. ఎన్నికల్లో వినియోగించేందుకు ఇప్పటికి సిద్ధం చేసిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు దాదాపు 12 లక్షలు. ఫిబ్రవరి మధ్యనాటికి మరో 2.5 లక్షల కొత్త ఈవీఎంలను ఈసీ సమకూర్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుత లోక్‌సభ గడువు వచ్చే జూన్ 1వ తేదీతో ముగుస్తుంది. మే 31వ తేదీకల్లా కొత్త సభ ఏర్పడాల్సి ఉంటుంది.

షెడ్యూల్‌కు ముందు లోక్‌సభ సమావేశం
కొత్త పార్లమెంటులో కొత్త ప్రభుత్వం పూర్తిస్థారుు బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సమయమిచ్చేలా.. 2014-15 ఆర్థిక సంవత్సరంలోని ఆరు నెలల వ్యయ నిమిత్తం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపేందుకు, ఎన్నికల ప్రకటనకు ముందు చివరిసారిగా ప్రస్తుత లోక్‌సభ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ అవినీతి వ్యతిరేక చర్యలకు ఆమోదం పొందేలా త్వరలోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించవచ్చని కూడా ఊహాగానాలు సాగుతున్నారుు.
ఐదు దశల్లో 2009 ఎన్నికలు
గత లోక్‌సభ ఎన్నికలు 2009 ఏప్రిల్ 16 నుంచి మే 13 వరకు అయిదు విడతలుగా జరిగాయి. ఏప్రిల్ 22, 23 తేదీల్లో రెండో విడత, 30న మూడో విడత, మే 7న నాలుగో దశ, చివరిగా 13న ఐదో దశ ఎన్నికలు జరిగారుు. ఫలితాలు మే 16న వెలువడ్డాయి. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూలు ప్రకటన 2009 మార్చి 2న వెలువడింది.