ఆ పాత్రికేయం.. ఆదర్శనీయం
దేశాధ్యక్షుడి శత్రువైఖరి అమెరికా మీడియాను ఒక్కటిగా చేసింది. జర్నలిస్టులు ఎవరు, వారి లక్ష్యం ఏమిటి అనే మౌలిక అంశాలపట్ల పునరాలోచించుకునే అవకాశం ఇచ్చినందుకు డొనాల్డ్ ట్రంప్‌కి ఆ దేశ మీడియా కృతజ్ఞతలు చెప్పింది.
అమెరికా నూతన అధ్యక్షుడికి, ఆ దేశ మీడియాకు మధ్య సంబంధాలు ఇప్పుడు అత్యంత హీనస్థాయికి దిగజారి పోయాయి. మీడియాను దెప్పడం, మీడియా కంటే సైనిక బలగాలు ఎంతో ఉత్తమమైనవని పొగడటం. బహిరంగ వేదికలపై మీడియాను అవహేళన చేస్తూ మాట్లాడటం. వీటన్నింటిని చూస్తే ఎన్నికల ప్రచార దశలో ప్రవేశపెట్టిన విభజన, ద్వేషపూరిత విధానాలనుంచి ట్రంప్ ఏమాత్రం తప్పుకోలేదని స్పష్టమౌతోంది. మరోవైపున అమెరికా మీడియా మాత్రం అధ్యక్షుడి హూంకారాలకు లొంగేది లేదని స్పష్టం చేస్తూ ఐక్య మంత్రం పఠించింది. మీడియా నోరు నొక్కాలని ఎంతగా ప్రయత్నించినా, ట్రంప్ ఈ యుద్ధంలో విజయం పొందలేరని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడి వార్తలను కవర్ చేయడానికి వైట్ హౌస్‌లో ఉండే ప్రెస్ బృందాన్ని అక్కడి నుంచి సాగ నంపటంపై ట్రంప్ తీవ్రంగా యోచిస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో మీడియా దేశాధ్యక్షుడికి నేరుగా ఉత్తరం రాసింది. అధ్యక్షుడికి సంబంధించిన సమాచా రాన్ని ఇవ్వడానికి తిరస్కరించడం ద్వారా ట్రంప్ గెలు పొందలేరని, ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యూరోక్రాట్లతో సహా ప్రభుత్వ విభాగాలన్నింట్లో విలేకరులను చొప్పించి సమా చారం రాబడతామని తేల్చి చెప్పింది. అధ్యక్షుడి విధానాల అమలు తీరుతెన్నులను కవర్ చేయడంలో అంతిమంగా తమదే పై చేయి అవుతుందని మీడియా స్పష్టం చేసింది.
అమెరికన్ మీడియాతో పోలిస్తే భారతీయ మీడియా తన బంధనాల నుంచి విముక్తి కావడానికి సిద్ధపడకపో వడం విషాదకరం. మన మీడియా ప్రభుత్వాన్ని ప్రశంసిం చడం, మద్దతివ్వడం ద్వారా తన వాణిని ఇంకా గట్టిగా నొక్కేసుకుంటోంది. ప్రభుత్వ విధానాల సారాన్ని పరిశీ లించి ప్రశ్నించడానికి, భారత్‌లోని పేదల్లోకెల్లా నిరుపేద లపై ఆ విధానాలు కలిగిస్తున్న ప్రభావాల గురించి రిపోర్ట్ చేయడానికి కనీస ప్రయత్నం చేయకుండా, ప్రభుత్వ పాల సీయే అంతిమ సత్యంలాగా ప్రచారం చేస్తూ దేశ మీడియా తనకు తానుగా అధికార వ్యవస్థలో భాగమైపోతోంది. పాలసీలకు వ్యతిరేకంగా ఎవరైనా కాస్త గీత దాటితే చాలు వారిని పక్షపాతులని ఆరోపిస్తూ విలేకరులపై మరుగు జ్జులు దాడి చేస్తున్న సమయంలోనూ మన మీడియా మౌనముద్ర దాల్చడం సరైందేనా? అమెరికా మీడియా నుంచి మనం గ్రహించవలసిన పాఠాలు ఏమిటి?
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడా నికి ముందు వైట్‌హౌస్ ప్రెస్‌కోర్ ట్రంప్‌కి రాసిన ఉత్తరం.
డియర్ మిస్టర్ ప్రెసిడెంట్ ఎలెక్ట్..
గత కొన్ని రోజులుగా మీ ప్రెస్ కార్యదర్శి శ్వేతసౌధం నుంచి వార్తా మీడియా బృందాలను ఎలా సాగనంపాలా అని ఆలోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఎన్నికల ప్రచారం సమయంలో మీ విశేషాలను కవర్ చేయడంపై మీరు ఆద్యంతం నిషేధించిన వైఖరికి ఇది తాజా ఉదాహరణ మాత్రమే. బహుశా మీకు అధ్యక్షుడిగా నిర్ణయాలు తీసు కునే హక్కు ఉండవచ్చు. అయితే.. ప్రెస్‌తో ఎలా వ్యవహ రించాలనే అంశంపై విధివిధానాలను నిర్ణయించుకోవడా నికి మీకు పూర్తి హక్కు ఉన్నట్లే మాకు కూడా కొన్ని హక్కు లున్నాయి. మా ప్రసారాలను, వార్తాకాలమ్‌లను ప్రభా వితం చేయాలని మీరు భావిస్తుండవచ్చు. కానీ మా పాఠ కులకు, శ్రోతలకు, వీక్షకులకు ఎంత ఉత్తమంగా సేవలం దించాలో మేం నిర్ణయించుకుంటాం. ఆ పని మీది కాదు.
మీ పాలనను పరిశీలించే అవకాశం విలేకరులకు ఇవ్వాలా లేదా అనేది మీరు నిర్ణయించుకోవచ్చు. కానీ సమాచారాన్ని ప్రత్యామ్నాయ మార్గాల్లో పొందడంలో మాకు విశేష అనుభవం ఉందని మీరు గుర్తించాలి.
ఆఫ్‌ది రికార్డుగా చెబుతున్నాం. వార్తల విషయంలో ప్రా«థమిక సూత్రాలను నిర్దేశించాల్సింది మేమే తప్ప అది మీ బాధ్యత కాదు. అది మా ఎంపిక మాత్రమే. మీ నిబం ధనలకు అంగీకరించని విలేకరులను సాగనంపుతానని మీరు భావిస్తుంటే మాత్రం, అది జరగని పని.
మమ్మల్ని మీరు బయటకు పంపినప్పటికీ మీ అభిప్రాయాలను సేకరించడానికి మేం ప్రయత్నిస్తూనే ఉంటాము. కానీ సత్యాన్ని పదే పదే వక్రీకరిస్తున్న, లొంగ దీసుకుంటున్న వ్యక్తులకు మా ప్రసారాలను, వార్తా కాల మ్‌లను కట్టబెడతామని దీనర్థంకాదు.
రాజకీయ రంగంలో మీడియా పట్ల అవిశ్వాసాన్ని తీవ్రస్థాయిలో ప్రచారం చేసిన ఘనత మీదేనని గుర్తి స్తున్నాం. కానీ దాన్ని మేమొక ముందస్తు హెచ్చరికగా తీసుకుంటాం. మా పట్ల విశ్వాసాన్ని తిరిగి పొందుతాం. మా తప్పుల్ని గుర్తించడం ద్వారా, మాకు మేము నిర్దేశిం చుకున్న నైతిక ప్రమాణాలకు కట్టుబడటం ద్వారా కచ్చిత మైన రిపోర్టింగ్ ద్వారా మేం ముందుకు వస్తాం.
మీరు మమ్మల్ని ఇన్నాళ్లుగా విభజించడానికి ప్రయ త్నించారు. ఆ రోజులు గతించాయి. మీ వార్తలను కవర్ చేయడంలో ఉన్న సవాలును ఎదుర్కొనడానికి వీలైన చోటల్లా మేం పరస్పరం సహకరించుకుంటాం. ఇకపై మీరు ఇష్టపడని అంశాలను ప్రస్తావించిన రిపోర్టర్‌ని నోరు మూయించడానికి ప్రయత్నిస్తే మీరొక ఐక్య సంఘటననే ఎదుర్కొనాల్సి వస్తుంది. వార్తల్లో నీతి లేదా న్యాయమైన వ్యాఖ్యల గురించి మాలో మాకు విభేదాలు ఉండవచ్చు. చర్చలు జరగవచ్చు కాని ఆ చర్చలను ప్రారంభించా ల్సిందీ, ముగించాల్సిందీ కూడా మేమేనని మర్చిపోవద్దు.
చివరిగా.. మేం దీర్ఘకాలం నుంచి ఈ క్రీడను ఆడు తున్నాం. మీరు మీ పనిలో మరో 8 ఏళ్లు కొనసాగవచ్చు. కాని మేం మాత్రం అమెరికన్ రిపబ్లిక్ స్థాపన నాటి నుంచి ఇక్కడే ఉన్నాం. ఈ మహత్తర ప్రజాస్వామ్యంలో మా పాత్రను పదేపదే స్థిరపర్చుకున్నాం. మేం ఎవరం, ఎందుకు ఇక్కడ ఉన్నాం అనే మౌలిక ప్రశ్నల గురించి ఆలోచించుకునేలా మీరు మమ్మల్ని ఒత్తిడికి గురిచేశారు. అందుకు మీకు మేం కృతజ్ఞులమై ఉంటాం.
వైట్ హౌస్ ప్రెస్ కోర్