అలాంటి శక్తిమంతులెక్కడ? | opinion on Economic reforms in india by shekhar gupta | Sakshi
Sakshi News home page

అలాంటి శక్తిమంతులెక్కడ?

Published Sat, Dec 24 2016 1:12 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM

అలాంటి శక్తిమంతులెక్కడ?

అలాంటి శక్తిమంతులెక్కడ?

జాతిహితం
ఆర్థిక సంస్కరణలు ఆరంభమైన తరువాత ఈ పాతిక సంవత్సరాల కాలంలో టెలికాం, బీమా, పెట్రోలియం, పర్యావరణం వంటి అంశాలకు సంబంధించి చాలా బలమైన వ్యవస్థలు ఆవిర్భవించడం మనం చూస్తున్నాం. ఈ సంస్థలన్నీ ప్రధానంగా క్రమబద్ధీకరణకు సంబంధించినవే. ఇవి సమర్థంగా పనిచేస్తున్నట్టు చెప్పగలిగినప్పటికీ, జస్టిస్‌ వర్మ చెప్పిన ఒకే శక్తిమంతుడైన వ్యక్తి చేయూత కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నాయి. ఇటీవలకాలంలో చూస్తే యూకే సిన్హా ఆధిపత్యంలో ఉన్న సెబీ మాత్రమే కాస్త ధైర్యసాహసాలతో పనిచేయడం కనిపిస్తుంది.

‘జాతి ప్రయోజనం’ శీర్షికలో ఈ వారం రాస్తున్న వ్యాసాన్ని గ్రంథచౌర్య అన్వేషకులు పరిశోధిస్తే వారి కళ్లు విప్పారతాయి. కానీ వారి ఆనందం క్షణి కమే. కొంత పోలిక ఉన్నా గ్రంథచౌర్యం కాదని మీరే సమాధానపడతారు. ఆరేళ్లక్రితం రాసిన ఆ వ్యాసానికి ప్రేరణ–జస్టిస్‌ జేఎస్‌ వర్మ ప్రసంగంలోని ఒక వాక్యం. ‘కోబ్రా డ్యాన్సర్‌’ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘంలో అరవీరభయంకర సభ్యుడు కేజే రావు తన జ్ఞాపకాలను అక్షరబద్ధం చేసిన పుస్తకమది. కేజే రావు పదవీ విరమణ చేసిన తరువాత కూడా రూ. 12,000 వేతనానికి తిరిగి ఎన్నికల సంఘం సలహాదా రుగా పనిచేశారు. బిహార్‌ వంటి రాష్ట్రంలో పారదర్శకమైన ఎన్నికలను నిర్వ హించినవారాయన. ఆ ఎన్నికలలోనే లాలూ ప్రసాద్‌ కుటుంబ పాలన అంత మైంది. ఆ పుస్తకం మీద చర్చ కోసం ఏర్పాటు చేసిన బృందంలో జస్టిస్‌ వర్మ, అప్పటి చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ ఎస్‌వై ఖురేషీలతో పాటు నేను కూడా సభ్యుడిని.

ఆ సందర్భంలోనే జస్టిస్‌ వర్మను నేనొక ప్రశ్న అడిగాను:  ఒక వ్యవస్థకు సరికొత్త రూపు ఇవ్వడం ఒకే ఒక వ్యక్తికి సాధ్యమయ్యేదేనా? దీర్ఘకాలంలో లేదా అనతికాలంలో ఒక్క వ్యక్తి ఆ పని చేయగలరా? అందుకు జస్టిస్‌ వర్మ చెప్పిన సమాధానం: చాలా కష్టం, అలాగే పూర్తిగా సాధ్యమే కూడా. ఆ వ్యక్తికి రెండు అర్హతలు ఉంటే, మన మన రాజ్యాంగ సృష్టికర్తలు ఆశించిన స్థాయికి వ్యవస్థల రూపురేఖలను మార్చవచ్చు. ఆ వ్యక్తి గతంలో పెద్ద ప్రముఖుడై ఉండకూడదు. అలాగే భవిష్యత్తు మీద ఆశలు లేనివాడై ఉండాలి. అయితే మన వ్యవస్థ మొత్తం కాగడా వేసి వెతికినా అలాంటి అర్హతలు కలిగిన వ్యక్తిని కనిపెట్టడం సాధ్యం కాదు. నిజానికి జస్టిస్‌ వర్మ ముందుకు తెచ్చిన ఆ సిద్ధాంతానికి ఆయనే ఒక ప్రతిరూపం. పురాతన చరిత్ర కలిగిన భారత అత్యున్నత న్యాయస్థానం రూపునే కాదు, అప్పుడే ఆకృతి దాలుస్తున్న జాతీయ మానవ హక్కుల సంస్థ రూపును మార్చిన వ్యక్తి ఆయన. మూడు దశాబ్దాల క్రితం ఇదేవిధంగా భారత పౌరులమైన మనందరి హక్కులను సుప్రీంకోర్టు సాధ్యమైనంత మేర రక్షిస్తుందని ఇందిర నియం తృత్వ పోకడలు రాజ్యమేలుతున్న సమయంలోనే, అత్యున్నత న్యాయస్థానా నికే చెందిన మరో న్యాయమూర్తి దృఢంగా చెప్పారు. ఆయనే హెచ్‌.ఆర్‌. ఖన్నా.

మనం ఇంకొందరి గురించి కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవచ్చు: టీఎన్‌ శేషన్‌నే తీసుకోండి. రెండు దశాబ్దాల రాజకీయ విన్యాసాల బారి నుంచి కాపాడి, ఎన్నికల కమిషన్‌ను కాగితం పులి స్థాయి నుంచి   నిజమైన పులి స్థాయికి పెంచారు. ఎన్నికల కమిషన్‌ ముగ్గురు సభ్యుల సంస్థగా మారింది. అయితే వారు తరువాత ఆయన పక్షమైపోయారు. బలీయ వ్యవస్థగా ఆవిర్భవించిన తరువాత కూడా దానిని విచ్ఛిన్నం చేయడానికి జరిగిన యత్నం అలా విఫలమైంది.

ఇలాంటి వ్యక్తి సీబీఐ లేదా చీఫ్‌ విజిలెన్స్‌ కమిషన్‌లో తయారైతే ఎలా ఉంటుందని మనం తరువాత ఆలోచించాం. అవినీతి వ్యతిరేక ఉద్యమం విస్తృతంగా నిర్మితమైన 2010 సంవత్సరం మధ్యభాగాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. అప్పుడు జరిగిన చాలా కుంభకోణాలు ప్రజలను ఆగ్రహా వేశాలకు గురి చేశాయి. ఏదో ఒకటి చేయాలన్న తపన కనిపించింది. అదే సమయంలో ఉత్తర కొరియా బాటలో జన్‌లోక్‌పాల్‌ బిల్లు వంటి ఇబ్బందికర ఆలోచనలు కూడా వచ్చాయి. సరే, దాచడానికి వీల్లేని గతమేదీ లేని, భవి ష్యత్తులో దేని కోసమూ ఆశ పడని ఓ పోలీసు అధికారి, లేదా చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ తన శక్తి మేరకు ఈ వ్యవస్థల రూపురేఖలు మారిస్తే ఏమవుతుంది? మరీ రాక్షసంగా మీ ఇంటి పక్కనే గూఢచారి అవసరం, అవినీతి నిరోధక చట్టం, వేయి కొత్త కారాగారాల నిర్మాణం మాత్రం అవసరం ఉండవని చెప్ప వచ్చు. వాటి దుర్వినియోగమైనా చాలావరకు తగ్గుతుంది.

అయితే ఇందులో ఏవీ కార్యరూపం దాల్చవు. నిజానికి సీబీఐకి కొత్త డైరెక్టర్‌ వచ్చిన ప్రతిసారి నైతికంగా, నైపుణ్య పరంగా ఆ సంస్థ తిరోగమనంలోకే దిగజారడం కనిపి స్తుంది. ఈ అవినీతి వ్యతిరేక పోరాట సంస్థకు అధిపతులుగా నియమించడా నికి యోగ్యులు అనదగ్గ రెండు పేర్లు ఎవరైనా ప్రస్తావించగలరా అని నేను సవాలు చేస్తున్నాను. ప్రస్తుతం ఆ సంస్థ అధిపతిగా ఉన్న వ్యక్తి పేరును కాంగ్రెస్‌ మినహా ఎవరం ప్రస్తావించబోమని కూడా పందెం కాసి మరీ చెబు తాను. అయితే దీని ఉద్దేశం ఎవరినీ వ్యక్తిగత హోదాలో అవమానించడం కాదు. మన సంస్థల పరిస్థితి అదే. జస్టిస్‌ వర్మ తరువాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కీర్తిప్రతిష్టలను ఆర్జించినవారు జస్టిస్‌ ఆర్‌ఎం లో«థా. పదవీ విరమణ తరువాత  బీసీసీఐని సంస్కరించడానికి ఆయన నేతృత్వంలో నియ మించిన చేవగల ఆ కమిటీ చేసిన సేవలకు జాతి రుణపడి ఉంటుంది.

ఆర్థిక సంస్కరణలు ఆరంభమైన తరువాత ఈ పాతిక సంవత్సరాల కాలంలో టెలికాం, బీమా, పెట్రోలియం, పర్యావరణం వంటి అంశాలకు సంబంధించి చాలా బలమైన వ్యవస్థలు ఆవిర్భవించడం మనం చూస్తున్నాం. ఇవన్నీ ప్రధానంగా క్రమబద్ధీకరణకు సంబంధించినవే. ఇవన్నీ సమర్థంగా పనిచేస్తున్నట్టు చెప్పగలిగినప్పటికీ, జస్టిస్‌ వర్మ చెప్పిన ఒకే శక్తిమంతుడైన వ్యక్తి చేయూత కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నాయి. ఇటీవలకాలంలో చూస్తే యూకే సిన్హా ఆధిపత్యంలో ఉన్న సెబీ మాత్రమే కాస్త ధైర్య సాహసా లతో పనిచేయడం కనిపిస్తుంది. అయితే సహారా వ్యవహారాలను వెలికి తీసి, ఆ సంస్థ అధిపతిని జైలుకు పంపిన ఆ సిన్హా పదవీకాలం త్వరలోనే పూర్తి కాబోతున్నది. అంతటి ధైర్యసాహసాలు ప్రదర్శించడం చిన్న విషయం కాదు. సహారా అధిపతి ఎంత పలుకుబడి కలిగినవారో ఆయన రాసిన పుస్తకం ఆవిష్కరణోత్సవం తిహార్‌ జైలులో జరిగినప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌ (గులాం నబీ) నేతలు అక్కడకు రావడం ద్వారా వెల్లడవుతోంది కూడా. ప్రధానికి ముడుపులు ముట్టాయని ఆదాయపన్ను శాఖ దాడుల సంద ర్భంగా దొరికిన  డైరీల ఆధారంగా రాహుల్‌గాంధీ ఆరోపణలు చేస్తూ మాట్లా డిన రోజునే తిహార్‌ జైలులో ఆ పుస్తకాన్ని  ఆవిష్కరించారు.

మన ఆర్థిక వ్యవస్థలలో ఎంతో ప్రతిష్ట కలిగిన, కీలకమైన, పురాతన సంస్థ రిజర్వు బ్యాంక్‌. ముంబైలో ఉన్న ఆ సంస్థ కార్యాలయంలో సంస్థ అధిపతి గదికి ముందు ఉండే గదిలో చాలా ఫొటోలు కనిపిస్తాయి. అవన్నీ ఆ సంస్థకు పూర్వం ఆధిపత్యం వహించినవారివి. అవి భారత ఆర్థిక చరిత్ర మీద విహంగ వీక్షణం చేయిస్తాయి. అయితే న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘాల మాదిరిగా, లేదా చీఫ్‌ విజిలెన్స్‌ కమిషన్, ఆఖరికి కమ్‌ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ వ్యవస్థ వలె రిజర్వు బ్యాంక్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడానికి ఎలాంటి చట్టం చేయలేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖకీ, దాని ద్వారా పార్ల మెంటుకు రిజర్వు బ్యాంక్‌ జవాబుదారు. వైవీ రెడ్డి ఆయన వారసుడు డీవీ సుబ్బారావులు గవర్నర్‌లుగా ఉన్న కాలంలో రిజర్వుబ్యాంక్‌ కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నది. యూపీఏ హయాంలో పి. చిదంబరం, ప్రణబ్‌ ముఖర్జీ ఆర్థికమంత్రులుగా ఉన్నప్పుడు ఆ ఇద్దరు గవర్నర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే రఘురామ్‌రాజన్‌ పదవీకాలాన్ని పొడిగించకుండా ఆ ఇబ్బందుల నుంచి తప్పించారు. తరువాత ఉర్జిత్‌ పటేల్‌ గవర్నర్‌ అయ్యారు. ఆయన పదవిలోకి వచ్చి మూడు మాసాలు గడిచింది. అయితే ఆయన హయాంలోనే రిజర్వు బ్యాంక్‌ అసాధారణ నిర్ణయం తీసుకుంది.

ఇంతకీ పెద్ద నోట్ల విషయంలో రిజర్వు బ్యాంక్‌ నిర్వహించిన వాస్తవ పాత్ర ఏమిటన్నది చర్చనీయాంశం. ఢిల్లీలోని నార్త్‌ బ్లాక్‌ (కేంద్ర ఆర్థికమంత్రి కార్యాలయం) దగ్గర, లేదా ముంబైలోని టంకసాల వీధిలో వినిపించే గుస గుసలను బట్టి నోట్ల రద్దు గురించిన సత్యం లేదా కల్పన మీ దృష్టికి వస్తుంది. రిజర్వు బ్యాంక్‌ బోర్డు సిఫార్సు ప్రాతిపదికగానే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారన్న మాట అందులో ఒకటి. నల్లధన కుబేరులకు అవకాశం కల్పిం చకుండా ఉండేందుకు ఆ మాత్రం గోప్యత అవసరమే. ఆరు వారాలు గడిచి పోయాయి. ఆ గోప్యత ఇక అవసరం లేదు. అయినా నోట్ల రద్దుకు సంబం ధించిన సమావేశం, ఇతర చర్చనీయాంశాలను రిజర్వు బ్యాంక్‌ ఎందుకు వెల్లడించదు? నిజానికి వీటిని ఆర్టీఐ ద్వారా పొందవచ్చు. కానీ ప్రశ్న ఏమి టంటే రిజర్వు బ్యాంక్‌ తనకు తానుగా ఎందుకు పారదర్శకంగా ఉండదు?

రిజర్వు బ్యాంక్‌ వెబ్‌సైట్‌ చూడండి: ‘బ్యాంకుల ద్వారా విడుదలయ్యే నోట్లను క్రమబద్ధీకరించడం, భారత్‌లో ద్రవ్య స్థిరత్వం కోసం నిల్వల నిర్వహణ’ తన విధిగా ప్రకటించుకోవడం కనిపిస్తుంది. అంటే కరెన్సీ ప్రధాన బాధ్యత ఆ బ్యాంక్‌దే. కాబట్టి నోట్ల రద్దుతో తలెత్తిన పరిస్థితులు, ఇతర బాధ్యతల నుంచి అది తప్పించుకోలేదు. నవంబర్‌ 8 తరువాత ఆ సంస్థ పాటిస్తున్న మౌనం, గోప్యత (తాజాగా రూ. 5,000 నగదు మదుపుపై ఆంక్షలు) వరకు ఏవీ రిజర్వు బ్యాంక్‌ ప్రతిష్టను, దాని గవర్నర్‌ పరపతిని పెంచేవి కావు. మదుపు వివరాలను వెల్లడిస్తూ ఇచ్చే వారాంతపు నివేదికను నిలిపివేయడం గానీ, ఎలాంటి వివరణ ఇవ్వకుండా డిసెంబర్‌ 10 వరకు మొత్తం డిపాజిట్‌ల వివరాలను వెబ్ సైట్‌ను తొలగించడం ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్ట ఉన్న సంస్థకు న్యాయం కాదు. ఉర్జిత్‌ అంటే గతంలో ఎవరికీ తెలీదు. ఆయన భవిష్యత్‌ గురించి పెద్దగా ఆశలు పెట్టుకోకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ ఔన్నత్యాన్ని కాపాడ్డానికి నడుం కట్టవచ్చు.


(వ్యాసకర్త : శేఖర్‌ గుప్తా twitter@shekargupta)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement