shekhar guptha
-
ఇది ‘పునాది’ లేని పోరాటం!
జాతిహితం భారతీయుల్లో 31 శాతం మంది మాత్రమే 2014లో మోదీకి ఓటు వేశారని మనకు తెలుసు. రాహుల్ పదే పదే మోదీపై చేస్తున్న దాడులను ప్రజలు ఆస్వాదించవచ్చు. కానీ వీరు గంపగుత్తగా రాహుల్‌కి ఓట్లేస్తారని దీనర్థం కాదు. రాజీలేని మోదీ వ్యతిరేక తత్వం దానికదే ఒక భావజాలంగా కానీ లేక ఎన్నికల్లో ప్రత్యామ్నాయంగా కానీ కాజాలదు. మోదీపై ఆగ్రహం ఒక్కటే మీ లక్ష్యమైతే ప్రజలు తమకు అందుబాటులోని అనేక ప్రత్యామ్నాయాలలో ఉత్తమమైన వారిని ఎంచుకోవచ్చు. రాహుల్ దూకుడు శైలి మోదీ ప్రతిష్టకు నష్టం కలిగించి, ప్రజలు అంతిమంగా ప్రధానిని ఓడిస్తారని భావించినప్పటికీ, మోదీ స్థానంలో ప్రజలు కాంగ్రెస్‌ను ఎంచుకుంటారని భావించవచ్చా? చాన్నాళ్ల క్రితం అప్పటి ప్రజాస్వామిక వ్యవస్థల్లో నాయకులు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక, తమకు ఓటు వేయని వారితో సహా ప్రజలందరి ప్రయోజనాలను కూడా సంరక్షించేవారు. ఎందుకంటే ప్రభుత్వ ఆఫీసు అంటే ప్రజల విశ్వాసం. కానీ ఇప్పుడు మాత్రం పాలకులు తమను బలపర్చే ప్రజా పునాది గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. వారి మద్దతుదారులు తప్ప తక్కినవారు ఇప్పుడు లెక్కలోకి రారు. ఒక ఉదాహరణ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లక్షలాదిమంది అమెరికన్లు మతిలేని మూర్ఖుడు, జాత్యహం కారి వగైరా వగైరా పదాలతో నిందిస్తున్నారు. కానీ తనను విమర్శిస్తున్నవారి పట్ల ట్రంప్ ఎంత తూష్ణీభావంతో చూస్తే అంత కంటే ఎక్కువగా మద్దతుదారులు ట్రంప్‌ను ఆరాధిస్తుంటారు. మిగతావారి విషయం ఏమిటి? వారు రంగం నుంచి తప్పుకోవలసిందే. ఇదేం సూచిస్తుంది? నీవు నాకు ఓటు వేయకపోతే, నానుంచి మీరు ఏమీ ఆశించవద్దు. అలాగే అధికారంలోకి రావడానికి హిందూ ఓటుపై స్వారీ చేస్తున్నమోదీ బీజేపీని చూడండి. 20 శాతం ముస్లిం జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో అటు లోక్‌సభలో, ఇటు అసెంబ్లీలో బీజేపీ ఒక్కరంటే ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా నిలబెట్టకుండానే రెండింటిలోనూ ఘనవిజయం సాధిం చింది. సవర్ణులు అంటే ఎగువ, మధ్య స్థాయి కులాల ఓట్లను కొల్లగొట్టింది కాబట్టే బీజేపీ గత రెండు ఎన్నికల్లోనూ ముస్లింలను, చాలావరకు దళితులను పక్కనబెట్టేసింది. అందుకే అగ్రకుల హిందువులను వైదొలుగుతున్న మోదీ ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లతో సత్కరించింది. ఈ నేపథ్యంలో రాహుల్ తనకున్న ప్రజాపునాదిని ఎలా నిర్వచిస్తారు? ప్రజాపునాది అంటే ఏమిటో ఆయనకు తెలుసా? మోదీ వ్యతిరేకవాదం ఒక్కటి మాత్రమే మీ ప్రచారానికి ఇప్పుడు సరిపోదన్నది స్పష్టమే. భారతీయుల్లో 31 శాతం మంది మాత్రమే 2014లో ఓటు వేశారని మనకు తెలుసు. పైగా మోదీని ఇప్పుడు కూడా మీరు ఇష్టపడకపోవచ్చు లేక తనతో విభేదించవచ్చు. రాహుల్ పదే పదే మోదీపై చేస్తున్న దాడులను ప్రజలు ఆస్వాదించవచ్చు. కానీ ఇలాంటివారు గంపగుత్తగా రాహుల్‌కి ఓట్లేస్తారని దీనర్థం కాదు. మోదీపై ఆగ్రహం ఒక్కటే మీ ఉద్దేశం అయితే మీరు అందుబాటులో ఉన్న అనేక ప్రత్యామ్నాయాలలో ఉత్తమమైన వారిని ఎంచుకోవచ్చు. బెంగాల్లో మమత కావచ్చు, ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ కావచ్చు. బిహార్‌లో లాలూ కావచ్చు. కేరళలో వామపక్షం కావచ్చు. ఇక తెలంగాణ, ఒడిశా, ఢిల్లీల్లో వరుసగా కేసీఆర్, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు. రాహుల్ ఒంటెత్తు మనస్తత్వం మాత్రమే మోదీ ప్రతిష్టకు అంత నష్టం కలిగించి ప్రజలు బీజేపీ ప్రధానిని ఓడిస్తారని భావించినప్పటికీ, మోదీ స్థానంలో ప్రజలు కాంగ్రెస్‌ను ఎంచుకుంటారని భావించవచ్చా? ఈరోజు అలాంటి అవకాశమే కనబ డటం లేదు. ఎందుకంటే ఒక బలీయమైన ప్రతిపాదన లేదా అభిప్రాయం (మోదీది అధమపాలన) దానికదే మరొక ప్రతిపాదనవైపు మొగ్గు (రాహుల్ ఉత్తముడు) చూపకపోవచ్చు.1989 వరకు కాంగ్రెస్ ప్రజాపునాది దిగువ కులాలు, మైనారిటీలు, గిరిజనులు, బ్రాహ్మణులు, కొన్ని మధ్య కులాలు, పేదల్లో చాలామంది మద్దతును గెలుచుకోగలిగినంత పెద్దదిగా ఉండేది. అప్పట్లో బీజేపీ ప్రధానంగా పట్టణ వ్యాపారులు, హిందూ మధ్యతరగతులకు మాత్రమే పరిమితమై ఉండేది. కాబట్టే ఇందిరాగాంధీ జనసంఘ్, బీజేపీలను బనియా పార్టీగానే పిలిచేవారు తప్పితే వారిని హిందూ పార్టీగా ఎన్నడూ వర్ణించలేదు. అలాగే ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా ఉన్నంతవరకు, బీజేపీ ఎన్నడూ ఆమె పార్టీని ముస్లిం పార్టీగా పిలవగలిగేది కాదు. కానీ పొటా (ఉగ్రవాద నిరోధక చట్టం)ను ఎప్పుడయితే రద్దు చేశారో అప్పుడే మోదీకి కాంగ్రెస్‌ను ముస్లిం పార్టీ అని పిలిచే దమ్ము వచ్చేసింది. 1989లో రాజీవ్ గాంధీ తన ప్రజాపునాదిని కోల్పోవడం ప్రారంభం కాగానే, కాంగ్రెస్ పార్టీ మిగిలిన తన మద్దతుదారులతో, బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తుల మద్దతుతో మాత్రమే మనగలగ సాగింది. 2014 తర్వాత పార్టీని తిరిగి వైభవంలోకి తీసుకురావడానికి మరింతగా ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటినుంచి వందరోజుల లోపు అతిపెద్ద పరీక్షను ఎదుర్కోవలసి ఉన్న సమయంలో కాంగ్రెస్ ఒక్క పంజాబ్‌లో తప్పితే మరే రాష్ట్రంలోనూ విశ్వాస పాత్రులైన ఓటర్లతో కూడిన ప్రజారాశులను కలిగిలేదన్నది స్పష్టం. అది ఇప్పటికే బీజేపీతో పాటు తూర్పు మధ్య ప్రాంత గిరిజనులను పంచుకుంటోంది. దళితులు అన్ని పార్టీల్లో ఉంటున్నారు. ముస్లింలకు ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, అస్సాం వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో అనేక అవకాశాలు ఉంటున్నాయి. పైగా పట్టణ మధ్యతరగతిలో ప్రధానంగా 25 ఏళ్ల లోపు వయస్కులలో చాలామంది ఇప్పటికీ మోదీ పట్ల అనుకూలతతోనే ఉంటున్నారు. మోదీ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారిని మీ శిబిరంలోకి లాక్కోవడం ద్వారా మాత్రమే మీరు ఎన్నికల్లో గెలుపు సాధించిపెట్టే కొత్త ఓటర్ పునాదిని మీరు నిర్మించలేరు. మీరు మోదీకి నష్టం కలిగించవచ్చు కానీ దాని ప్రయోజనం మాత్రం అనేకమంది మిత్రులు, ప్రత్యర్థుల మధ్య విభజితం కావచ్చు. ఈ కోణంలో, రాహుల్ 2010–14 నాటి అరవింద్ కేజ్రీవాల్ స్టైల్‌ని అనుసరిస్తున్నారు. అన్నాహజారేని, ఆరెస్సెస్ గొంతుబలాన్ని ఉపయోగించి, యూపీఏని ప్రత్యేకించి కాంగ్రెస్ విశ్వసనీయతను విధ్వంసం చేయడంలో అరవింద్ కేజ్రీవాల్ కీలకపాత్ర పోషిం చారు. దీంతో కాంగ్రెస్ వారు సైతం పార్టీపై వస్తున్న అవినీతి ఆరోపణలనుంచి సమర్థించుకోలేని మానసిక స్థితిలో కూరుకుపోయారు. యూపీఏని పతనం చేసిన ఘనతను బీజేపీకి, వివేకానంద ఫౌండేషన్‌కి ఆపాదించడం ప్యాషన్ కావచ్చు కానీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రధానాస్త్రంగా వ్యవహరించింది మాత్రం అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే. తాను యువకుడు, విశ్వసనీయత కలిగినవాడు, అవినీతి అంటనివాడు కాంగ్రెస్ పార్టీ గజదొంగల పార్టీ అనే ఇమేజిని తానే పెంచిపోషించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్లించడానికి తాను ప్రయత్నించిన ఓటర్లు కేజ్రీవాల్వైపునకు రాలేదు. అలాంటి ప్రజాపునాదిని తాను నిర్మించుకోలేదు. అతడి ప్రయోజనాలు ఢిల్లీకే పరిమితమయ్యాయి. కాకపోతే, నరేంద్రమోదీవైపు ఓటర్లు మళ్లిపోయేలా చేయడంలో కేజ్రీవాల్ విజయవంతమయ్యారు. ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించకుండా కేవలం వ్యతిరేకతపై మాత్రమే ఆధారపడిన రాజకీయాల్లోని ప్రమాదం ఇదే. ఇది జరగకూడదంటే మీరు మీ పునాదిని నిర్వచించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే రాహుల్ పెనుప్రమాదంలోకి కొట్టుకెళ్లిపోతున్నారు. ఒక తిరుగుబాటుదారుగా సమర్థంగా వ్యవహరించడం సరైందే కావచ్చు కానీ ప్రజాస్వామ్యంలో మీరు చేయగలిగేది ఏమిటంటే అధికారాన్ని గెలుచుకోవడం కాకుండా ప్రతిష్టను దెబ్బతీయగలగడం, అధికారాన్ని మరొకరికి అప్పగించడం మాత్రమే. గెరిల్లా యుద్ధతంత్రం ప్రకారం రాహుల్ తన ఎత్తుగడలను బలంగానే అమలు చేస్తున్నారు కానీ దాని వ్యూహాత్మక ఫలితం ఏమిటన్నదే ముఖ్యం. ముస్లింల అనుకూల పార్టీగా తనపై ఉన్న ముద్రను తొలగించుకోవడానికి రాహుల్ ఆలయాలను సందర్శిస్తూ టీవీల్లో ప్రసారమయ్యేలా జాగ్రత్తపడుతున్నారు, తన జంధ్యాన్ని ప్రదర్శిస్తూ తన బ్రాహ్మణ గోత్రాన్ని వెల్లడిస్తూ వస్తున్నారు. కానీ, ఆయన పార్టీ... ట్రిపుల్ తలాక్, శబరిమల, అగ్రవర్ణాల రిజర్వేషన్ వంటి కీలకమైన లౌకిక–ఉదారవాద సమస్యల పట్ల మౌనం వహిస్తోంది. భారతదేశాన్ని యూదుజాత్యహంకార దేశంగా సమర్థవంతంగా క్రోడీకరించబోతున్న పౌరసత్వ చట్ట సవరణపై చర్చ జరుగుతుంటే లోక్‌సభనుంచి వాకౌట్ చేయడంలో కూడా పార్టీ సంప్రదాయాల లేమి కొట్టొచ్చినట్లు కనబడింది. ఇజ్రాయెల్ తన్నుతాను భావజాలపరంగానే జాత్యహంకార దేశంగా మల్చుకుంది. కానీ భారత్ దానికి భిన్నంగా పూర్తి వ్యతి రేకదిశలో.. భావజాలేతర, లౌకిక రాజ్యాంగంగా తన్ను తాను మల్చుకుంది. ఈరోజు ఆ పునాదే సవాలుకు గురవుతుండగా కాంగ్రెస్ వాకౌట్ చేయటంకంటే మరేమంత ఘనచర్యకు పూనుకోలేకపోవడమే విషాదం. ఇలాంటి నిస్సహాయ స్థితిని అస్సామ్‌లో హిందువులు, ముస్లింలు ఇదదరూ కలిసి చూస్తుండిపోతున్నారు. సరిగ్గా ఈ స్థితే బీజీపీకి కలిసొస్తుంది. ఆ పార్టీ ప్రజాపునాది అనేది సరిగ్గా దీన్నే కోరుకుంటోంది. అక్రమ వలసదార్లు చెదపురుగులు అని ఎవరైనా వ్యాఖ్యానిస్తే బీజేపీ ప్రజాపునాది అభినందిస్తోంది. ఈ చెదపురుగుల్లో ముస్లింలు మాత్రమే ఉంటున్నారని పేర్కొంటూ రాజ్యాంగాన్ని ఎవరైనా సవరించడానికి పూనుకుంటే బీజేపీ ప్రజాపునాది కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకుంటుంది. సరిగ్గా ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తన పునాది ఏంటో కూడా తెలుసుకోవడం లేదు. లేదా సార్వత్రిక ఎన్నికల ప్రచారం సమీపిస్తుండగా అంటే వచ్చే నెలలో తన పునాదిని నిర్మిం చుకోవడం ఎలా అని కూడా దానికి తెలీడం లేదు. రాజీలేని మోదీ వ్యతిరేక తత్వాన్ని ఎంత ఆగ్రహంతో ప్రదర్శించినప్పటికీ, అది దానికదే ఒక భావజాలంగా కానీ లేక ఎన్నికల్లో ప్రత్యామ్నాయంగా కానీ కాజాలదు. మీరు చేయవలసింది ఏమిటంటే మోదీని వచ్చే ఎన్నికల్లో 200 కంటే తక్కువ సీట్లతో వెనుకబడేలా చేయడమే. దీనికి ప్రతిగా మీరు ప్రారంభంలోనే 100 సీట్లను అదనంగా పొందే స్థితిని ఇది కలిగిస్తుందా? అలా జరగాలంటే ముందుగా రాష్ట్రం తర్వాత రాష్ట్ర స్థాయిలో భారత చిత్రపటాన్ని నిశితంగా పరిశీలించాలి. బీజేపీ పట్ల ప్రజల్లో ఆశలు ఎంత ఎక్కువస్థాయిలో ఆవిరయినప్పటికీ మే నెలనాటికి కాంగ్రెస్ పార్టీ, చాలా రాష్ట్రాల్లో వారి ప్రత్యామ్నాయ ఎంపిక కావడం కష్టమే. రాహుల్ గ్రహించాల్సిన అత్యంత కఠిన వాస్తవం ఇదే మరి. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
క్రీనీడలలో భారత క్రికెట్
బీసీసీఐని సంస్కరించడానికి నియమించిన సీఓఏ అధికారాల పరిధి బోర్డు నిర్వహణలోని ప్రయోజనాల ఘర్షణలను సరిదిద్దడమే. కానీ గుహ ఉత్తరాలు క్రీడకారులకు, ప్రత్యేకించి పూర్వ క్రీడాకారులకు సంబంధించిన ఎన్నో పరస్పర ప్రయోజనాల ఘర్షణను వెలుగులోకి తెచ్చాయి. మన క్రికెట్‌కు సంబంధించిన మరో రంగంలోని, మరింత ఎక్కువ ముఖ్యమైన ప్రయోజనాల ఘర్షణ సైతం వెలుగులోకి వచ్చింది. క్రికెట్, డబ్బు, అధికారాల మధ్య కుమ్మక్కు అనే పాత కథే మరోసారి, మరో రకంగా పునరావృతం అవుతోందని తేలింది. బోర్డ్ ఆఫ్ క్రికెట్ బోర్డును (బీసీసీఐ) సంస్కరించాలనే సదుద్దేశంతో సుప్రీం కోర్టు చేసిన ప్రయత్నం అతుకుల బొంతలా అనిపిస్తోంది ఎందుకు? అత్యంత వివేకవంతులు, సీనియర్లు అయిన న్యాయమూర్తుల ద్వారా సుప్రీం కోర్టు బెంచి గత రెండేళ్లుగా భారత క్రికెట్లో చురుగ్గా జోక్యం చేసుకుంటోంది. అయినాగానీ అది ఎవరో ఒక అసహనపు శస్త్ర చికిత్సా నిçపుణుడు నిలువునా కోసేసి ఆపరేషన్ బల్లపై అలాగే వదిలేసిన రోగిలాగా ఎందుకు కనిపిస్తోంది? అతి సుప్రసిద్ధులైన రిటైర్డ్ న్యాయమూర్తులు, క్రికెటర్లు, అధికారులు, కార్పొ రేట్ రంగంలో పనిచేస్తున్న ఒక ప్రముఖుడు, ఒక అగ్రశ్రేణి భారత క్రికెట్ చరి త్రకారుడు (రాజకీయ చరిత్రకారుడు కూడా) సేవలందిస్తున్నా అది అలాగే ఉన్నదెందుకు? ఆ రోగికి కుట్లు వేసేదెన్నడు? ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కాపాడుకోవాల్సిన భారత క్రికెట్ జట్టు రేపు (ఆదివారం) ఇంగ్లండులో పాకి స్తాన్ జట్టుతో కీలకమైన మ్యాచ్‌లో తలపడనుంది. అయినాగానీ, మన జట్టు ఆ మ్యాచ్‌కు సన్నాహాలపై దృష్టిని కేంద్రీకరించడానికి బదులు జట్టు కోచ్, తది తర అంశాలపై బీసీసీఐ ప్రశ్నలకు సమాధానాలను చెబుతూ కూర్చుంది ఎందుకు? భారత్ క్రికెట్ ఎన్నడూ లేనంత ఎక్కువగా నేడు చీలిపోయి కనిపి స్తోంది, ఎందుకు? అదే ఎన్నో విషయాలను చెబుతుంది. ఢిల్లీ క్రికెట్ వ్యవహారాలను నడపడానికి కోర్టులు నియమించిన సుప్ర సిద్ధ రిటైర్డ్ న్యాయమూర్తులలో ఒకరు.. తన సొంతవారికి ఇచ్చుకున్న ఉచిత పాస్‌ల గురించి, ఆ వ్యవహారంలో ఆయన కుమార్తె పాత్ర గురించి ప్రశ్నించిన ఒక రిపోర్టర్‌ను కోర్టు ధిక్కార నేరం కింద విచారిస్తానని బెదిరించిన విష యాన్ని చెప్పడం అతిశయోక్తి కాబోదు గానీ ప్రమాదకరం అవుతుంది. ఏడాది కంటే ముందు అటు మైదానంలోనూ ఇటు నిర్ణయాలు తీసుకునే బోర్డ్ రూం లోనూ కూడా ప్రపంచ క్రికెట్ శక్తిగా ఉన్న స్థానం నుంచి భారత క్రికెట్ నేడు బ్రహ్మాండమైన సంక్షోభానికి చేరిందనేది నిరాకరించలేని వాస్తవం. ఇక కోహ్లీ జట్టు నైపుణ్యం, ప్రేరణ మాత్రమే చాంపియన్స్ ట్రోఫీలో దాన్ని దరి చేర్చాలి. గుహ బయటపెట్టిన లుకలుకలు అయితే, డ్రెస్సింగ్ రూంలోని జట్టు, దాని నిర్వాహక సంస్థ కూడా చీలి పోయి ఉన్నాయి, ఐసీసీ బోర్డ్ రూంలో జగజ్జేతలాంటి ప్రముఖ స్థానంలో ఉండిన భారత్ నేడు తోక ఊపుకుంటూ నిలిచిన కుక్క పిల్లలా ఉందనేది వాస్తవం. ఇక బీసీసీఐ నిర్వహణకు, సంస్కరణల అమలుకు గౌరవనీయ సుప్రీం కోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) అంతర్గత విభేదాలతోనూ, బహు ప్రయోజనాల ఘర్షణతోనూ చీలిపోయి ఉంది. చరిత్ర కారుడూ, ప్రజాజీవితంలో ఉన్న ప్రముఖ మేధావి అయిన రామచంద్ర గుహ ధైర్యంగా అంతర్గతమైన లుకలుకలను బయటపెట్టే కార్యకర్త పాత్రను పోషిం చారు. ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలన్నిటితో ఏకీభవించకపోయినా క్రికెట్ ప్రేమికులమైన మనం ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాల్సి ఉంది. స్పాట్–ఫిక్సింగ్ వివాదంతో నాలుగేళ్ల క్రితం క్రికెట్లో న్యాయవ్యవస్థ జోక్యం మొదలైంది. ఆ తదుపరి సంవత్సరాలలో ఇతర సమస్యలు కూడా తలెత్తడంతో ఆ జోక్యం పెరుగుతూ పోవడం కొనసాగింది. చివరికి గౌరవ నీయ న్యాయస్థానం భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎమ్ లోథా నేతృత్వంలో రిటైరైన ముగ్గురు సుప్రీం కోర్టు న్యాయ మూర్తుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 12 నెలలు కష్టించి కృషి చేసి, బీసీసీఐ పాలనా వ్యవహారాల తీరులో తీవ్ర మార్పులను సూచిస్తూ నివేదికను రూపొందించింది. 2016 అక్టోబర్ చివరికల్లా వాటిని అమలు చేయాలని కోర్టు బీసీసీఐని ఆదేశించింది. అది ఆదేశాలకు కట్టుబడక పోవడంతో, ఆచరణలో బోర్డ్ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలకు ఉద్వాసన పలికింది. రాయ్–లిమాయే ద్వయం లీల ఆ తర్వాత అది లోథా కమిటీ సలహానుసారం సంస్క రణల అమలుకు హామీని కల్పించడానికి, ఈలోగా తాత్కాలికంగా బీసీసీఐని నియంత్రించడా నికి కమిటీ ఆఫ్ ఎడ్మినిస్ట్రేటర్లను (సీఓఏ) నియమించింది. అనుద్దేశపూర్వక పర్యవసానాల నియమం పనిచేయడం మొదలైంది అప్పుడే. బహుశా జస్టిస్ లోథా తనకున్న నమ్మకాన్ని బట్టే సీఓఏకు అధిపతిగా మాజీ కంప్ట్రోలర్ అండ్ జనరల్ వినోద్ రామ్‌ను నియమించి ఉంటారు. లోథా ప్రధాన న్యాయ మూర్తిగా పనిచేస్తుండగా వివాదాస్పదమైన కేరళలోని సుసంపన్నమైన పద్మ నాభస్వామి ఆలయాన్ని కోర్టు నియమించిన పరి పాలనా కమిటీ పర్యవేక్షణ కింద ఉంచారు. దాని ఆర్థిక వ్యవహారాలను ఆడిట్ చేసే బాధ్యతలను రాయ్‌కు అప్పగించారు. ఆ తర్వాత వివాదాస్పద మైన ఎమ్‌సీఐని (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) సంస్కరించడానికి నియమించిన కమిటీలో కూడా రాయ్‌కు స్థానం కల్పించారు. కాబట్టి తార్కికంగా సీఓఏకు నేతృత్వం వహిం చాల్సిందిగా ఆయన రాయ్‌నే ఎన్నుకున్నారని ఊహించవచ్చు. సీఓఏలోని మిగతా ముగ్గురు సభ్యులలో ఒకరు ముంబై కేంద్రంగా పనిచేసే ఐడీఎఫ్సీ లిమిటెడ్‌కు సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ లిమాయే. అదే కంపెనీకి రాయ్ నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు కాబట్టి, లిమాయేను ఆయనే ఎంపిక చేసి ఉండాలి. ఇక డయానా ఎదుల్జీ, గుహ ఎలా ఎంపిక అయ్యారో స్పష్టత లేదు. అయితే వారిద్దరూ వివాదరహి తులు లేదా వారం క్రితం వరకు వివా దరహితులుగానే ఉండేవారు. సీఓఏ నాలుగు నెలలుగా బీసీసీఐపై పూర్తి అధికారాలతో పనిచేస్తోంది. అంతేకాదు, స్వల్పకాలిక సమాచారంతోనే సుప్రీం కోర్టు క్రికెట్ బెంచ్ దాన్ని కలుసుకోడానికి సుముఖంగా ఉంది. అయినా సీఓఏ లోథా కమిటీ సంస్కరణ లను అమలుచేయడంలో ఏ మేరకు విజయం సాధించిందో స్పష్టత లేదు. కోర్టు దానికి కాల పరిమితిని విధించలేదు కాబట్టి కొంతకాలం పాటూ బీసీసీఐని సీఓఏ నియంత్రిస్తోందో కూడా తెలియదు. ఈలోగా ప్రపంచ రంగస్థలిపై భారత్ భారీ పరాజయాన్ని చవిచూసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధికారాలలోని సంస్కరణలుగా పిలుస్తున్న రాబడి పంపిణీ, ఓటింగ్ ప్రమాణాలను అది వ్యతిరేకించనైనా లేకుపోయింది. మూడు పెద్ద తలకాయలకు (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో కలిపి) నేతగా ఉన్న స్థానంలో ఉన్న భారత్ ఇంత వరకు ఓటమిని ఎరుగదు. అలాంటిది 13–1 తేడాతో అవమానకమైన ఓటమిని ఎదుర్కొంది. సీఓఏ పోరాడి ఓడటం కాదు, అసలు పోరాడనే లేదు. ఐసీసీ నియంత్రణ ఎంత పరిపూర్ణంగా, నిరం కుశంగా ఉందో తెలుసుకోవాలంటే... కోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేయడం సహా ఎలాంటి చర్యా చేపట్టకుండా అది బీసీసీఐకి జారీ చేసిన ఉత్తరువుల పరంపరను చూడండి. మన క్రికెట్ జట్టు ఇప్పుడు చీలిపోయింది. కెప్టెన్, కోచ్‌ల మధ్య యుద్ధం నడుస్తోంది. మినీ వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా కోచ్ ఉద్యోగానికి దర ఖాస్తులను పిలిచారు. వీటన్నిటికి తోడు సీఓఏఏలోని ఒక ప్రముఖ సభ్యుడు తన కొన్ని ఉత్తరాలను బయటపెట్టారు. వాటిలో ఆయన కమిటీలోని తన సహచరులు అసమర్థతపైనా, సంస్కరణలను అమలుచేయంలోని వైఫల్యం పైనా పరోక్ష విమర్శలను సంధించారు. ఇప్పుడు జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక పాత్ర పోషించాల్సిన ఇద్దరు క్రీడాకారులు.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, అందరిలోకీ సీనియర్ క్రీడాకారుడు మహేంద్రసింగ్ ధోనీలపై అను మానపు నీడలు ముసిరేలా చేశారు. అపరిమిత ప్రయోజనాల ఘర్షణ సీఓఏ అధికారాల పరిధి బీసీసీఐ నిర్వహణలోని ప్రయోజనాల ఘర్షణ లను సరిదిద్దడమే. కానీ గుహ ఉత్తరాలు మన క్రికెట్ క్రీడకారులకు, ప్రత్యే కించి పూర్వ క్రీడాకారులకు సంబంధించిన ఎన్నో పరస్పర ప్రయోజనాల ఘర్షణను వెలుగులోకి తెచ్చాయి. న్యాయవ్యవస్థ చురుకైన పాత్ర వహిం చడం వల్ల కలిగిన అనుద్దేశపూర్వక పర్యవసానంగా భారత క్రికెట్‌కు సంబంధించిన మరో రంగంలోని ఘర్షణలు, మరింత ఎక్కువ ముఖ్యమైనవి వెలుగులోకి వచ్చాయి. అత్యధికంగా నియంత్రితమైన ఫైనాన్స్ మార్కెట్లు, బ్యాంకింగ్, అధికారవర్గ–కార్పొరేట్ వ్యవస్థలు, వాటి మధ్య అనుసంధానాలు బయ టపడ్డాయి. సీఏఓపైనే దృష్టిని కేంద్రీకరించడంవల్ల కేంద్ర ప్రభుత్వానికి చెందిన అత్యంత శక్తివంతమైన బ్యాంకింగ్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) ప్రభుత్వ రంగ బ్యాంకుల సంస్కరణలు, పునర్వ్యవస్థీకరణకు అధిపతిగా ఉన్న రాయ్.. ఐడీఎఫ్సీ బ్యాంక్‌కు ప్రమోటరైన ఐడీఎఫ్సీకి చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఐడీ ఎఫ్‌సీ, ప్రభుత్వ బ్యాంకులకు పోటీదారు. అంతేకాదు, రాయ్ తన సీఈఓను సీఓఏలో తనకు సహాయకునిగా నియమించుకున్నారు! లిమాయేను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్కు (ఎన్ఎస్ఈ) సీఈవోగా ఎంపిక చేశారు. దేశంలోని 80 శాతం స్టాక్ మార్కెట్ లావాదేవీలు దానిలోనే జరు గుతాయి. నెలల తరబడి దానికి అధిపతి లేరు. అయినా లిమాయే సీఓఏ సభ్యునిగా కొనసాగడం మానుకుంటే తప్ప మార్కెట్ల నియంత్రణ సంస్థ అయిన సెబీ బాధ్యతలను ఆయన చేపట్టలేరు. బలీయమైన అధికారవర్గపు శక్తుల మద్దతుతో జరిగిన లిమాయే నియా మకంలో ఆయన ద్విపాత్రాభినయంలోని ప్రయోజనాల ఘర్షణను ప్రశ్నించిన సెబీ ధైర్యం ప్రశంసనీయం. ఆయన నేతృత్వం వహించాల్సిన సంస్థలో చాలా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఒకటే లేదా అంతకంటే ఎక్కువ కంపెనీలు లిస్టయి ఉన్నాయి. ఆయన రెండు పక్షాలలోనూ ఉండగలరా? దేశంలోని అతి ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజి సీఈఓకు బీసీసీఐ లాంటి వివాదాస్పద సంస్థను నడపడానికి సమయం ఉంటుందా? ఇక ఆయన ఐడీఎఫ్సీకి ఎంత సమయాన్ని కేటాయిం చగలుగుతారు? సెబీ స్పష్టతను కోరడం సమంజసమే. బీసీసీఐ ఆడిటింగ్ కాంట్రాక్టును ఎన్ఎస్ఈ డైరెక్టరు, ఎన్ఎస్ఈ సెలెక్ట్ కమిటీ సభ్యుని సొంత కంపెనీకి ఇచ్చారు. దాన్ని తర్వాత రద్దు చేశారు. రెండువారాల క్రితం లిమాయే తాను ఆగస్టులో సీఓఏ విధులను బయ టపడతానని టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు. మరో సభ్యుడు గుహ నిష్క్రమించారు కాబట్టి ఇక భారత క్రికెట్ ఎక్కడ నిలుస్తుంది? ఈలోగా ఎన్ఎస్ఈ అధిపతి లేకుండా ఉండాల్సిందేనా? క్రికెట్, డబ్బు, అధికారాల మధ్య కుమ్మక్కు అనే అదే కథ మరోసారి, మరో రకంగా పునరావృతం అవు తోంది. సీఓఏ విధులను చేపట్టి నప్పుడు రాయ్ తాను నైట్ వాచ్‌మెన్‌లా నిర్దిష్ట మైన పనికే పరిమితమౌన్నారు, బాగానే ఉంది. కానీ క్రికెట్ అధికారం పూర్తిగా వివశం చేసేస్తుంది. twitter@shekargupta -
గొప్ప ఫలితాలు ఆశించొద్దు
జాతిహితం మొదటి 50లోకి, 25లోకి, చివరకు 10లోకి ప్రవేశించకుండానే పతకాలు సాధ్యం కావు. కాబట్టి ఏ దేశమూ హఠాత్తుగా ప్రపంచ చాంపియన్లను తయారు చేసేయలేదు. 1988 సియోల్ నాటికి తొలి 25లో చోటు సాధించిన భారత క్రీడాకారులు ఒక్కరే. నేడు అలాంటి వారి సంఖ్య 100కు చేరింది. కనీసం 30 మంది మొదటి 10లో ఉంటున్నారు. మన హాకీ జట్టు, సైనా నెహ్వాల్ ఇప్పుడు తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు. మనకున్న ప్రతిభాపాటవాల పునాదితో నాటకీయమైనదేమైనా జరగాలనుకోవడం ఆకాంక్ష మాత్రమే. ఒలింపిక్ క్రీడల పట్ల మన అభిప్రాయాలు స్థూలంగా ఈ రెండిటిలో ఒక కోవకు చెందినవిగా ఉంటాయి. ఒకటి, సాధారణ అభిమానుల అభిప్రాయం. భారత క్రీడాకారులు ఎన్నో బలహీనతలు ఎదుర్కొంటూ కూడా తమ శాయ శక్తులా కృషిచేస్తున్నారని, వారు కొన్ని పతకాలనైనా గెలవగలిగితే అదే అద్భు తమనేది అత్యధిక సంఖ్యాకుల భావన. ఇక రెండో కోవకు చెందేవారిని శోభాడే క్లబ్ అనొచ్చు. వారి దృష్టిలో భారతీయులకు సంబంధించినంత వరకు ఒలింపిక్స్ అంటే ప్రజాధనంతో సాగించే విలాస యాత్ర లేదా వృథా వ్యయం. కాబట్టి మన డబ్బును, ఉద్వేగాలను కూడా వృథా చేసి కోరి అవ మానాన్ని కొనితెచ్చుకోవడం ఎందుకనేది వారి భావన. శోభా డే బహిరం గంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంపై ఆగ్రహం వెల్లువెత్తాక కూడా నేను ఈ రెండు అభిప్రాయాలు సరైనవేనని అంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. అది చాలదన్నట్టు దీన్ని మరింత సంక్లిష్టం చేస్తూ ఈ రెండు అభిప్రాయాలు తప్పు అని కూడా నేనంటాను. రెండూ ఎందుకు సరైనవో అర్థం చేసుకోవడం సులువే. ప్రపంచ క్రీడా రంగంలో ఘనతను సాధించాలని మనం సహజంగానే ఆశిస్తాం. అది లభిం చకపోవడంతో నిరుత్సాహానికి గురవుతాం. మనకున్న అవకాశాల గురించి ఎక్కువ ఆశావాదంతో ఉంటాం. మన వైఫల్యాలను మన్నిస్తాం. ఏదేమైనా సెంటిమెంటును తప్పు పట్టలేం. రెండూ ఎందుకు తప్పు? ప్రత్యేకించి ఇప్పటి అతి జాతీయవాద రోజుల్లో (స్వాతంత్య్రదినోత్సవ వారాన్ని దృష్టిలో పెట్టుకుని అనడం లేదు)... ప్రపంచాన్ని జయించే స్థాయికన్నా తక్కువ ఏదీ మనం అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. హఠాత్తుగా అగ్రస్థానం అందుకోలేం ఆశావాదం, ఈసడింపులతో కూడిన ఈ రెండు రకాల ఆలోచనలూ విజ యాన్ని కేవలం పతకాల రూపంలో చూడటమే వాటిలోని లోపం.రియోలో ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడలు మొదటి రోజున నేను ఇది రాస్తున్నాను. ఈ ఒలింపిక్స్‌లో మనం ఇప్పటికీ గత బీజింగ్ క్రీడలంతగా రాణించడం లేదని తెలిసే ఇది రాస్తున్నాను. జరగరాదని ఆశిస్తున్నా, ప్రార్థిస్తున్నా కూడా... 118తో కూడిన అతి పెద్ద బృందాన్ని పంపిన మన దేశానికి ఒక్క పతకం లభించకపోవడం కూడా సాధ్యమే. ఒలింపిక్స్‌లో ఏ దేశమూ జీరో నుంచి హఠాత్తుగా హీరోగా మారిపోదు. 96 ఏళ్లుగా పాల్లొంటున్న మనం ఒక వ్యక్తి గత స్వర్ణం, ఐదు రజితాలు, తొమ్మిది కాంస్య పతకాల నుంచి ఈసారి ప్రారంభించాం. హఠాత్తుగా పెద్ద లక్ష్యాలను మన క్రీడాకారుల ముందు ఉంచజాలం. ఈ 12 వ్యక్తిగత పతకాలు కూడా 2004, 2008, 2012 మూడు ఒలింపిక్స్‌లో లభించినవి. అంతకు ఎనభై ఏళ్ల ముందు 1952 హెల్సింకీ క్రీడలలో ఒకే ఒక్క కాంస్యం కుస్తీ పోటీల్లో లభించింది. అలాంటి స్థానం నుంచి నాటకీయంగా మొదటి 25 దేశాలలోనైనా స్థానం సంపాదించాలి (ఇంతవరకు మనం సాధించిన అత్యధిక స్థానం బీజింగ్స్ క్రీడలలోని 50). టెస్టు, వన్డే క్రికెట్లో మనం ఒకటి లేదా రెండో స్థానాల్లో ఉన్నాం కాబట్టి, మనది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కాబట్టి, భద్రతా మండలి శాశ్వత సభ్యత్వాన్ని కోరుతున్నాం కాబట్టి మనం ఆ పని చేయాలి. ఆర్థిక వృద్ధిలో చైనాను అధిగమించిపోయామనడం హాస్యాస్పదం. వాస్తవాన్ని సరిపోల్చి చూద్దాం. 25 ఏళ్లు అంతర్యుద్ధంతో క్షీణిం చినా శ్రీలంక తలసరి జీడీపీ మనకంటే 50 శాతం ఎక్కువ. దీన్ని బట్టి మన ఆర్థిక వృద్ధి పుంజుకుంటుంటే కాలక్రమేణా మనకు ముందున్నవారికి, మనకు మధ్య దూరం తగ్గిపోతుందని, క్రీడలలో మన ప్రతిభా ప్రదర్శన మిగతా వాటికంటే వేగంగా వృద్ధి చెందుతుందని భావించే ఆశావాద పార్శ్వాన్ని చూపుతుంది. అది ముందున్న వారికి మనకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గి స్తుందే తప్ప ప్రపంచ విజేతలను చేసేయదు. నిజజీవితంలో ఒలింపిక్ పత కాలను గెలవడం... సల్మాన్ ‘‘సుల్తాన్’’ ఖాన్ 30 ఏళ్ల వయసులో శిక్షణ పొందటం ఆరంభించి బంగారు పతకాలను గెలిచేసుకోవడంలా ఉండదు. ఒక కుస్తీ వస్తాదు నిజానికి ఏళ్లతరబడి, దశాబ్దానికిపైగా ఒలింపిక్స్‌కు అర్హ తను సాధించడానికి శిక్షణ పొందాల్సి ఉంటుంది. నర్సింగ్ యాదవ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యాన్ని గెలుచుకుని చిట్టచివరకు ఒలిం పిక్స్‌కు అర్హ తను సాధించగలిగాడంటే అది ఎంత కఠోరమైనదో మీకు అవగాహన ఏర్పడుతుంది. గత ఒలింపిక్స్‌తో కనీసం ఆరవ స్థానాన్ని పొందడం వ్యాయామ క్రీడాకారుల అర్హతకు ప్రమాణంగా ఉంటుంది. హాకీలో సైతం ఖండాంతర్గత చాంపియన్‌షిప్‌లో నెగ్గడం సైతం కష్టమే. ఈసారి మన హాకీ జట్టు అలాగే అర్హతను సాధించింది. బీజింగ్‌లో మన జట్టు, రియోలో పాకిస్తాన్ జట్టు అలాగే అర్హతను సాధించలేకపోయాయి. రియోకి మనం 118 మంది క్రీడాకారుల బందాన్ని పంపగలగడమే మొత్తంగా భారత ప్రమాణాల రీత్యా మెరుగుదలను సూచిస్తుంది. సాంప్రదాయకంగా మనకు బలం ఉన్న హాకీ, కుస్తీ, బాక్సింగ్, షూటింగ్లలోనే కాదు ఆర్చరీలోనూ అన్నిటికీ మించి జిమ్నాస్టిక్స్‌లో సైతం మెరుగుదల సాధించాం. ఒక మహిళా జిమ్నాస్ట్ ఒలింపింక్స్కు అర్హతను సాధించడమే కాదు, ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. 25 ఏళ్ల వారిలో అధికులు తమ బొటన వేళ్లను అందుకోవడానికి తంటాలు పడే మన దేశంలో అది నిజంగానే గొప్ప విజయం. మెరుగుదలను చూడాలి ‘‘ఆహ్వానం’’ పొందిన ఇద్దరు తప్ప మన ఈత క్రీడాకారులంతా అర్హతను సాధించినవారే. గతంలో లాగా ఇప్పుడు ట్రయల్స్‌లో దేశీ కోచ్‌లు క్రీడాకారుల టైమింగ్స్‌ను, ప్రదర్శనలను నిర్ణయించడం లేదు. ఇది మన క్రీడాకారుల అర్హతా మార్కులకు, అసలు రోజున ప్రదర్శనకు మధ్య కనబడే వ్యత్యాసం మనకు మరింత చేదుగా అనిపించేలా చేస్తుంది. ఈ క్రమాన్నంత టినీ ఇప్పుడు పటిష్టంగా నియంత్రిస్తున్నారు, క్రమబద్ధీకరిస్తున్నారు. డోపింగ్ విషయం కూడా చాలా కఠినంగా ఉంది. మొదటి 50లోకి, 25లోకి, చివరకు 10లోకి ప్రవేశించకుండానే పతకాలు సాధ్యంకావు. కాబట్టి ఏ దేశమూ హఠా త్తుగా ప్రపంచ చాంపియన్లను తయారు చేసేయలేదు. 1988 సియోల్ నాటికి తొలి 25లో చోటు సాధించిన భారత క్రీడాకారులు ఒక్కరే. నేడు అలాంటి వారి సంఖ్య 100కు చేరింది. కనీసం 30 మంది తమ విభాగాల్లో మొదటి 10లో ఉంటున్నారు. అద్భుత ప్రదర్శనతో తొలి 5లో ఉంటున్నవారూ ఉన్నారు. మన హాకీ జట్టు, సైనా నెహ్వాల్ ఇప్పుడు తొలి ఐదు స్థానాల్లోనే ఉన్నారు. అయినా పతకాలకు హామీ లేదు. మనకేమీ మైఖేల్ ఫెల్ప్స్ లేడు. అందుకు దిగులుపడదామా? మన టైమింగ్స్ ఇటీవల మెరుగుపడుతు న్నాయి. కానీ మన ఈత ఎంత నాసిగా ఉంటోందంటే... పలు విభాగాల్లో పురుషుల టైమింగ్స్, మహిళల టైమింగ్స్కంటే వెనుకబడి ఉంటున్నాయి, అది కూడా ప్రపంచస్థాయిలో కాదు ఆసియా స్థాయిలోనే. మన దేశానికి ప్రపంచానికి మధ్య అంత పెద్ద అంతరం ఉండగా పతకాలు గెలవాలంటే రెండే మార్గాలున్నాయి. మేరీ కోమ్ లేదా సైనా నెహ్వాల్ వంటి అద్భుత క్రీడాకారులు ఆవిర్భవించడం. లేదా ఒక క్రీడా సంఘం లేదా నిబద్ధులైన కోచ్‌ల సహాయంతో సాంప్రదాయకమైన హాకీ లేదా లైట్ వెయిట్ కాంటాక్టు క్రీడలలో సుశీల్, విజేందర్, యోగేశ్వర్ వంటి వారికి శిక్షణనిచ్చి సంసిద్ధులను చేయడం. లేదా వ్యక్తిగతంగా శిక్షణపొందిన అభినవ్ బింద్రా లేదా సంస్థాగత శిక్షణ పొందిన రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ లవంటి స్వీయప్రేరితులు పతకాలు సాధించాలి. మనకున్న ప్రతిభా శక్తుల పునాదితో నాటకీయమైనదేమైనా జరగాలనుకోవడం ఆకాంక్ష మాత్రమే. వాస్తవిక లక్ష్యాలతో ముందుకు సాగాలి ఉపఖండంలోని జీవనశైలులు, శారీరక దారుఢ్యం, కార్బోహైడ్రేట్లు నిండిన ఆహారంతో తరాలు గడచినా సహజ క్రీడాకారులు తయారుకారు. ఇది ఒక క్రూర వాస్తవం. బంగ్లాదేశ్ క్రికెట్ శక్తిగా పెంపొందుతోంది. అయినా అది ఇంతవరకు ఒక్క ఒలింపిక్ పతకాన్ని అయినా ఎన్నడూ గెలుచుకోని అతిపెద్ద జనాభాగల దేశం. పాకిస్తాన్ నుంచి ఇద్దరు మాత్రమే అర్హతను సాధించారు. ఈ స్థాయి శారీరక దారుఢ్యం, వైఖరులతో భారత క్రీడాకారులు దక్షిణ ఆసియా స్థాయిలో మిగతావారి కంటే టైమింగ్స్, దూరాలు, పాయిం ట్లలో చాలా చాలా ముందుండటాన్ని చూసి ఇప్పుడు నవ్వుకోగలుగుతాం. ఒకప్పటిలాగా సాయుధ బలగాలు ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడలకు ప్రతిభను సమకూర్చకపోయినా మనం ఈ మాత్రం సాధించగలుగుతున్నాం. క్రీడాపరమైన అద్భుత ప్రతిభను కనబరచడానికి, జనాభా పరిమాణా నికి సంబంధం లేదు. ఇది సంస్కృతి, సంప్రదాయం, ఆద ర్శ నమూనాలకు సంబంధించినది కూడా. భారత జనాభాలో 2 శాతం కంటే తక్కువ జనాభా ఉన్న హరియాణా మనం సాధించిన ఒలింపిక్ పతకాల్లో మూడింట రెండు వంతులు గెలిచింది. నిరుపేదది, అతి చిన్నదైన మణిపూర్ జనాభా 30 లక్షలకు మించదు. ఆ రాష్ట్రం హాకీ, బాక్సింగ్, మహిళల వెయిట్‌లిఫ్టింగ్, ఆర్చరీ వంటి వైవిధ్యభరితమైన క్రీడల్లో ప్రపంచ స్థాయిలో విజయాలు సాధిస్తోంది. కేరళ కూడా ఒక సంప్రదాయకమైన క్రీడా శక్తి. కానీ హరి యాణాకు మూడు రెట్లు, కేరళకంటే రెండు రెట్లు, మణిపూర్ కంటే 20 రెట్లు జనాభా ఉన్న గుజరాత్ అర్హత పొందే క్రీడాకారులు ఒక్కరిని తయారు చేయ డానికి గింజుకుంటోంది. అయినా రియోలో మనం కొన్ని పతకాలు సాధించాలని ఆశిద్దాం. ప్రార్థి ద్దాం. అయినా పతకాలు లభించకపోయినంత మాత్రాన అంతా కోల్పోయి నట్టేం కాదు. ప్రపంచంలోని తొలి 25 మందిలో ఉన్న వంద మందికిపైగా ఉండటమే గాక, వారి సంఖ్య పెరుగుతుందంటేనే మనం పురోగతి సాధి స్తున్నాం. గత ఆసియాడ్‌లో మనం 57 పతకాలు, 11 స్వర్ణాలు సాధించి గొప్ప దిగ్భ్రాంతికరమైన మెరుగుదలను సాధించాం. మన తదుపరి లక్ష్యం ఆసి యాడ్‌లో ఉత్తర కొరియా, థాయ్‌లాండ్, కజకిస్థాన్, ఇరాన్‌ల కంటే ముందు 4వ స్థానాన్ని సాధించడమే. అది మరింత వాస్తవికమైన- ఆశావహమైన - లక్ష్యం అవుతుంది. వ్యాసకర్త: శేఖర్ గుప్తా twitter@shekargupta -
మద్యంపై ‘వేటు’ ఓట్లకు రూటు
జాతిహితం భారత రాజకీయాల్లో పెంపొందుతున్న గరిష్ట స్థాయి జనాకర్షకవాదమనే కొత్త ధోరణిని అనుసరించి.. మితిమీరి వాగ్దానం చేయాలి, తరచుగా అసాధ్యమైనవి కూడా చేస్తామనాలి. వాటిని ఓట్లుగా సొమ్ము చేసుకున్నాక అప్పడు ఏమి చేయగలమా అని ఆలోచించవచ్చు. నితీష్ మద్యనిషేధం అలాంటిదే. కేంద్రంలోని బీజేపీ ఈ చట్టాన్ని ఆమోదానివ్వడమే కాదు, అంతకంటే నిరంకుశ చ ర్యలను జోడించమని సైతం కోరవచ్చును నిజమే. అలాచేస్తే నితీశ్ మిగతా నాలుగేళ్లూ ఆ చట్టాన్ని అమలు చేస్తూ గడిపేయాల్సి వస్తుంది. ఇంతకూ నితీశ్‌కుమార్ యోచన ఏమిటి? ఆయన తెచ్చిన నూతన మద్య నిషేధ చట్టం ప్రతిని ఇంకా చదవ లేదు. కానీ అది... అవకాశం లేనిదే జరిగి చివరకు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు ఖలీఫా రాజ్యాన్ని ఏర్పాటు చేసేట్టయితే ఈ చట్టం దానికి సరైన నమూనా అవుతుంది. బిహార్ రాష్ట్ర శాసనసభ ఈ వారం ఆమోదించిన చట్టం సారాంశమే ఠారెత్తించేట్టుగా ఉంది. బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఏక్ట్, 2016 మద్య వ్యతిరేక పోరాటాన్ని మునుపెన్నడు ఎరుగని స్థాయికి తీసుకుపోతుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లేదా లౌకిక శక్తులు ఏవీ మద్య వ్యతిరేక పోరాటంలో ఇంత వరకు ఆ స్థాయికి పోలేదు. కుటుంబంలో ఏ ఒక్కరు ఇంట్లో మద్యాన్ని దాచి ఉంచి నట్టు తెలిసినా మొత్తం ఆ కుటుంబ సభ్యులంతా అందుకు బాధ్యులే అవు తారు. మీ టీనేజీ అబ్బాయి మీకు తెలియకుండా ఇంట్లో ఎక్కడైనా మద్యాన్ని దాచి, తాగుతుంటే మీరు కూడా మూల్యం చెల్లించాల్సిందే. చక్కెర లేదా బెల్లం, ద్రాక్ష కలిపిన మిశ్రమం మీ ఇంట్లో దొరికిందంటే, మీరు మద్యం తయారుచేస్తున్నారని భావించే స్వేచ్ఛ పోలీసులకు ఉంటుంది. మీరు ఓ ఇంటి యజమానైతే ఈ చట్టం వల్ల మీకు సంక్రమించే అసాధారణ అధికారా లను మీరు అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో అద్దెకుండేవారు మద్యం సేవించిన ట్టనిపిస్తే ఆ విషయాన్ని ‘‘తెలపాల్సిన’’ చట్ట్టపరమైన బాధ్యత మీపైన ఉంటుంది. అద్దె రెట్టింపు చేస్తావా లేకపోతే ఒక ఓల్డ్ మాంక్ సీసా తెచ్చి నీ ఇంట్లో పెట్టేసి పోలీసులకు ఫోన్ చేయమంటావా, నువ్వే ఆలోచించుకో అని మీరు బెదిరించొచ్చు. ఒక గ్రామంలో పదే పదే మద్య నిషేధ చట్టాన్ని ఉల్లం ఘిస్తున్నవారెవరైనా ఉన్నట్టు తేలితే జిల్లా కలెక్టర్ అందరి మీద సమష్టి జరిమానా విధించవచ్చు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వలస పాలకులు ప్రయో గించిన చట్టానికి ఇది 21వ శతాబ్దపు వినూత్న ఆవిష్కరణ. న్యాయపరమైన జాప్యాలతో కాలక్షేపం చేయొచ్చనుకుంటే, మీరా విషయానే మరచిపొండి. బిహార్‌లో మీరు హత్య చేసి తప్పించుకోవచ్చు. కావాలంటే జైల్లో ఉంటూనే మీ మాఫియా ముఠాను నడుపుకోవచ్చు, ఇబ్బందికరమైన పాత్రికేయులను హత్య చేయమని ఆదేశించ్చు. కానీ మద్యం ఆరోపణలు మాత్రం అలా కాదు, వాటిని ప్రత్యేక కోర్టులలో విచారిస్తారు. వైఫల్యంతోనే గెలుపు కాబట్టి ఇక అనుమానానికి తావే లేదు. ముఖ్యమంత్రి ఉద్దేశాన్ని, సంకల్పాన్ని బట్టి చూస్తే బహుశా ఇదే అత్యంత పకడ్బందీగా తయారైన చట్టం. అయినా నాలాంటి అలవాటుపడ్డ విమర్శకుడు రెండు ప్రశ్నలను సంధించవచ్చు. ఒకటి, ఈ చట్టం ప్రకారం అలవాటుపడ్డ తాగుబోతుకు జిల్లా కలెక్టర్ ఆరు నెలల బహిష్కార శిక్షను విధించవచ్చు. అతన్ని ఎక్కడకు బహిష్కరిస్తారు? పక్క గ్రామానికా, జిల్లాకా? లేకపోతే బిహార్‌లోని తాగుడుకు ఆలవాటుపడ్డ వారినందరినీ జార్ఖండ్‌కు, ఉత్తరప్రదేశ్‌కు లేదా ఢిల్లీ, ముంబైలకు పంపే స్తారా? ఇక రెండది, మీరు గనుక పేద బిహారీ అయితే ఆందోళన చెందాల్సిం దేమీ లేదు. బజారుకు 100 నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్నంత వరకు మీరు ఆనందంగా కల్లు అమ్మొచ్చు, తాగొచ్చు. ఈ చట్టం మరీ వెర్రిగొట్టుగా ఉందని నా భయం. మీ పిల్లలు లేదా తల్లిదండ్రులు ఏ మద్యం లేదా పొగ తాగరాదని లేదా వాటిని ఎక్కువగా చేయకూడదని మీరు భావిస్తారో అదే నితీశ్ భావిస్తున్నా రనడం నిస్సందేహం. కాకపోతే ఆయన ఒక ప్రత్యేక తరహాలో ఆలోచిస్తున్నా రనేదీ నిజమే. కానీ నితీశ్ చేస్తున్నది అసాధారణమైనదేం కాదు. భారత రాజకీయాల్లో పెంపొందుతున్న గరిషస్థాయి జనాకర్షకవాదమనే కొత్త ధోర ణికి అనుగుణంగానే ఆయన ప్రవర్తిస్తున్నారు. మితిమీరి వాగ్దానం చేయాలి, మితిమీరి చేస్తామనాలి, తరచుగా అసాధ్యమైనవి కూడా చేస్తామనాలి. ఆ వాగ్దానాలను ఓట్లుగా సొమ్ము చేసుకున్నాక అప్పడు ఏమి చేయగలమా అని ఆలోచించవచ్చు. ఈ ప్రత్యేక సందర్భంలో, ఈ చట్టాన్ని ఎవరైనా న్యాయ పరంగా సవాలు చేస్తే అది రాజ్యాంగ పరీక్షలో ఎలా నెగ్గుతుందో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఆదేశిక సూత్రాలకు అనుగుణమైన వాటిలో సాధ్య మైన వాటిని చేయాలని ప్రయత్నించడం, చేయడం ఒకటైతే... మొత్తంగా నేర శిక్ష్మాస్మృతికి పూర్తిగా తూట్లు పొడిచేసి, దాన్ని హైజాక్ చేయడం ఇంకొకటి. గాంధేయ రాజకీయాలలో మద్యపానానికి మద్దతునిచ్చేదిగా కనిపించే ఎంత అసమంజసమైన చట్టాన్నైనా, పనినైనా అడ్డగించే ధైర్యం చేయగలరా? కేంద్రంలోని బీజేపీ ఈ చట్టాన్ని అమోదించనివ్వడమే కాదు, దానికి అంత కంటే నిరంకుశ చ ర్యలను జోడించమని సైతం కోరవచ్చును నిజమే. అలాచేస్తే నితీశ్ మిగతా నాలుగేళ్లూ ఆ చట్టాన్ని అమలు చేస్తూ గడిపేయాల్సి వస్తుంది. మితిమీరిన వాగ్దానాల కొత్త రాజకీయం రాజకీయవేత్తలు మితిమీరి వాగ్దానాలు చేసి, వాటి ఉద్దేశం నెరవేరాక... ఆ గందరగోళపు చిక్కుముళ్లతో తంటాలు పడమని వాటిని తమ వారసులకు వదిలిపెట్టి పోవడమే గరిష్ట జనాకర్షకవాదం సారాంశం. చెడ్డదే ఆయినా జన రంజకమైన చట్టాన్ని లేదా నిర్ణయాన్ని ప్రశ్నించే మూర్ఖత్వాన్ని ప్రదర్శిం చేవారు ఎవరూ లేరు. యూపీఏ ఇదే పనిని తనదైన పద్ధతిలో చేసింది. దేశంలోని పేదలందరినీ వారి సమస్యలన్నిటి నుంటి బయటపడేసేలా... పేదరికం నుంచి అక్షరాస్యత, ఆకలి వరకు అన్నిటికీ చట్టాలను చేసేసింది. అననుకూల వాతావర ణ పరిస్థితులు, వరదలు, క్షామాలకు వ్యతిరేకంగా, భారత జట్టు క్రికెట్లో లేదా హాకీలో ఓడిపోవడానికి వ్యతిరేకంగా చట్టాన్ని చేయడం మాత్రమే వారు మరచిపోయారు లేదా బహుశా అది చేయడానికి వారికి సమయం లేకపోయి ఉండొచ్చు. అప్పట్లో మనం దీన్ని యూపీఏ తాయిలాల రాజకీయాలు అన్నాం. ఇక అన్నా హజారే ఉద్యమం జన్ లోక్‌పాల్ ముసాయిదా బిల్లును పట్టుకొచ్చింది. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరించి అది సాధ్యం కాదని తెలిసి మరీ దాన్ని ముందుకు తెచ్చారు. ఈ ముసాయిదా ప్రకారం ఇరుగు పొరుగులంతా ఒకరిపైన ఒకరు గూఢచారులు కావొచ్చు. దాని ప్రకారం ఎవరైనా లోక్‌పాల్ దర్యాప్తుదారు, విచారణదారు, తీర్పరి కావచ్చు. శిక్షపడ్డ ప్రతి కేసుకూ వారికి ప్రతిఫలం లభిస్తుంది. అందువల్ల ఎవరూ అమాయకులని తీర్పు రాకుండా చేస్తే నగదు రూప ప్రోత్సాహకం కలుగుతుంది. ఇలాంటి బిల్లు ఎన్నటికీ ఆమోదం పొందదు. ఆ మాట మీరు అన్నారంటే... అవినీతిపరుల పట్ల సానుభూతి పరులా? అని నిలదీస్తారు. దీంతో దాన్ని అతిగా నీరుగార్చిన రూపంలోని లోక్‌పాల్ చట్టంగా రూపొందింది. అదీ ఆచరణకు వీలుకానిదే. మొత్తం అధికార వ్యవస్థంతా దాన్ని రద్దు చేయాలని ప్రయత్నిస్తోంది. కాలక్రమేణా ప్రధాన మంత్రిని కూడా దాని పరిధి నుంచి తప్పిస్తారని నేను హామీ ఇస్తున్నాను. తీవ్రస్థాయి జనాకర్షకవాదం కోరే డిమాండ్లు అలాంటివే మరి. వాటిని కాదనే ధైర్యం మీరు చేయలేరు. మన సరికొత్త రాజకీయ పార్టీ ఆప్, ఈ విషయంలో ఆరితేరిన వారినందరినీ తలదన్నిపోయింది. అది తన జన్ లోక్‌పాల్‌తో మొదలుపెట్టి, ఢిల్లీ అంతటా ఉచిత వైఫై, ప్రతి బస్సుకూ సెక్యూరిటీ గార్డూ సీసీటీవీ, వంద కొత్త కళాశాలలు, ప్రైవేటు స్కూళ్లను మించిన ప్రభుత్వ స్కూళ్లు వగైరా వాగ్దానం చేసింది. ఏం జరుగుతుందో మనమే చూద్దాం లేదా జరగకపోతే తప్పు పట్టడానికి దానికి ఎవరో ఒకరు దొరుకుతారు. నితీశ్ రాజకీయ జూదం మద్యం చట్టాన్ని సవాలు చేయడం పౌర సమాజానికి సైతం సాధ్యం కాదని నితీశ్‌కు తెలుసు. ఈ చట్టం అంతగానూ చెల్లనిది మహారాష్ట్ర ప్రభుత్వం డాన్స్ బార్లపై విధించిన నిషేధం . దాన్ని సవాలు చేయడం వల్ల భావ ప్రకటన, జీవనోపాధి స్వేచ్ఛల పరుపు కాసింతైనా దక్కింది. మద్యం సేవించడానికి వ్యక్తికి ఉన్న స్వేచ్ఛ కోసం పోరాడటానికి ధైర్యమున్న వ్యక్తైఉండాలి. ఈ బిల్లు చట్టం కావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని నితీశ్‌కు తెలుసు. ఈలోగా ఆయన తాను చేస్తానన్నది చేశానని ప్రచారం చేసుకుంటారు, దాని అమలుకు ఏదైనా అడ్డు తగిలితే లేదా ఆలస్యం జరిగితే అందుకు ఇతరులను తప్పు పట్టవచ్చు. 2019 జాతీయ ఎజెండాలో ఆ వాగ్దానాన్ని చేర్చవచ్చు. ఈ మూర్ఖపు వాగ్దానాన్ని అమలు చేయాలనుకుని కాంగ్రెస్ కేరళలో, డీఎంకే తమిళనాడులో విఫలమైతేనేం. నితీశ్ తిరిగి అదే చేశారు. కారణం ఆయనకు కులం పునాదిపై ఆధారపడ్డ ఓట్లు పెద్దగా లేవు. బిహార్‌లో లాలూకే అతని కంటే ఎక్కువ ఓట్లున్నాయి. ప్రతి ఒక్కరూ సోషలిస్టులే కాబట్టి ‘లౌకిక’ స్థానం కోసం పోటీపడేవారు చాలా మందే ఉండారు. ఈ మద్య నిషేధం, ఓటర్లలో ప్రత్యేకించి మహిళల్లో నితీశ్‌కు ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించి పెడుతుంది. ఇత రులు అలాంటి యోచనే చేసి, అనుసరించి చిక్కుల్లోపడ్డారు లేదా హాని చేశారు లేదా రెండూ జరిగాయి. స్విస్ బ్యాంకుల్లోని లక్ష కోట్ల డాలర్లను తిరిగి తెస్తామని బీజేపీ చేసిన వాగ్దానం చివరికి ఓ పరిహాసోక్తిగా మారింది. కానీ ఆ వాగ్దానం ఫలితంగా నిరంకుశమైన నల్లధనం చట్టం వచ్చింది. అది పాత విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టాన్ని (ఫెరా), మరింత దురాశాపరులైన, మరింత శక్తివంతులైన పన్నుల అధికారులను రంగం మీదకు తెచ్చింది. ఘోర వైఫల్యానికి దారి ఎప్పుడూ సదుద్దేశాలతో పరిచినదే అయివుంటుంది. ఇది బాగా కాలం చెల్లిన, పాత నానుడి. నేటి మన రాజకీయాల్లో ఘోర వైఫల్యానికి దారి ఎప్పుడూ అత్యంత కచ్చితంగా లెక్క గట్టిన నిరాశావాదం, ఉద్దేశపూర్వకమైన అబద్ధాలు, ఎలాగోలా గెలవాలని ముందు తరాల తరఫున మితిమీరి వాగ్దానాలు చేయడంతో పరచినదై ఉంటుందని అనడం మరింత సమంజసమవుతుంది. ఈ భారతీయ తరహా గరిష్ట జనాకర్షకవాదం ఎన్నికల్లో ఫలితాలను ఇవ్వడం చూస్తున్నాం. నితీశ్ యోచన సరిగ్గా ఇదే. రచయిత:శేఖర్ గుప్తా twitter@shekargupta -
‘ఉదారవాదం’ జాడ ఎక్కడ?
జాతిహితం 1991 నాటి సంస్కరణలు, ఉదారవాద విధానాలు లెసైన్స్-కోటా రాజ్ ను నిజంగానే సడలించాయి. నిజమైన ఉదారవాది తన ఆధీనంలోని అధికారాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. వ్యాపార రంగానికి సంబంధించిన మరిన్ని అంశాలను ప్రభుత్వానికి దూరంగా ఉంచడమనే అర్థంలో మోదీ ఉదారవాది కారు. ఆ మేరకు ఆయన చైనా తరహా రాజ్య ప్రధానవాది. తక్కువ ప్రభుత్వం ఎక్కువ పరిపాలన అన్న ఆయన నినాదాన్ని ‘‘మరింత ప్రభుత్వం, మెరుగైన ప్రభుత్వం’’ అని తిప్పి చదువుకోవాలి. మంచుతో కప్పడి ఉన్న దావోస్ నుంచి ప్రపంచ ఆర్థిక వేదిక గురించి నివేదిస్తూ క్రికెట్ గురించి ప్రస్తావించడం హాస్యాస్పదం అనిపిస్తుంది. కానీ గత కొన్నేళ్లుగా ఈ సమావేశాల్లో వినవస్తున్న మాటను బట్టి చూస్తే, టెస్ట్ క్రికెట్‌కు రోహిత్ శర్మ ఎలాగో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత ఆర్థిక వ్యవస్థ కూడా అలాంటిదేనేమోనని ఆశ్చర్యం కలుగుతుంది. రోహిత్ శర్మ ప్రతిభను అంతా గుర్తిస్తారు. అతను సఫలం కావాలని కోరుకుంటారు. అయితే ఆ అద్భుత ప్రతిభ అప్పుడప్పుడూ మెరుస్తుందే తప్ప, మొత్తంగా చూస్తే అతగాడు తన శక్తిసామర్థ్యాలకు తగ్గట్టుగా రాణించకపోవడం అభిమానుల, సెలెక్టర్ల సహనాన్ని నశింపజేసేట్టుగా ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థ శక్తిసామర్థ్యాలను నేటికి దశాబ్దికి ముందే అంతా గుర్తించారు. 2003-07 మధ్యలో అది తన పై పెంకును పగల గొట్టుకుని బయటకు వస్తున్నట్టనిపించింది. చైనా పతనోన్ముఖం అయ్యే సమయానికి బయటపడి, దాని స్థానాన్ని ఆక్రమించి, శూన్యాన్ని పూరిస్తుందని ప్రపంచ నేతలు, దేశాలు, కార్పొరేషన్లు ఆశించాయి. చైనా అ దశకు చేరుకుంది కానీ, భారత్ అక్కడికి ఇంకా చేరుకోలేదు. ఎప్పటి లాగే, మనది గొప్ప శక్తిసామర్థ్యాలున్న దేశమే. కాకపోతే అందుకు తగ్గ సంఘటిత కృషి చేసేట్టు అయితేనే అది అంతటి శక్తివంతమైనది కాగలుగుతుంది. ఆ ‘‘అయితేనే’’ అనేదే ప్రబలమైనది. నిరుపయోగంగా ఉన్న అనుకూలతలు ఆ ‘‘అయితేనే’’అనే దాన్ని ఎంత కచ్చితంగా నిర్వచించగలం? అమెరికన్ అర్థశాస్త్రవేత్త నూరియెల్ రూబినీ అంటే మహాప్రళయ ప్రవక్తగా ప్రపంచ వ్యాప్త గుర్తింపూ, భయమూ కూడా ఉన్నాయి. దావోస్ సమావేశంలో అరుణ్ జైట్లీ కేంద్రంగా సాగిన భారత్‌పై చర్చలో రూబినీ పై ప్రశ్నకు సంక్షిప్తంగా సమాధానం చెప్పారు. భారత్ ఇప్పుడు ‘స్వీట్ స్పాట్’(కీలక స్థానం)లో ఉన్న దనీ, పెట్టుబడి లోటును భర్తీ చేసుకునే మార్గాలపై అది దృష్టిని కేంద్రీకరిం చడం మాత్రమే చేయాల్సి ఉందనీ ఆయన అన్నారు. భారత్‌కు ఇప్పుడు అన్ని రకాలైన పెట్టుబడులూ కావాలి. రూబినీ మాటల్లోనే చెప్పాలంటే... భౌతిక మైన మౌలిక సదుపాయాలు, నిపుణ శ్రమశక్తి, మేధో సంపదలకు సంబం ధించిన పెట్టుబడులు, ప్రభుత్వ నియంత్రిత పెట్టుబడులు అన్నీ అవసరమే, భారత్‌ను నిజంగానే కీలక స్థానంలో ఉంచగలిగిన అంశాలన్నిటి సాను కూలతను ఉపయోగించుకోవడానికి ఇవన్నీ చేయమనడం పెద్ద కోరికే. కానీ ప్రస్తుత ప్రపంచవ్యాప్త హఠాత్ భయాందోళనలకు కారణం సరుకుల (ప్రత్యే కించి చమురు) ధరలు పడిపోవడమే. మనది గణనీయమైన స్థాయిలో నికరంగా సరుకులను దిగుమతి చేసుకునే పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. కాబట్టి ఈ పరిణామం సమస్యాత్మకంగా ఉన్న మన దేశ ద్రవ్య, వాణిజ్య లోటుకు మేలు చేస్తుంది. మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు ఉడాయి స్తున్న మాట నిజమే. కానీ, అది పరివర్తనాత్మకమైనదే. కాబట్టి అవి పలా యనం చిత్తగిస్తున్న ప్రతి చోటకు భారత్ వేగంగా కదలాల్సి ఉంటుంది. దాదాపుగా ప్రపంచానికే ఒక మినహాయింపులాంటి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి. ఇప్పటికీ మనం ఆ పని చేయగలం. అయితే, దావోస్‌లో ఎవరూ నాలుగు మంచి మాటలకు మించి, భారత్ నిజంగానే ఆ అద్భుత స్థానానికి చేరుకుంటుందని ఎవరూ ఒప్పంచలేక పోయారు. సుప్రసిద్ధ బహుళజాతి సంస్థల నేతల ప్రకటనలకు, అందులోనూ అవి జాతీయ నేతల సమక్షంలో చేసినవైనప్పుడు మనం ఉప్పొంగిపోజాలం. ఆ మాటలనే పట్టుకుని మన దేశంలో అమలుచేసేయలేం. ఉదాహరణకు, 2016 భారత దేశపు సంవత్సరమనీ, భారత్ తన బంధనాలను తెంచుకుని బయటపడతుందని సిస్కో సంస్థకు చెందిన జాన్ చాంబర్స్ అన్నారు. సిస్కోకు మన దేశంలో గణనీయమైన ఉనికే ఉంది. పైగా చాంబర్స్ ఇప్పుడు అమెరికా-భారత్ వ్యాపార మండలి అధ్యక్ష పదవిని చేపడుతున్నారు. ఆయన భారత్ గురించి మంచి మాటలు చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే రూబినీకి ఉన్న అర్హతలే ముఖ్యమైనవి. ఆశావాదానికి సవాలు 2014-15లో భారత్ పట్ల ఉన్న నైరాశ్యం అర్థం చేసుకోగలిగిందే. అప్పట్లో యూపీఏ తన రాజకీయ పెట్టుబడిని కోల్పోవడమేగాక, మన్మోహన్సింగ్ నేతృత్వంలో అమలుపరచిన సంస్కరణల నుంచి వైదొలగుతున్నట్లు కూడా అనిపించింది. దీంతో వారు రక్షణాత్మక వైఖరి వహించారు. ఇక భారీ కుంభ కోణాల గురించిన చర్చ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కార్పొరేట్ వ్యతిరేక సెంటిమెంట్‌ను మరింతగా ఎగదోసింది. అంతేకాదు, భారత్ భారీ ప్రభుత్వ లోటును ఇంకా ఎదుర్కొంటున్నదనే సమంజసమైన అభిప్రాయాన్ని కలుగ జేసింది. భారత్‌లోని నెమ్మదైన, దృఢమైన, న్యాయ వ్యవస్థ పట్ల గతంలో ఉన్న గౌరవం సైతం వొడాఫోన్ రెట్రోస్పెక్టివ్ పన్ను సమస్యతో (గత నిబంధ నలను ఇప్పుడు సవరించి పన్ను చెల్లించమనడం) దెబ్బతింది. ద్రవ్య లోటు, వాణిజ్య లోటు రెండూ అదుపు తప్పాయి. నరేంద్ర మోదీ ఎన్డీ ఏ పూర్తి ఆధిక్యతతో అధికారంలోకి వచ్చాక ఇదంతా మారుతుందని ఆశించారు. ఆ ఆశావాదం ఇప్పుడు సవాలును ఎదుర్కొంటోంది. ఇక కొత్త కుంభ కోణాలేవీ లేవనే వాస్తవానికి విస్తృతంగానే గుర్తింపు లభించింది. మోదీని నిజమైన శక్తివంతమైన జనాకర్షణగల కొత్త నేతగా చూస్తున్నారు. ఆయన ప్రపంచమంతా పర్యటించి దేశాధినేతలతోనూ, కార్పొరేట్ అధిపతులతోనూ వ్యక్తిగత అనుబంధాలను నెలకొల్పుకుంటున్నారు. భారత్‌కు మరింత శక్తివం తమైన, చలనశీలమైన దేశంగా గుర్తింపు లభిస్తోంది. ‘స్వచ్ఛభారత్’ నుంచి ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్టార్ట్ అప్ ఇండియా’ వంటి ఆయన చేపట్టిన కార్యక్రమాలతో పాటూ, మత ప్రబోధకునిలా ఆయన వాటిని ప్రచారం చేయడాన్ని కూడా ప్రశంసిస్తున్నారు. కానీ ఫలితాలు లేదా మార్పు ఎక్కడ? మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార వర్గాలు... 1991లో మన్మోహన్సింగ్ చేపట్టిన సంస్కరణలతో పోటీపడేలా నరేంద్రమోదీ మరో దఫా సంస్కరణలను చేపడతారని ఆశించింది. ఆయన ప్రభుత్వం నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వం కంటే చాలా బలమైనది. అంతేకాదు, ఆర్థిక వ్యవస్థ నిజమైన సంక్షోభాన్ని ఎదుర్కోవడమనే ‘‘వరం’’ సైతం ఆయనకు లభించింది. ప్రజాస్వామ్యంలో సత్వర సంస్కరణలకు, సరళీకరణకు సమంజ సత్వం లభించడానికి అవి రెండూ ముందు షరతులు. ఇప్పుడిక, నరేంద్ర మోదీ గురించిన కొత్త అంచనా ముందుకు వస్తోంది. సరళంగా చెప్పాలంటే, మోదీ బలమైన, చిత్తశుద్ధిగల సంస్కర్తేగానీ కచ్చితమైన సరళీకరణవాది కారనే అభిప్రాయం కలగుతోంది. ఇది ఎలా పనిచేస్తుంది? ఉదారవాది కారు... సంస్కరణవాదే మోదీ చాలా ప్రభుత్వ క్రమాలను సంస్కరించారు. స్పెక్ట్రమ్, ఖనిజాల వంటి వనరుల వేలం సాఫీయైన, ఆరోగ్యకరమైన పద్ధతిలో పడింది. ప్రభుత్వ ప్రాజెక్టులకు ఈ-టెండర్లను పిలవడం మరో ముఖ్య సంస్కరణ. అలాగే డీజిల్‌పై సబ్సిడీని పూర్తిగా తొలగించి, ఎల్పీజీపై సబ్సిడీని క్రమంగా తగ్గించుకుంటూ పోవడం, నగదు బదిలీలను ప్రవేశపెట్టడం వంటి చర్యలు చాలానే చేపట్టారు. ఇవన్నీ ముఖ్యమైనవే. కానీ అవి పూర్తిగా సంస్కరణల కోవకు చెందుతాయే తప్ప ఉదారవాద విధానాల అమలు కాదు. తేడా ఏమిటి? 1991 నాటి సంస్కరణల పరంపర, ఉదారవాద విధానాలు దేశంలోని లెసైన్స్-కోటా రాజ్ ను నిజంగానే బాగా సడలించి భారత వాణిజ్యాన్ని పాత ఫ్యూడల్ మాఫియా ‘‘డెరైక్టరేట్ల’’ నుంచి విముక్తి చేసింది. వాణిజ్య మంత్రిగా చిదంబరం తన మంత్రిత్వ శాఖకు అధికారాలను సమకూర్చిన డెరైక్టరేట్లనే రద్దుచేసేశారని ఒక సందర్భంగా మన్మోహన్ అన్నారు. నిజమైన ఉదారవాది ప్రభుత్వంలో తన అధీనంలో ఉన్న అధికారాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అది మోదీ పద్ధతి కాదని నేడు విశ్వసిస్తున్నారు. ఆయన ప్రభుత్వ క్రమాలను, పారిశుద్ధ్యాన్ని, నియంత్రణ వ్యవస్థలను తెలివిగా సంస్క రించగలిగిన శక్తిసామర్థ్యాలు కలిగిన నేత. అంతేగానీ వ్యాపార రంగానికి సంబంధించిన మరిన్ని అంశాలను ప్రభుత్వానికి దూరంగా ఉంచడమనే అర్థంలో ఆయన ఉదారవాది కారు. ఆ మేరకు ఆయన చైనా తరహా రాజ్య ప్రధానవాది (స్టేటిస్ట్). తక్కువ ప్రభుత్వం ఎక్కువ పరిపాలన అన్న ఆయన నినాదాన్ని ‘‘మరింత ప్రభుత్వం, మెరుగైన ప్రభుత్వం’’ అని తిప్పి చదువుకోవాలి. ఈ వాదనకు సమర్థనగా చాలా ఆధారాలనే చూపాం. స్టార్ట్-అప్ ఆర్థిక రంగంలో దాని కోసం నిధిని ఏర్పాటు చేయడం అందుకు తాజా ఆధారంగా చూపవచ్చు. లేదంటే వాజపేయీ ఎన్డీఏను అనుసరించి ప్రైవేటీకరణకు తిరస్కరించడాన్ని చెప్పుకోవచ్చు. అయితే, ప్రపంచ వాణిజ్య ఒప్పందాల విషయంలో ఆయన ప్రభుత్వ వైఖరి పట్ల వ్యక్తమౌతున్న అసహనం మరింత ముఖ్యమైనది. ఈ విషయంలో యూపీఏ కన్నా మోదీ ప్రభుత్వం మరింత కఠినమైన ప్రొటెక్షనిస్టు వైఖరిని (రక్షిత విధానాలను) అవలంబిస్తోందని భావిస్తున్నారు. టీపీపీ, అపాక్ వంటి నూతన ప్రపంచ, ప్రాంతీయ కూట ములు అందిస్తున్న అవకాశాలను ఈ వైఖరి భారత్‌కు అందకుండా చేస్తోంది. ఆ రెండు అవకాశాలు గత ఏడాది ఒబామా పర్యటన సందర్భంగా అందివచ్చాయి. కానీ మోదీ ప్రభుత్వ నూతన విధానం... జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చింతనకంటే అతివాదంగానూ, ఆర్ఎస్ఎస్ చింతన కంటే మితవాదంగానూ అనిపిస్తోంది. కాబట్టి ఆ దిశగా కదలికే కనబడలేదు. భారత్ పట్ల ప్రపంచం చూపుతున్న ఉత్సాహంపై అది నీళ్లు చల్లుతోంది. -శేఖర్ గుప్తా twitter@shekargupta -
కాల్పనికతను విడనాడతారా?
సందర్భం మోదీ గాలి ఇంకా ఉందనే అనుమానాలు ఏమైనా మిగిలి ఉంటే, వాటిని కూడా బిహార్ తీర్పు చెల్లాచెదురు చేసింది. ఇప్పుడిక ఆయనను అంచనా వేసేది ప్రధానిగా ఆయన ఆచరణను బట్టి మాత్రమే. పరిపాలన, నిజమైన గణాంకాలు, ద్రవ్యోల్బణం, వృద్ధి, ఉద్యోగాలు, సామాజిక ఐక్యత వంటి ఆంశాల ఆధారంగానే ఆయనను అంచనా వేస్తారు. బిహార్ ఎన్నడూ దేశంలోని ప్రముఖ రాష్ర్టంగా లేదు. కానీ అది దేశ రాజకీయ వాతా వరణ మార్పుల దిశను సూచించే రాష్ట్రంగా ఉంటోం ది. గత యాభై ఏళ్ల రాజకీయ చరిత్రను ఒకసారి పరికించి చూడండి. నేడు బిహార్ ఏమి ఆలోచిస్తుందో, అదే రేపు భారతావని ఆలోచించేది అవుతుందని అర్థమౌతుంది. 1960 దశాబ్ది మధ్య నుంచి కాంగ్రెస్ ఎదురు దెబ్బలు తినడం మొదలైనది బిహార్‌లోనే. దిగువ-మధ్యస్థ కులాల కూటములు పెంపొందడం అక్కడే ప్రారంభమై దేశవ్యాప్తంగా విస్తరించాయి. 1974 నాటి జేపీ ఉద్యమం మొదలుకొని, చివరకు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రముఖ జాతీయస్థాయి నేతగా ఎదిగేవరకూ... జాతీయ రాజకీయాలపై నిర్ణయాత్మక ప్రభావం చూప గలిగిన మార్పులన్నీ అక్కడే సంభవించాయి. తాజా ఎన్నికల ఫలితాలు కూడా వాటితో పోల్చదగినంతటి ప్రాముఖ్యతను కలిగినవి. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ వారసత్వంగా అధి కారాన్ని నిరాటంకంగా అనుభవించింది. ప్రత్యర్థులుగా ఉన్న ప్రతిపక్షాలన్నీ ఐక్యం కావడం మొదలు కావడం తోనే దేశ రాజకీయాలు మారిపోయాయి. ప్రతి పరిణా మమూ పెను వేగంగా జరిగిపోతోంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడచిన 18 నెలల కాలం దశా బ్దాలలాగా అనిపిస్తోంది. ప్రతిపక్షాల ఐక్యతా సూచిక శక్తి ఏమిటో బిహార్ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయి. ఈ ఫలితాలు రానున్న రాష్ట్రాల ఎన్నికలకు నమూనాగా మారుతాయి. అలా అని అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడులలో ఏమి జరగనున్నదో ఇప్పుడే చెప్పలేం. కానీ కాంగ్రెస్, వామపక్షాలు సహా ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలన్నీ తమ రాజకీయాలను సమీక్షించుకుం టాయి. తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో గణనీయమైన సంఖ్యలో స్థానాలను సాధించాలని ఆశిస్తున్న బీజేపీ తనకున్న అవకాశాలను తిరిగి అంచనా వేసుకోడం అవసరం. బిహార్, మోదీకి తగిలిన తొలి ఎదురు దెబ్బేమీ కాదు. 2014 మే, ఢిల్లీ ఎన్నికల్లోనే ఆయన ఎదురు దెబ్బ తిన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రత్యేకతనీ, దేశ వ్యాప్తంగా ఆ ఫలితాలు ప్రభావం చూపగలవి కాదనీ అనుకున్నా... బిహార్ ప్రభావం మాత్రం నిజం. కాబట్టి మోదీ రెండు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఒకటి, రాజ్యసభలో అతి త్వరితంగా సంఖ్యాబలాన్ని పెంచేసుకోగలమనే అభూత కాల్పనికత ఇప్పుడు చెదిరిపోయింది. కాబట్టి పరిపాలనకు అనువుగా తాము సర్దుబాటు కావడం ఎలా? అనేది. పార్లమెంటు సజావుగా సాగి, బిల్లులు ఆమోదం పొందగలిగేలా ప్రతి పక్షాలతో ఆచరణాత్మక మైన సంబంధాల సమీకరణాన్ని సాధించడం అవసరం. అందుకు వారితో చర్చలు సాగించడానికి ఆయన ఇప్పటికైనా అంగీకరిస్తారా? అదేమంత తేలిక కాదు. అందుకు ప్రచారం గాడిలోంచి మోదీ పాత తరహా పరిపాలన అనే గాడిలో కుదురు కోవాల్సి ఉంటుంది. రెండోది, రాజకీయాలకు సంబంధించినది. మోదీ-షా నాయకత్వ నమూనా ఇప్పుడు ప్రశ్నార్థకమైన దిగా మారింది. బిహార్ ఎన్నికల్లో అమిత్ షాకు విపరీత ప్రాధాన్యం ఇవ్వడమే కాదు, పార్టీలో మోదీ తర్వాత ఆయనను రెండో స్థానంలో కూచోపెట్టారు. పార్టీని ఇలా గుజరాతీలు స్వాధీనం చేసుకోవడం అంతర్గత అసంతృప్తిని రాజేసింది. ఇకనైనా ఆయన ప్రతి రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముందు నిలవడం మాని, పూర్తికాలం ప్రధానిగా పనిచేస్తారా? ఎవరినో ఒకర్ని చావబాదినంత మాత్రాన ఓట్లురాలని 2015 భారతంలో ప్రజలను రెండు శిబిరాలుగా చీల్చే రాజకీయాలు గెలుపును సాధించలేవనడానికి ఆయనకు ఇంకా రుజువులు అక్కర్లేదు. షాతో పాటూ ఆయన కూడా బిహారీ మనసును అర్థం చేసుకోలేకపోయారు. రాజకీయ వివేక శూన్యులై, అవమానకరంగా వారు సాగించిన ఎన్నికల ప్రచారం ఇటీవలి కాలం ఎన్నడూ ఎరుగనిది. వారీ దాష్టీకాన్ని దేశంలో మరెక్కడా ప్రదర్శించకుండా ఉంటారని ఆశిద్దాం. ఈ రెండో నిర్ణయం పూర్తిగా మోదీదే. దాని పర్యవసానాలు ఆయన పార్టీ సహచరుల మీద బలంగా ఉంటాయి. నిష్పాక్షికంగా నిజంగానే దేశానికి ఏమి అవసరం అనే ది ముందుగా నిర్ణయించుకోవాలి. మోదీ తిరిగి మరింత చిత్తశుద్ధితో తన దృష్టిని పరిపాలనపైనే కేంద్రీకరిస్తే అద్భుతంగా ఉంటుంది. క్లుప్తంగా చెప్పా లంటే, ఈ ఎదురుదెబ్బయినా ఆయనను మరింత ఎక్కువ ప్రధాన మంత్రి వ్యవహార శైలిని అలవరుచుకు నేలా ఒప్పించగలిగితే ఈ ఓటమి ఆయనకు నిజంగానే మేలవుతుంది. ఇప్పుడాయన ప్రతిపక్షాల అగ్రనేతలను కలుసుకుని, పార్లమెంటరీ వాతావరణాన్ని మెరుగు పరచి, పరిపాలన కు నిజమైన ఊపును ఇవ్వడానికి కృషి చేయాలి. విభజించే రాజకీయాలు, అసహనాలకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడాలి, దుర్భాషాభరితమైన సోషల్ మీడియా సేనలకు దూరంగా ఉండాలి. తన ప్రభుత్వం ప్రతికూలాత్మక ధోరణిగలదని పేరు తెచ్చే బాధ్యతారహితమైన, దురభిమాన పార్టీ సహచరులను, వ్యక్తులను, భజనపరులను దూరంగా ఉంచాలి. 2014 నాటి మోదీ విజయానికి ప్రాతిపదిక ఒక వాగ్దానం మాత్రమే. ఆ చెక్కును అప్పుడే నగదుగా మార్చేసుకున్నారు. ఇప్పుడిక ఆయనను అంచనా వేసేది ప్రధానిగా ఆయన ఆచరణను బట్టి మాత్రమే. ఆయన ఉపన్యాస ఝరి ఎంత గొప్పదైనా, ఎన్ఆర్ఐలను మైమరిపింప జేసేదైనా... పరిపాలన, నిజమైన గణాం కాలు, ద్రవ్యోల్బణం, వృద్ధి, ఉద్యోగాలు, సామాజిక ఐక్యత వంటి ఆంశాల ఆధారంగానే ఆయనను అంచనా వేస్తారు. మోదీ ఎన్నికల జైత్రయాత్రకు బిహార్ ముగింపు పలికింది. ఈ వాస్తవాన్ని అంగీకరించగల నమ్రత ఆయనకు ఉంటే మాత్రమే ప్రధాన మంత్రి కావడం ఆయన పాలిటి అత్యుత్తమమైన పరిణామంగా నిలుస్తుంది. - శేఖర్ గుప్తా twitter@shekargupta