తెలుగు ప్రాచీన హోదాకు వీడిన గ్రహణం
అభిప్రాయం
తెలుగు భాష ఘనతకు పట్టిన వ్యాజ్యపు చెర వీడింది. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎన్. కౌల్, మరొక న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం, తమిళ భాషా ప్రేమికుడు, న్యాయ వాది ఆర్.గాంధీ వేసిన పిటిషన్‌ను ఆగస్ట్ 8న కొట్టివేస్తూ, కన్నడ, తెలుగు, మలయాళం, ఒడియా భాషలు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తేదీల నుంచి, ప్రాచీన భాషలుగా గుర్తింపు పొందాయని స్పష్టం చేసింది. 2008 నుంచీ ఈ కేసు ద్వారా తమిళ సోదరులు, దక్షిణాదిన మరే ఇతర భాషకూ ప్రాచీన లేదా విశిష్ట హోదా వల్ల వచ్చే ఆర్థిక ప్రయోజనాలు, దీర్ఘకాలిక లబ్ధి ఒనగూరకుండా చేశారు. దాదాపు 2014 వరకూ ఈ కేసు పెద్దగా కదలిక లేకుండా ఉన్నది. అప్పుడు చెన్నై తెలుగు వారు వృత్తి రీత్యా ఉపా ధ్యాయుడు అరుున తూమాటి సంజీవరావు ఈ కేసులో తన స్వయం ఆసక్తిపై ఇంప్లీడ్ అరుు, కేసులో కొత్త కద లిక తెచ్చారు. అప్పట్నుంచీ కేసు చురుగ్గా కదిలి
ఈ రెండేళ్లలో తీర్పు దాకా వచ్చింది. ఇందుకు సంజీవ రావు గారికి అభినందనలు తెలపాలి (98844 46208).
ఈ ప్రాచీన హోదా వెలువడ్డప్పుడు, కోర్టులో వ్యాజ్యం ఫైల్ అరుునప్పుడు కూడా ఒకే రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా ఉంది. ప్రాచీన భాష హోదా పేరిట రూ.100 కోట్లను భారత ప్రభుత్వం ఆయా భాషల అభివృద్ధి పనులకు, నడిచే కేంద్రాల నిర్వహణ ఖర్చులకు ఇస్తున్నది. ప్రాచీన భాష అభివృద్ధి పేరిట జరగవలసిన పనులలో ఇంకా మనం మొదట్లోనే ఉన్నాం. రెండు తెలుగు భాషా రాష్ట్రాలలోనూ అభి వృద్ధి, పరిశోధనా కేంద్రాల ఏర్పాటు, తగు సిబ్బంది, సాంకేతిక సౌకర్యాలు ఇవన్నీ రూపుదిద్దుకుని, మన సన్నాహాలను సమర్థవంతంగా కేంద్ర ప్రభుత్వానికి వివరించ గలిగితే, ఆయా నిధులు సమకూరుతారుు.
మనం మన తెలుగు రాష్ట్రాలకు తెచ్చుకోవలసిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్లాసికల్ తెలుగు ప్రస్తుతం మైసూరులో ఉంది. తమిళులు ఎలా తమ భాషా విభా గాన్ని తమిళనాడుకు తీసుకెళ్ళారో అలా ఈ విభాగపు సాంకేతిక బదిలీ, మిగిలి ఉన్న వనరులు రాత ప్రతులైతే వాటి సగం మూల ప్రతులు, సగం నకళ్లు రెండు రాష్ట్రాల మధ్య విభాగాలు జరిగి, సెంట్రల్ ఇన్‌స్టి ట్యూట్ ఫర్ క్లాసికల్ తెలుగు ఏర్పాటుకు తాము సిద్ధం అన్న సంగతి భారత ప్రభుత్వానికి తెలుపడాన్ని బట్టి నిధుల విడుదల జరిగే అవకాశం ఉంటుంది.
మద్రాస్ హైకోర్ట్, ఆ ప్రాచీన హోదా ప్రకటనను సమానంగా అనువర్తింప చేసినం దున, ఎవరి రాష్ట్రంలో వారు ఈ సంస్థ పనితీరుకు వలసిన భవనాలు, ఇతర సదుపాయాలు, ఏర్పాటు అయ్యేందుకు ఫాస్ట్ ట్రాక్ కమిటీలు నియమించి, అందులో రచరుుతలు, భాషా రంగ నిపుణులు, విద్యా వేత్తలు, మొదలగువారిని సభ్యులుగా స్వీకరించి, వచ్చే హేవిళంబి ఉగాది కల్లా ఈ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్లాసికల్ తెలుగు సంస్థను రెండు తెలుగు రాష్ట్రాలలో పని ప్రారంభించేలా చేయ గలరని ఆశిద్దాం. విడిపోవడానికి ముందు నుంచి కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఉమ్మడి రాష్ట్రం లోనే మొదటగా ఏర్పడిన శాఖ, కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిశగా దృష్టి సారించి, వేగంగా పనులు పూర్తి చేయవచ్చు.
వ్యాసకర్త: రామతీర్థ. కవి, విమర్శకులు.
మొబైల్ : 98492 00385