31 పైసలు బలపడ్డ రుపీ | Rupee recovers 31 paise to 61.85 vs dollar on strong equities | Sakshi
Sakshi News home page

31 పైసలు బలపడ్డ రుపీ

Published Sat, Dec 28 2013 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM

31 పైసలు బలపడ్డ రుపీ

31 పైసలు బలపడ్డ రుపీ

ముందురోజు నష్టాల నుంచి దేశీ కరెన్సీ కోలుకుంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి 31పైసలు బలపడి 61.85 వద్ద ముగిసింది.

ముంబై: ముందురోజు నష్టాల నుంచి దేశీ కరెన్సీ కోలుకుంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి 31పైసలు బలపడి 61.85 వద్ద ముగిసింది. ఎఫ్‌ఐఐల పెట్టుబడులతో దేశీయ స్టాక్ మార్కెట్లు పుంజుకోవడం, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం వంటి అంశాలు ఇందుకు కారణంగా నిలిచాయి. కాగా, గురువారం ట్రేడింగ్‌లో రూపాయి ఇదే స్ధాయిలో 37పైసలు నష్టపోయిన విషయం విదితమే. అంతర్జాతీయ మార్కెట్లలో వివిధ కరెన్సీలతో మారకంలో డాలరు విలువ క్షీణించడం కూడా రూపాయికి ప్రోత్సాహాన్నిచ్చినట్లు ట్రేడర్లు తెలిపారు. దీంతో గురువారం ముగింపు 62.16తో పోలిస్తే రూపాయి తొలుత 61.97 వద్ద పటిష్టంగా మొదలైంది. ఆపై ఒక దశలో 62.16కు క్షీణించినప్పటికీ చివరికి 0.5% బలపడి ముగిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement