
గ్రహం అనుగ్రహం 05 జనవరి 2016, మంగళవారం
శ్రీ మన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం, తిథి బ.ఏకాదశి తె.5.10 వరకు (తెల్లవారితే బుధవారం),
నక్షత్రం విశాఖ పూర్తి ,
వర్జ్యం ఉ.10.15 నుంచి 12.01 వరకు
దుర్ముహూర్తం ఉ.8.47 నుంచి 9.38 వరకు
తదుపరి రా.10.48 నుంచి 11.38 వరకు
అమృతఘడియలు రా.8.41నుంచి 10.24 వరకు
సూర్యోదయం: 6.36
సూర్యాస్తమయం: 5.35
రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
భవిష్యం
మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులు దగ్గరవుతారు. వ్యాపార,ఉద్యోగాల్లో పురోభివృద్ధి.
వృషభం: ఇంటా బయటా అనుకూల వాతావరణం నెలకొంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి.
మిథునం: పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
కర్కాటకం: విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు పెరగవచ్చు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
సింహం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వస్తు, వస్త్ర లాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి.
కన్య: వ్యయ ప్రయాసలు. ధన వ్యయం. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు వస్తాయి. ఆలయ దర్శనాలు. ఆరోగ్య భంగం. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
తుల: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు వింటారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖుల ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
వృశ్చికం: వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు. నిర్ణయాలలో మార్పులు. ఆరోగ్యసమస్యలు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
ధనుస్సు: కార్యజయం. శుభకార్యాలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వాహనయోగం. వివాదాల పరిష్కారం. వ్యాపారాలు,ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
మకరం: నూతన ఉద్యోగాలలో చేరతారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి. సంఘంలో ఆదరణ. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు.
కుంభం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటా బయటా చికాకులు. అనారోగ్యం. పనుల్లో ప్రతిబంధకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
మీనం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ సభ్యులతో విభేదాలు. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యం.
- సింహంభట్ల సుబ్బారావు