ఇక డిజిటల్ మాయా బజార్! | ABK Prasad writes on cashless i.e digital technology | Sakshi
Sakshi News home page

ఇక డిజిటల్ మాయా బజార్!

Published Tue, Dec 6 2016 11:26 PM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

ఇక డిజిటల్ మాయా బజార్! - Sakshi

ఇక డిజిటల్ మాయా బజార్!

రెండో మాట

‘ఈరోజున రాజకీయ పార్టీలనేవి ఆచరణలో అసంబద్ధ సంస్థలుగా తయా రైనాయి. ఎందుకని? ఎలా? పార్టీ నాయకుడనేవాడి బొమ్మే, అతడి విగ్రహమే పార్టీల ప్రతిష్టను కమ్మేస్తోంది. జనసమ్మతమైన వ్యక్తిగా పైకి కనిపించే నాయ కులకు రాజకీయ పార్టీలు జీహుకుం అంటున్నాయి. దీనితో ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కనుకనే కేవలం వ్యక్తినిష్టమైన అధికార వ్యవస్థల కన్నా ప్రజల ప్రాతినిధ్యం కలిగిన, గౌరవనీయమైన పార్టీ, వ్యవస్థ మాత్రమే అభిలషణీయం.’
- ప్రొ. నీరా ఛాందోక్ (ప్రముఖ రాజనీతి శాస్త్ర ఆచార్యులు, ఢిల్లీ విశ్వవిద్యాలయం)

‘పెట్టుబడుల వ్యాప్తి, టెక్నాలజీ పరివ్యాప్తే పన్నులు ఎగవేతకీ, లాభాలను పంచుకోవడానికీ సరికొత్త అవకాశం కల్పించింది.’
-  ఎం. వెంకయ్యనాయుడు (కేంద్రమంత్రి)

మధ్యంతర/అర్ధంతర ఎన్నికలలో ఎవరికి ఓటు వేస్తారన్న అభ్యర్థుల ప్రశ్నలకు ఓటర్లు పరీక్షాపత్రాలలో మాదిరిగా ‘అవును/కాదు’ అని మాత్రమే సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఆచరణలో దీని అర్థం-పౌరులకు ఉన్న ప్రశ్నించే స్వేచ్ఛను లేదా సమస్యలను చర్చించుకునే శక్తియుక్తులను రాజకీయ పరిధి నుంచి తప్పించడమే అవుతుందని ప్రొఫెసర్ నీరా ఛాందోక్ అభిప్రా యపడుతున్నారు. ఈ దృష్ట్యా చూస్తే కేంద్ర మంత్రిమండలిలోని చాలామంది సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని పొగడ్తలలో ముంచెత్తడం తప్ప మరో వాక్యమేదీ పలకడం లేదని కూడా ప్రొఫెసర్ నీరా అన్నారు. అందుకని రాజ కీయ పార్టీలు తమ అస్తిత్వాన్నీ నాయకులనూ నియంత్రించుకుంటూ ఉండా లని ఆమె చెప్పవలసివచ్చింది. లేకుంటే చరిత్ర ఒక ప్రహసనంగానో, లేదా విషాదాంత నాటకం వలెనో మిగులుతుందని కూడా ఆచార్య నీరా అంటారు.

 

బడుగు దేశాల ఆర్థిక వ్యవస్థలపై గురి
ఇదే తీరులో ఇవాళ పాలకవర్గం దేశ ఆర్థిక వ్యవస్థను పునర్ వ్యవ స్థీకరించే పేరుతో వికారపు సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రజాబాహుళ్యం మధ్య అప హాస్యం పాలవుతున్నది. నిజానికి దేశంలో అవినీతి, అక్రమార్జనలు, లంచ గొండితనం, నల్లధనం పెరిగిపోవడానికి కాంగ్రెస్, బీజేపీ-పరివార్ పాలక వర్గ విధానాలే కారణం. ప్రపంచ బ్యాంక్, దాని అనుబంధ సంస్థలు ఐఎం ఎఫ్, ప్రపంచ వాణిజ్య సంస్థలు సంస్కరణల పేరిట అనుసరిస్తున్న ప్రమా దకర ధోరణులే  ఆ ప్రజా వ్యతిరేక సంస్కరణలకు పునాది. భారత్ వంటి వర్ధమాన దేశాల, బడుగు దేశాల కరెన్సీ విలువల మీద దెబ్బ కొట్టడం అలాంటి ప్రజా వ్యతిరేక సంస్కరణలలో భాగమే. ఆ విధంగా తమ దేశ కరెన్సీ విలువను పెంచుకుంటూ ఈ దేశాల ప్రజలను అప్పుల ఊబిలో దింప డమూ అందులో భాగమే. దీనితో ఒక స్వతంత్ర దేశంగా వ్యవహరించగల శక్తిని ఇండియానుంచి హరించివేయడం, ఆర్థిక  పరంగానే కాక, సైనికపరం గాను మనలని ఎదగనివ్వకుండా ఆంగ్లో-అమెరికన్లు గీసిన గీతను దాట కుండా చేయడం ఈ వ్యూహంలో కనిపించేదే. స్వయంకృతాపరాధంగా తెచ్చు కున్న ఆర్థిక సంక్షోభాలలోకి బడుగు, వర్ధమాన దేశాలను కూడా గుంజడం ద్వారా తన ఉనికిని కాపాడుకోవాలని అమెరికా యత్నిస్తున్నది.

ఇటీవల మన పాలకులు తలపెట్టిన పెద్ద నోట్ల ‘రద్దు పద్దు’ కూడా అలాంటి కుట్రలో భాగం. రద్దయిన వాటి స్థానంలో ఆంగ్లో అమెరికన్  పెట్టు బడుల ఉనికికీ, వాటి వ్యాప్తికీ అనుకూలమైన డిజిటల్ (ఎలక్ట్రానిక్) కరెన్సీని ప్రవేశపెట్టడం ద్వారా ధనలావాదేవీలు సాగించాలన్నది అమెరికా, వరల్డ్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల వాంఛ. కానీ అవినీతి పునాదిగా ఎదుగుతూ భారత పాలకుల వారసులుగా 70 ఏళ్లలో దూసుకువచ్చిన మహా కోటీశ్వరులకు మాత్రం రద్దు సంగతి ఆరునెలల ముందే తెలుసునని పత్రి కలూ, లోకమూ కోడై కూశాయి. కానీ ఇదేమీ తెలియనట్టు పాలకులు నటిం చారు. అమెరికా పరిశోధక సంస్థలే ఆమోదించి నట్టు భారత ఆర్థిక వ్యవస్థకు అనాదిగా పునాదిగా, ఊపిరిగా ఉన్న నగదు లావాదేవీల వ్యవస్థ ప్రపంచం లోనే పెద్దది. దానిపై ఆధారపడి ఉన్న వివిధ వృత్తుల వారిని వ్యవసాయ, పారిశ్రామిక కార్మికుల్ని, రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు, అరకొర సంపా దనతో బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రధానంగా ఆధారపడిన మధ్యతరగతి వృత్తుల వారినీ, రైతాంగాన్నీ పెద్ద నోట్ల రద్దుతో పాలకులు కకావికలు చేశారు.

డిజిటల్ లావాదేవీలే లక్ష్యం
పెద్ద నోట్ల రద్దులో కొంత న్యాయం లేకపోలేదుగానీ, ఇదంతా భారత ఆర్థిక వ్యవస్థను డిజిటల్ కరెన్సీ లావాదేవీల వైపు మరల్చడం ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ల వ్యూహమే. 1997-98 నాటి ఆసియా ఆర్థిక సంక్షోభానికి పునాదులు ఎక్కడున్నాయి? అమెరికా ప్రయోజనాల కోసం పునాదులెత్తిన ఆ దేశ మహా కోటీశ్వరుడు జార్జి సోరజ్ సహితం అమెరికా తన ఉనికి కోసం ప్రారంభించిన ‘ప్రపంచీకరణ’ మంత్ర తంత్ర ప్రయోగానికి ఉన్న ప్రమాదకర ప్రజా వ్యతిరేక కోణాన్ని నిర్మొహమాటంగా ఇలా ప్రకటించాడు. ‘వర్ధమాన దేశాల ప్రజలకు ఎలాంటి సామాజికపరమైన జీవనభద్రతను కల్పించక పోవ డంతో అంతంత మాత్రపు అభివృద్ధిలో ఉన్న దేశాలు గ్లోబలైజేషన్  వల్ల దెబ్బ తిన్నాయి. అనేకమంది గ్లోబల్ మార్కెట్ల వల్ల దెబ్బతిన్నారు’ అన్నారాయన. ప్రైవేట్ రంగ వస్తూత్పత్తులకు, ప్రభుత్వరంగ వస్తూత్పత్తులకు మధ్య ఆర్థిక వివక్ష, అసమ పంపిణీ వల్లా ప్రజలు దెబ్బతిన్నారు.

గ్లోబలైజేషన్  వల్ల, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ వల్ల సంపద వృద్ధి కావచ్చుగానీ ప్రజాబాహుళ్యం ఇతర కీలకమైన సామాజిక అవసరాలు తీరవు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ద్రవ్య పెట్టుబడి మార్కెట్లు ఎప్పుడూ సంక్షోభాలకు కేంద్ర స్థానాలుగా ఉంటాయి. ‘ఈ ద్రవ్య సంక్షోభాలు సృష్టించే వినాశనం గురించి అభివృద్ధి చెందిన దేశాల ప్రజలకు పూర్తిగా తెలియక పోవచ్చుగానీ ఈ సంక్షోభాలు వర్ధమాన దేశాలను ఘోరంగా దెబ్బతీస్తారుు. ఈ కారణాలన్నీ కలసి సంపన్న వర్ధమాన దేశాల మధ్య దారుణమైన అసమ పరిస్థితికి దారితీస్తాయి. మార్కెట్ ఆర్థిక వ్యవస్థ సమ ఉజ్జీల మధ్య సరుకులు, సేవల ఆదానప్రదా నాలకు అవకాశం కల్పించవచ్చుగానీ ప్రజా బాహుళ్యపు సమష్టి అవసరాల పట్ల శ్రద్ధ వహించదుగాక వహించదు. శాంతిభద్రతలూ సంత దోపిడీకే కొమ్ము కాస్తాయి. అలాగే సామాజిక న్యాయాన్నీ మార్కెట్ ఆర్థిక వ్యవస్థ కాపా డలేదు’ అని కూడా సోరెజ్ స్పష్టం చేశాడు.

డిజిటల్ వ్యవస్థ ఎంత భద్రం?
ఈ అస్తవ్యస్థ పరిస్థితుల మధ్యనే దూసుకువచ్చిన సమాచార సాంకేతిక వ్యవస్థ, టెక్నాలజీ వల్ల ఎంత ప్రయోజనం ఉందో అంతకన్నా ఎక్కువ అనర్థం నేడు ముమ్మరించింది. ఈ అనర్థాలలో ప్రధానమైంది ధన లావా దేవీలను ఎలక్ట్రానిక్ (డిజిటల్) మాధ్యమం ద్వారా జరపడం. దీనివల్ల అవినీతిని, నల్లధనం బదలాయిపులని, ఎటీఎంలను బద్దలు కొట్టకుండా నిలువరించడంగాని సాధ్యం కాదనీ, ఎవరి డబ్బు ఎప్పుడు, ఎక్కడికి ట్రాన్స్ ఫర్ అవుతుందో, మధ్యలో ఎవరి తస్కరణకు గురవుతుందో తెలియని ఒక మాయాలోకమే డిజిటల్ కరెన్సీ లావాదేవీలని నిపుణులే చెబుతున్నారు. ‘ఎ’ నుంచి ‘బి’కి , ‘బి’ నుంచి ‘సి’కి అలా చేంతా డులా సాగే ట్రాన్ ్సఫర్‌లో చివరి వాడికి దొరికే బదలాయింపు వివరం మొదటి వాడి (‘ఎ’)కు బొత్తిగా తెలియ దని నిపుణులు భావిస్తున్నారు. సంఘటిత (ఫార్మల్), అసంఘటిత (ఇన్ ఫార్మల్) రంగాల మధ్య లావాదేవీలకు డిజిటల్ కరెన్సీ బదలాయింపులు కుదరవని నిపుణుల అంచనా.

నగదు రహిత లావాదేవీలవల్ల లాభాలు ఎన్ని ఉన్నా నిరక్షరాస్యత భారీగా ఉన్న ఇండియా లాంటి దేశంలో క్రెడిట్, డెబిట్ కార్టులంటే తెలియని నిరుపేదలు, మధ్య తరగతిలో కింది స్థాయి వారు ఆ కార్డుల పిన్  (వ్యక్తిగత గుర్తింపు నంబర్) గుర్తు పెట్టుకోలేరు. నేడు ఇంటర్నెట్ వ్యవస్థ మన స్వాధీనంలో లేదు. దాని పీక నొక్కినా, వదిలినా దాని నియం త్రణ  (సర్వర్లు) ‘మీట’ అమెరికాలోనే ఉంది. ఇంటర్నెట్ ఆధారంగా నేరాలు (సైబర్ క్రైమ్స్) రోజురోజుకీ పెరిగి పోతున్నాయని, నెట్ వాడకందార్ల వ్యక్తి గత వివరాలను పాస్‌వర్డ్స్‌ను (రహస్య కోడ్స్‌ను) దొంగిలించడం పెరిగిం దని, వీటి అదుపు అసాధ్యంగా ఉందనీ నెట్ నిపుణులతో పాటు, జాతీయ స్థాయి నేరాల నమోదు సంస్థ ఎన్‌సీఆర్‌బీ తాజా నివేదిక వెల్లడిస్తోంది. సైబర్ నేరగాళ్ల ఆచూకీ తెలుసుకోవడానికి ఇప్పుడున్న నెట్ సెక్యూరిటీ వ్యవస్థ చాలదనీ వారు వెల్లడిస్తున్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారతదేశ పౌరులైన వినియోగదారులను (కస్టమర్లను) ఈ నెట్ వ్యవస్థకు ఆద్యురాలైన అమెరి కాయే ఎలా దోచుకున్నదో, మోసానికి గురిచేసిందో వార్తలు చూశాం. సైబర్ మోసగాళ్ల ఆచూకీ తెలుసుకోడానికీ రూపే/ వీసా/మాస్టర్ కార్డులను విని యోగించి చూసినా లాభం లేకపోయింది. ఆన్‌లైన్ (డిజిటల్) కుంభకోణాలు సోషల్ ఇంజనీరింగ్ ద్వారా, సోషల్ మీడియాగా (సామాజిక మాధ్యమాలు) ఉన్న ‘ఫేస్‌బుక్’ ‘వాట్సప్’ ఈ-మెయిల్, మెసేజ్ బోర్డులు, వెబ్‌సైట్స్ ద్వారా యథేచ్ఛగా సాగుతున్నాయని నిపుణులు నిర్ధారించారు.

అటూ ఇటూ చేసి రానున్న ఎన్నికలలో లబ్ధి కోసం బీజేపీ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోకుండా, ఆకస్మికంగా తలపెట్టిన పెద్ద నోట్ల ప్రయోగం బెడిసి కొడుతున్న తరుణంలో రెండు ఘటనలు జరిగాయి. గుజ రాతీ రియల్ ఎస్టేట్ వ్యాపారి మహేష్ షా వద్ద రూ. 13,860 కోట్లు దొరి కాయి. ఆ కోట్లు తనవి కావనీ, నల్లధనం మార్చుకునేందుకు కొందరు వ్యాపార వేత్తలు, రాజకీయులు తనను వాడుకున్నారనీ, వాళ్ల పేర్లు తగిన సమయంలో వెల్లడిస్తాననీ షా చెప్పాడు. అలా చెప్పిన 24 గంటల్లోనే మరో ముంబై వ్యాపారి కుటుంబం తమవద్ద నల్లధనం రూ. 2 లక్షల కోట్లు ఉన్నా యని (4.12.16) ప్రకటించింది. అయినా ఆర్థికమంత్రి జైట్లీ ఆదాయపన్ను శాఖ అధికారులూ ఈ రెండు ఖాతాలను ‘కట్టుకథలు’గా, ‘అబద్ధాలు’గా ఎందుకు, ఎలా ప్రకటించారన్నది ఆసక్తికర విషయం.

- ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement