మద్యంపై ‘వేటు’ ఓట్లకు రూటు | Alcohol ' nick ' votes Root | Sakshi
Sakshi News home page

మద్యంపై ‘వేటు’ ఓట్లకు రూటు

Published Sat, Aug 6 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

మద్యంపై ‘వేటు’ ఓట్లకు రూటు

మద్యంపై ‘వేటు’ ఓట్లకు రూటు

 జాతిహితం
భారత రాజకీయాల్లో పెంపొందుతున్న గరిష్ట స్థాయి జనాకర్షకవాదమనే కొత్త ధోరణిని అనుసరించి.. మితిమీరి వాగ్దానం చేయాలి, తరచుగా అసాధ్యమైనవి కూడా చేస్తామనాలి. వాటిని ఓట్లుగా సొమ్ము చేసుకున్నాక అప్పడు ఏమి చేయగలమా అని ఆలోచించవచ్చు. నితీష్ మద్యనిషేధం అలాంటిదే. కేంద్రంలోని బీజేపీ ఈ చట్టాన్ని ఆమోదానివ్వడమే కాదు, అంతకంటే నిరంకుశ చ ర్యలను జోడించమని సైతం కోరవచ్చును నిజమే. అలాచేస్తే నితీశ్ మిగతా నాలుగేళ్లూ ఆ చట్టాన్ని అమలు చేస్తూ గడిపేయాల్సి వస్తుంది.
 
ఇంతకూ నితీశ్‌కుమార్ యోచన ఏమిటి? ఆయన తెచ్చిన నూతన మద్య నిషేధ చట్టం ప్రతిని ఇంకా చదవ లేదు. కానీ అది... అవకాశం లేనిదే జరిగి చివరకు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు ఖలీఫా రాజ్యాన్ని ఏర్పాటు చేసేట్టయితే ఈ చట్టం దానికి సరైన నమూనా అవుతుంది. బిహార్ రాష్ట్ర శాసనసభ ఈ వారం ఆమోదించిన చట్టం సారాంశమే ఠారెత్తించేట్టుగా ఉంది. బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఏక్ట్, 2016 మద్య వ్యతిరేక పోరాటాన్ని మునుపెన్నడు ఎరుగని స్థాయికి తీసుకుపోతుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లేదా లౌకిక శక్తులు ఏవీ మద్య వ్యతిరేక పోరాటంలో ఇంత వరకు ఆ స్థాయికి పోలేదు. కుటుంబంలో ఏ ఒక్కరు ఇంట్లో మద్యాన్ని దాచి ఉంచి నట్టు తెలిసినా మొత్తం ఆ కుటుంబ సభ్యులంతా అందుకు బాధ్యులే అవు తారు. మీ టీనేజీ అబ్బాయి మీకు తెలియకుండా ఇంట్లో ఎక్కడైనా మద్యాన్ని దాచి, తాగుతుంటే మీరు కూడా మూల్యం చెల్లించాల్సిందే. చక్కెర లేదా బెల్లం, ద్రాక్ష కలిపిన మిశ్రమం మీ ఇంట్లో దొరికిందంటే, మీరు మద్యం తయారుచేస్తున్నారని భావించే స్వేచ్ఛ పోలీసులకు ఉంటుంది.

మీరు ఓ ఇంటి యజమానైతే ఈ చట్టం వల్ల మీకు సంక్రమించే అసాధారణ అధికారా లను మీరు అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో అద్దెకుండేవారు మద్యం సేవించిన ట్టనిపిస్తే ఆ విషయాన్ని ‘‘తెలపాల్సిన’’ చట్ట్టపరమైన బాధ్యత  మీపైన ఉంటుంది. అద్దె రెట్టింపు చేస్తావా లేకపోతే ఒక ఓల్డ్ మాంక్ సీసా తెచ్చి నీ ఇంట్లో పెట్టేసి పోలీసులకు ఫోన్ చేయమంటావా, నువ్వే ఆలోచించుకో అని మీరు బెదిరించొచ్చు. ఒక గ్రామంలో పదే పదే మద్య నిషేధ చట్టాన్ని ఉల్లం ఘిస్తున్నవారెవరైనా ఉన్నట్టు తేలితే జిల్లా కలెక్టర్ అందరి మీద సమష్టి జరిమానా విధించవచ్చు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వలస పాలకులు ప్రయో గించిన చట్టానికి ఇది 21వ శతాబ్దపు వినూత్న ఆవిష్కరణ. న్యాయపరమైన జాప్యాలతో కాలక్షేపం చేయొచ్చనుకుంటే, మీరా విషయానే మరచిపొండి. బిహార్‌లో మీరు హత్య చేసి తప్పించుకోవచ్చు. కావాలంటే జైల్లో ఉంటూనే మీ మాఫియా ముఠాను నడుపుకోవచ్చు, ఇబ్బందికరమైన పాత్రికేయులను హత్య చేయమని ఆదేశించ్చు. కానీ మద్యం ఆరోపణలు మాత్రం అలా కాదు, వాటిని ప్రత్యేక కోర్టులలో విచారిస్తారు.

వైఫల్యంతోనే గెలుపు
కాబట్టి ఇక అనుమానానికి తావే లేదు. ముఖ్యమంత్రి ఉద్దేశాన్ని, సంకల్పాన్ని బట్టి చూస్తే బహుశా ఇదే అత్యంత పకడ్బందీగా తయారైన చట్టం. అయినా నాలాంటి అలవాటుపడ్డ విమర్శకుడు రెండు ప్రశ్నలను సంధించవచ్చు.  ఒకటి, ఈ చట్టం ప్రకారం అలవాటుపడ్డ తాగుబోతుకు జిల్లా కలెక్టర్ ఆరు నెలల బహిష్కార శిక్షను విధించవచ్చు. అతన్ని ఎక్కడకు బహిష్కరిస్తారు? పక్క గ్రామానికా, జిల్లాకా? లేకపోతే బిహార్‌లోని తాగుడుకు ఆలవాటుపడ్డ వారినందరినీ జార్ఖండ్‌కు, ఉత్తరప్రదేశ్‌కు లేదా ఢిల్లీ, ముంబైలకు పంపే స్తారా? ఇక రెండది, మీరు గనుక పేద బిహారీ అయితే ఆందోళన చెందాల్సిం దేమీ లేదు. బజారుకు 100 నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్నంత వరకు మీరు ఆనందంగా కల్లు అమ్మొచ్చు, తాగొచ్చు. ఈ చట్టం మరీ వెర్రిగొట్టుగా ఉందని నా భయం.

మీ పిల్లలు లేదా తల్లిదండ్రులు ఏ మద్యం లేదా పొగ తాగరాదని లేదా వాటిని ఎక్కువగా చేయకూడదని మీరు భావిస్తారో అదే నితీశ్ భావిస్తున్నా రనడం నిస్సందేహం. కాకపోతే ఆయన ఒక ప్రత్యేక తరహాలో ఆలోచిస్తున్నా రనేదీ నిజమే. కానీ నితీశ్ చేస్తున్నది అసాధారణమైనదేం కాదు. భారత రాజకీయాల్లో పెంపొందుతున్న గరిషస్థాయి జనాకర్షకవాదమనే కొత్త ధోర ణికి అనుగుణంగానే ఆయన ప్రవర్తిస్తున్నారు. మితిమీరి వాగ్దానం చేయాలి, మితిమీరి చేస్తామనాలి, తరచుగా అసాధ్యమైనవి కూడా చేస్తామనాలి. ఆ వాగ్దానాలను ఓట్లుగా సొమ్ము చేసుకున్నాక అప్పడు ఏమి చేయగలమా అని ఆలోచించవచ్చు. ఈ ప్రత్యేక సందర్భంలో, ఈ చట్టాన్ని ఎవరైనా న్యాయ పరంగా సవాలు చేస్తే అది రాజ్యాంగ పరీక్షలో ఎలా నెగ్గుతుందో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఆదేశిక సూత్రాలకు అనుగుణమైన వాటిలో సాధ్య మైన వాటిని చేయాలని ప్రయత్నించడం, చేయడం ఒకటైతే... మొత్తంగా నేర శిక్ష్మాస్మృతికి పూర్తిగా తూట్లు పొడిచేసి, దాన్ని హైజాక్ చేయడం ఇంకొకటి. గాంధేయ రాజకీయాలలో మద్యపానానికి మద్దతునిచ్చేదిగా కనిపించే ఎంత అసమంజసమైన చట్టాన్నైనా, పనినైనా అడ్డగించే ధైర్యం చేయగలరా? కేంద్రంలోని బీజేపీ ఈ చట్టాన్ని అమోదించనివ్వడమే కాదు, దానికి అంత కంటే నిరంకుశ చ ర్యలను జోడించమని సైతం కోరవచ్చును నిజమే. అలాచేస్తే నితీశ్ మిగతా నాలుగేళ్లూ ఆ చట్టాన్ని అమలు చేస్తూ గడిపేయాల్సి వస్తుంది.


మితిమీరిన వాగ్దానాల కొత్త రాజకీయం
రాజకీయవేత్తలు మితిమీరి వాగ్దానాలు చేసి, వాటి ఉద్దేశం నెరవేరాక... ఆ గందరగోళపు చిక్కుముళ్లతో తంటాలు పడమని వాటిని తమ వారసులకు వదిలిపెట్టి పోవడమే గరిష్ట జనాకర్షకవాదం సారాంశం. చెడ్డదే ఆయినా జన రంజకమైన చట్టాన్ని లేదా నిర్ణయాన్ని ప్రశ్నించే మూర్ఖత్వాన్ని ప్రదర్శిం చేవారు ఎవరూ లేరు. యూపీఏ ఇదే పనిని తనదైన పద్ధతిలో చేసింది. దేశంలోని పేదలందరినీ వారి సమస్యలన్నిటి నుంటి బయటపడేసేలా... పేదరికం నుంచి అక్షరాస్యత, ఆకలి వరకు అన్నిటికీ చట్టాలను చేసేసింది. అననుకూల వాతావర ణ పరిస్థితులు, వరదలు, క్షామాలకు వ్యతిరేకంగా, భారత జట్టు క్రికెట్‌లో లేదా హాకీలో ఓడిపోవడానికి వ్యతిరేకంగా చట్టాన్ని చేయడం మాత్రమే వారు మరచిపోయారు లేదా బహుశా అది చేయడానికి వారికి సమయం లేకపోయి ఉండొచ్చు. అప్పట్లో మనం దీన్ని యూపీఏ తాయిలాల రాజకీయాలు అన్నాం.

ఇక అన్నా హజారే ఉద్యమం జన్ లోక్‌పాల్ ముసాయిదా బిల్లును పట్టుకొచ్చింది. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరించి అది సాధ్యం కాదని తెలిసి మరీ దాన్ని ముందుకు తెచ్చారు. ఈ ముసాయిదా ప్రకారం ఇరుగు పొరుగులంతా ఒకరిపైన ఒకరు గూఢచారులు కావొచ్చు. దాని ప్రకారం ఎవరైనా లోక్‌పాల్ దర్యాప్తుదారు, విచారణదారు, తీర్పరి కావచ్చు. శిక్షపడ్డ ప్రతి కేసుకూ వారికి ప్రతిఫలం లభిస్తుంది. అందువల్ల ఎవరూ అమాయకులని తీర్పు రాకుండా చేస్తే నగదు రూప ప్రోత్సాహకం కలుగుతుంది. ఇలాంటి బిల్లు ఎన్నటికీ ఆమోదం పొందదు. ఆ మాట మీరు అన్నారంటే...  అవినీతిపరుల పట్ల సానుభూతి పరులా? అని నిలదీస్తారు. దీంతో దాన్ని అతిగా నీరుగార్చిన రూపంలోని లోక్‌పాల్ చట్టంగా రూపొందింది. అదీ ఆచరణకు వీలుకానిదే. మొత్తం అధికార వ్యవస్థంతా దాన్ని రద్దు చేయాలని ప్రయత్నిస్తోంది. కాలక్రమేణా ప్రధాన మంత్రిని కూడా దాని పరిధి నుంచి తప్పిస్తారని నేను హామీ ఇస్తున్నాను. తీవ్రస్థాయి జనాకర్షకవాదం కోరే డిమాండ్లు అలాంటివే మరి. వాటిని కాదనే ధైర్యం మీరు చేయలేరు.

మన సరికొత్త రాజకీయ పార్టీ ఆప్, ఈ విషయంలో ఆరితేరిన వారినందరినీ తలదన్నిపోయింది. అది తన జన్ లోక్‌పాల్‌తో మొదలుపెట్టి, ఢిల్లీ అంతటా ఉచిత వైఫై, ప్రతి బస్సుకూ సెక్యూరిటీ గార్డూ సీసీటీవీ, వంద కొత్త కళాశాలలు, ప్రైవేటు స్కూళ్లను మించిన ప్రభుత్వ స్కూళ్లు వగైరా వాగ్దానం చేసింది. ఏం జరుగుతుందో మనమే చూద్దాం లేదా జరగకపోతే తప్పు పట్టడానికి దానికి ఎవరో ఒకరు దొరుకుతారు.

నితీశ్ రాజకీయ జూదం
మద్యం చట్టాన్ని సవాలు చేయడం పౌర సమాజానికి సైతం సాధ్యం కాదని నితీశ్‌కు తెలుసు. ఈ చట్టం అంతగానూ చెల్లనిది మహారాష్ట్ర ప్రభుత్వం డాన్స్ బార్లపై విధించిన నిషేధం . దాన్ని సవాలు చేయడం వల్ల భావ ప్రకటన, జీవనోపాధి స్వేచ్ఛల పరుపు కాసింతైనా దక్కింది. మద్యం సేవించడానికి వ్యక్తికి ఉన్న స్వేచ్ఛ కోసం పోరాడటానికి ధైర్యమున్న వ్యక్తైఉండాలి. ఈ బిల్లు చట్టం కావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని నితీశ్‌కు తెలుసు. ఈలోగా ఆయన తాను చేస్తానన్నది చేశానని ప్రచారం చేసుకుంటారు, దాని అమలుకు ఏదైనా అడ్డు తగిలితే లేదా ఆలస్యం జరిగితే అందుకు ఇతరులను తప్పు పట్టవచ్చు. 2019 జాతీయ ఎజెండాలో  ఆ వాగ్దానాన్ని చేర్చవచ్చు.


ఈ మూర్ఖపు వాగ్దానాన్ని అమలు చేయాలనుకుని కాంగ్రెస్ కేరళలో, డీఎంకే తమిళనాడులో విఫలమైతేనేం. నితీశ్ తిరిగి అదే చేశారు. కారణం ఆయనకు కులం పునాదిపై ఆధారపడ్డ ఓట్లు పెద్దగా లేవు. బిహార్‌లో లాలూకే అతని కంటే ఎక్కువ ఓట్లున్నాయి. ప్రతి ఒక్కరూ సోషలిస్టులే కాబట్టి ‘లౌకిక’ స్థానం కోసం పోటీపడేవారు చాలా మందే ఉండారు. ఈ మద్య నిషేధం, ఓటర్లలో ప్రత్యేకించి మహిళల్లో నితీశ్‌కు ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించి పెడుతుంది. ఇత రులు అలాంటి యోచనే చేసి, అనుసరించి చిక్కుల్లోపడ్డారు లేదా హాని చేశారు లేదా రెండూ జరిగాయి. స్విస్ బ్యాంకుల్లోని లక్ష కోట్ల డాలర్లను తిరిగి తెస్తామని బీజేపీ చేసిన వాగ్దానం చివరికి ఓ పరిహాసోక్తిగా మారింది. కానీ ఆ వాగ్దానం ఫలితంగా నిరంకుశమైన నల్లధనం చట్టం వచ్చింది. అది పాత విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టాన్ని (ఫెరా), మరింత దురాశాపరులైన, మరింత శక్తివంతులైన పన్నుల అధికారులను రంగం మీదకు తెచ్చింది. ఘోర వైఫల్యానికి దారి ఎప్పుడూ సదుద్దేశాలతో పరిచినదే అయివుంటుంది. ఇది బాగా కాలం చెల్లిన, పాత నానుడి. నేటి మన రాజకీయాల్లో ఘోర వైఫల్యానికి దారి ఎప్పుడూ అత్యంత కచ్చితంగా లెక్క గట్టిన నిరాశావాదం, ఉద్దేశపూర్వకమైన అబద్ధాలు, ఎలాగోలా గెలవాలని ముందు తరాల తరఫున మితిమీరి వాగ్దానాలు చేయడంతో పరచినదై ఉంటుందని అనడం మరింత సమంజసమవుతుంది. ఈ భారతీయ తరహా గరిష్ట జనాకర్షకవాదం ఎన్నికల్లో ఫలితాలను ఇవ్వడం చూస్తున్నాం. నితీశ్ యోచన సరిగ్గా ఇదే.

రచయిత:శేఖర్ గుప్తా
twitter@shekargupta

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement