సార్వజనీన ఆదాయం కనికట్టు!
విశ్లేషణ
సంక్షోభాల్లో ఉన్న ప్రజానీకం తిరుగుబాట్ల వైపు పోకుండా నిలువరించడానికి క్విడ్ ప్రో కో రూపంలో పేదలకు కొంత డబ్బును అందించి కాస్త ఉపశమనాన్ని కల్పించ డమే సార్వత్రిక కనీస ఆదాయ పథకం లక్ష్యం. అసమానతలను ఇది తొలగించలేదు.
‘సార్వజనీన కనీస ఆదాయం’ అనేది ఈ మధ్య కాలంలో, ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా చర్చనీయాంశంగా ఉంటోన్న అంశం. వివిధ దేశాలలోని ప్రజా నీకానికి ఆయాదేశాల ప్రభు త్వాలు, నెలవారీ నిర్దిష్ట మెుత్తాన్ని నగదు చెల్లింపుగా అందజేయ టమే ఈ సార్వజనీన కనీస ఆదాయ (సా.క.ఆ.) భావన తాలూకు సారాంశం. పేద రికం, నిరుద్యోగ సమస్యలతో సతమతమవుతోన్న తమ తమ దేశాల సామాన్య ప్రజల కష్టాలను కొంత మేరకు ఉపశమింపజేసేందుకు సా.క.ఆ భావనను పలు ప్రభు త్వాలు ఆశ్రయిస్తున్నాయి. స్థూలంగా 2008 నుంచి ఏర్ప డిన ఆర్థికమాంద్య పరిస్థితులలో ప్రపంచ దేశాలన్నింటి లోనూ పెరిగిపోతోన్న నిరుద్యోగం, ఆర్థిక అసమానతల భారం నుంచి సామాన్యులకు ఉపశమనం కల్పించేందుకు ఈ సా.క.ఆ ను ఫిన్‌లాండ్ దేశంలో 2016 డిసెంబర్ నుంచి పైలెట్æ ప్రాజెక్టుగా అమలు జరుపుతున్నారు. దీనిలో భాగంగా ఆ దేశంలోని ప్రజలందరికీ నిర్దిష్ట నగదును నెల వారీ అందించే ప్రయోగం జరుగుతోంది.
గత కొంత కాలంగా భారతదేశంలో కూడా ఈ అంశం ఉన్నతస్థాయి చర్చలలో ఉంటోంది. ఈ క్రమంలోనే 2017– 2018 కేంద్ర బడ్జెట్‌ను సమర్పించేందుకు ఒక రోజు ముందుగా అంటే జనవరి 31వ తేదీన ప్రభుత్వం పార్ల మెంట్‌లో ప్రవేశపెట్టే ఆర్థిక సర్వేలో ఈ సా.క.ఆ.భావనను ఒక విస్తృత చర్చనీయాంశంగా ముందుకు తెచ్చే ఆలోచన ఉందని వార్తలు వస్తున్నాయి. నిజానికి గత యూపీఏ ప్రభుత్వ హయాంలోనే 2010లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 2 గ్రామాలలో ఈ సా.క.ఆ. ఆలోచనకు సంబంధించిన పైలెట్ ప్రాజెక్టును అమలుపరిచారు. అటు యు.పి.ఎ. లేదా ఇప్పటి ఎన్.డి.ఎ ప్రభుత్వాలు ఎన్ని వాగ్దానాలు చేసినా, అవి రెండూ అనుసరించిన, అనుసరిస్తోన్న ఆర్థిక సంస్కర ణల వలన దేశంలో నిరుద్యోగం, అసమానతలు భారీగా పెరిగిపోతున్నాయి. ఉదాహరణకు 2015లో, అంటే ‘‘మేక్ ఇన్ ఇండియా’’ నినాదం అమలులోకి వచ్చిన తరువాత మన దేశంలో కేవలం 1,35,000 మందికి మాత్రమే ఉపాధి కల్పించారు. కాగా, అంతకుముందర 2014–2015 సంవ త్సరాలలో ఉపాధికల్పనా స్థాయి సాలీన 4 లక్షలకు పైబడే ఉంది.
మన దేశంలో కూడా 2008 ఫైనాన్స్ సంక్షోభం అనం తరం మెల్లమెల్లగా ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్నాయి. కాగా, మన దేశంలో సగటున సంవత్సరానికి ఉపాధి మార్కెట్‌లోకి వస్తోన్న సుమారు 10 లక్షల మంది యువకు లకు మనం తగిన మేర జీవికను చూపలేకపోతున్నాము. ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారమే 2014లో మన దేశ యువజనులలోని ప్రతి ముగ్గురిలో కేవలం ఒక్కరికి మాత్రమే ఉపాధి లభించింది. పైగా ప్రపంచమంతటా ‘ఉపాధిరహిత అభివృద్ధి’ అంటున్న నేటి యాంత్రీకరణ, రోబో యుగంలో, మన దేశంలోనూ ఉపాధి అవకాశాలు రాను రాను మరింతగా దిగజారిపోతున్నాయి. అందుచేతనే నీతిఆయోగ్ సంస్థ సి.ఇ.ఓ అమితాబ్ కారిత్ ఒక ఇంట ర్వూ్యలో చెప్పిన ప్రకారంగా ‘యాంత్రీకరణ వలన ఉపాధి మార్కెట్‌లో ఏర్పడుతోన్న విచ్ఛితిని తట్టుకొనేందుకు ఈ సా.క.ఆ పథకం అవసరం.’
నిరుద్యోగ యువత, ఆర్థిక అసమానతల పీడితులలో అసంతృప్తి, ఆందోళనలు తీవ్రంగా పెరిగిపోయి, అవి సామాజిక సంక్షోభానికి దారితీయకుండా, నియంత్రిం చేందుకే ఈ సా.క.ఆ పథకాలను వివిధ రూపాలలో ప్రవేశ పెట్టేందుకు అనేక దేశాల ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తున్నాయి. నిజానికి ఈ ఆలోచనల సారాంశం 18వ శతాబ్దం లోనే నాటి తత్వవేత్త, క్రియాశీల రాజకీయవేత్త అయిన థామస్ పెయిన్ చెప్పినట్లుగా: ‘‘ప్రభుత్వం ప్రజలకు కనీస ఆదాయాన్ని హామీ చేయటం.. ప్రైవేట్ ఆస్తిని కాపాడు కోగలిగేటందుకు ‘క్విడ్ ప్రో కో’గా ఉండగలదు.’’ అంటే ఆర్థిక అసమానతలు, నిరుద్యోగ భారం క్రింద నలిగిపో తోన్న కోటానుకోట్ల మంది ప్రజానీకం తిరుగుబాట్ల బాట పట్టకుండా నిలువరించడానికి ఈ సా.క.ఆ. పథకం రూపంలో క్విడ్ ప్రో కోగా కొద్దిపాటి ఉపశమనాన్ని కల్పించడమే పలుదేశాల పాలకుల ఉద్దేశ్యం. అయితే ఈ సా.క.ఆ రూపంలో పేద ప్రజలకు కొద్దిపాటి డబ్బును అందించగలిగినా అది మెుత్తంగా ఆర్థిక అసమానతల స్థితిని ఏ మాత్రం పరిష్కరించలేదు.
ఈ సందర్భంలోనే భవిష్యత్ కాలంలో పెట్టుబడిదారీ వ్యవస్థలలో తీవ్రతరం కానున్న నిరుద్యోగం వంటి సమస్య లను ముందుగానే గ్రహించి ఆ వ్యవస్థను హెచ్చరించిన కమ్యూనిస్టు సిద్ధాంతకారుడు కార్ల్‌మార్క్స్ మాటలను మనం గుర్తు చేసుకోవాలి. ఆయన తమ కమ్యూనిస్టు ప్రణా ళికలో ఇలా చెప్పారు: ‘‘..ఆధునిక కార్మికుడు పరిశ్రమలు అభివృద్ధి అయ్యేకొద్దీ పైకిSరాకుండా ఇంకా కిందికి పోతు న్నాడు; కార్మిక జీవన వి«ధానానికి కూడా అంటిపెట్టుకోలేక దినదినానికి అడుక్కు, ఇంకా లోతుకు పోతున్నాడు. కార్మి కుడు బుక్కాపకీరవుతున్నాడు... కాబట్టి ఒక విషయం స్పష్టపడుతున్నది: సమాజంలో పాలకవర్గంగా వుండడానికి బూర్జువా వర్గానికి ఇక ఎంత మాత్రమూ యోగ్యత లేదు.. సమాజాన్ని పాలించడానికి అది అనర్హం: ఎందుకంటే, తన బానిసకు బానిస బతుకునైనా నమ్మకంగా చూపించగల సామర్థ్యంలేదు దానికి; తన బానిస బిచ్చమెత్తుకోవలసిన దుస్థితికి దిగజారిపోతే, బానిస శ్రమ మీద తాను బతక డానికి బదులు తన బిచ్చం మీద బానిసగా బతకవలసిన దుస్థితి సంభవిస్తే, ఏమీ చేయడానికి సామర్థ్యంలేదు దానికి...’’
డి. పాపారావు
వ్యాసకర్త ఆర్థిక విశ్లేషకులు ‘ మెుబైల్: 98661 79615