గోవా ఘువుఘువులు | Taj Banjara hotels offers Goan recipes for Goan food festival | Sakshi
Sakshi News home page

గోవా ఘువుఘువులు

Published Fri, Aug 15 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM

గోవా ఘువుఘువులు

గోవా ఘువుఘువులు

గోవా బీచ్‌లు ఎంత ప్రత్యేకమో... అక్కడి ఆహారానికీ అంతే ప్రత్యేకత. నగరవాసులకు ఆ రుచులను అందించేందుకు బంజారాహిల్స్ హోటల్ తాజ్ బంజారాలోని వెస్ట్‌సైడ్ కెఫేలో గురువారం గోవా ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ‘హైదరాబాదీలకు బిర్యానీ రుచి తెలుసు. ఇప్పుడు విభిన్నమైన గోవా వంటకాలను వడ్డిస్తున్నాం. ఇవి నోరూరించక తప్పవు. రోస్ట్ చేసిన తాజా కొబ్బరి, స్పైసెస్, దినుసులతో పాటు రెడ్ కాశ్మీరీ చిల్లీస్ వాడటం వల్ల కాస్త ఘాటు ఎక్కువగా ఉంటుంది. గోవా ఫిష్ కర్రీ స్పెషల్. ఇంకా వుటన్ వుసాలా, గలిన్హా కఫ్రెల్, గోవా దాల్ వుసాలా విత్ స్పినాచ్, ప్రాన్స్ బల్చావో, చికెన్, డోడల్ వంటివెన్నో ఐటమ్స్ ఇక్కడ వేడివేడిగా వడ్డిస్తున్నాం’ అని చెప్పారు గోవా చెఫ్‌లు డొమింగ్స్ బోర్జెస్, మిక్కీకువూర్. ఈ నెల 25 వరకు మీరూ ఈ రుచులు ఆస్వాదించవచ్చు.
- ఆడెపు శ్రీనాథ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement