US Media
-
వార్నీ..! కుక్కకు ఇంత పెద్ద నాలుకా..! గిన్నిస్ రికార్డ్
ఎక్కడైన కుక్కల నాలుక ఎంత ఉంటుంది? సుమారు 5 సెంటీమీటర్లు ఉంటుంది. కానీ అమెరికాలోని లూసియానాలో ఓ కుక్కకు నాలుక ఏకంగా 12.7 సెంటీమీటర్లు ఉంది. తాజాగా ఈ కుక్క గిన్నిస్ రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు ఉన్న 9.49 సెంటీమీటర్లతో బెస్బీ అనే కుక్క పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించింది. ఆ కుక్క పేరు 'జోయ్'. దాని యజమాని సాడీ, విలియమ్స్. వారికి ఈ కుక్క ఆరు వారాల వయస్సులో ఉన్నప్పుడు దొరికింది. సాధారణంగానే జోయ్ నాలుక ఎలాస్టిక్ మాదిరిగా నోటి బయటికి సాగి ఉండేది. పెరిగే కొద్దీ అందరూ ఆ కుక్కపైనే కామెంట్ చేసేవారని యజమానులు తెలుపుతున్నారు. జోయ్‌కి బయట తిరగడం, బాల్స్‌తో ఆడుకోవడం, పక్క కుక్కలతో గొడవపడడం, కారు వెంట పరుగెత్తడం, ఈత కొట్టడం అంటే ఇష్టమని చెబుతున్నారు. తమ చుట్టుపక్కల జోయ్ అంటే తెలియనివారుండరని పేర్కొన్నారు. Zoey loves to fetch and swim. Coincidentally, she has the world’s longest tongue on a dog!https://t.co/2jvoSbvga9 — Guinness World Records (@GWR) June 2, 2023 'మేము వాకింగ్‌కు జోయ్‌ను తీసుకువెళితే అందరూ మా దగ్గరికే వస్తారు. దానిని తాము పెంచుకుంటాం ఇవ్వమని అడుగుతారు. దీనిపై మేము చాలా సార్లు హెచ్చరించాం. జోయ్‌కి కోపమొస్తే కరిచిన సందర్భాలు కూడా ఉన్నాం.' అని యజమాని చెప్పారు. తన ప్యాంటుకు ఉన్న జోయ్ పంటి గాట్లను చూపిస్తూ విలియమ్స్ చిరునవ్వుతో చెప్పాడు. ఇదీ చదవండి:రెస్టారెంట్లో మహిళకు చేదు అనుభవం.. ‘అలా చేయడం తప్పా’? -
‘అమెరికా మీడియా సైతం ఆర్ఆర్ఆర్ను ప్రశంసిస్తుందనుకోలేదు’
‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈమూవీపై సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెరికా మీడియా సైతం ఆర్ఆర్ఆర్ను కొనియాడింది. న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రం, మూవీ టీంను ప్రశంసిస్తూ ఆర్టికల్‌ను ప్రచురించింది. తాజాగా దీనిపై రాజమౌళి స్పందించారు. రీసెంట్గా జరిగిన ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ ఈవెంట్లో రాజమౌళి మాట్లాడుతూ అమెరికా మీడియా సైతం ఆర్ఆర్ఆర్ మూవీని ప్రశంసించడంతో హర్షం వ్యక్తం చేశారు. చదవండి: శ్రీహాన్‌పై సిరి ఆసక్తికర వ్యాఖ్యలు, చివరికి ఇలా క్లారిటీ ఇచ్చిందా? ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘అమెరికా లాంటి అగ్ర దేశం కూడా ఈ సినిమాను ప్రశంసిస్తుందని ఊహించలేదు. న్యూయార్క్ టైమ్స్ వంటి అతిపెద్ద మీడియా ఆర్ఆర్ఆర్ గురించి స్పెషల్ అర్టికల్ రాసింది. ఇది చూసి నా మనసు భావోద్వేగంతో నిండిపోయింది. ఇది నిజంగా హార్ట్ టచింగ్ విషయం’ అన్నారు. అంతేగాక అమెరికాలోని ప్రేక్షకులు కూడా ఆర్ఆర్ఆర్ను ఆదరిస్తున్నారన్నారు. ‘‘బాహుబలి’కి జపాన్ నుంచి ప్రశంసలు వచ్చాయని, ‘ఆర్ఆర్ఆర్’కు ఆమెరికా నుంచి వచ్చాయి. ఏ సినిమాకైనా బాక్సాఫీస్ నంబర్లు చాలా ముఖ్యమైనవే అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రశంసలు కూడా చాలా ముఖ్యం’’ అంటూ రాజమౌళి పేర్కొన్నారు. -
డెల్టాప్లస్.. ఆటలమ్మ కంటే వేగం
న్యూయార్క్: చికెన్‌పాక్స్(ఆటలమ్మ) ఎంత వేగంగా వ్యాపించగలదో, కరోనా డెల్టా వేరియంట్ అంతే వేగంగా వ్యాపించగలదని, మిగిలిన వేరియంట్ల కన్నా ఎక్కువ అనారోగ్యం కలిగించగలదని యూఎస్ సీడీసీ(సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) హెచ్చరించినట్లు అమెరికా మీడియా వర్గాలు తెలిపాయి. వ్యాక్సిన్ తీసుకోనివారిలో వ్యాపించినంత వేగంగానే, టీకా తీసుకున్నవారికి కూడా అంతేవేగంగా డెల్టా సోకవచ్చని సీడీసీ తెలిపింది. టీకా తీసుకోని వారి ముక్కు, గొంతులో ఎంత వైరల్ లోడు ఉంటుందో, టీకా తీసుకున్న వారిలో నూ అంతే లోడుంటుందని సీడీసీ డైరెక్టర్ రొచెల్ వాలెన్‌స్కై చెప్పారు. అలాగే ఆల్ఫా వేరియంట్ బాధితుల్లో ఉండే వైరల్ లోడు కన్నా 10 రెట్లు అధిక లోడు డెల్టా వేరియంట్ సోకినవారిలో గమనించినట్లు సీడీసీ తెలిపింది. మెర్స్, సార్స్, ఎబోలా, జలుబు, స్మాల్‌పాక్స్, చికెన్‌పాక్స్ వైరస్ల కన్నా డెల్టా వేరియంట్ వేగంగా సోకుతుందని తెలిపింది. అమెరికాలో టీకా తీసుకున్న వారిలో సైతం డెల్టా సోకినట్లు్ల సీడీసీ పేర్కొంది. వివిధ రాష్ట్రాల గణాంకాలను విశ్లేషించి సీడీసీ ఈ పత్రాన్ని రూపొందించింది. ప్రతి చోటా ప్రతి ఒక్కరూ మరలా మాస్కులు ధరించడం మంచిదని రొచెల్ సూచించారు. ప్రభుత్వం, ప్రజలు తీవ్రమైన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. టీకా తీసుకున్నవారు సైతం డెల్టా వ్యాప్తికి కారకులు కావడం ఆందోళనకరమైన విషయమని మరో సైంటిస్టు వాల్టర్ ఓరెన్స్టైన్ చెప్పారు. అయితే డెల్టా సోకినా సరే టీకా తీసుకున్నవారు సురక్షితంగా ఉన్నట్లేనన్నారు. టీకా వల్ల వ్యాధి తీవ్రత 90 శాతం వరకు తగ్గుతుందని, అందువల్ల వీరు తీవ్ర అనారోగ్యం పాలయ్యేందుకు, లేదా తీవ్ర వ్యాప్తికి కారణమయ్యేందుకు ఛాన్సులు తక్కువన్నారు. -
బైడెన్‌పై అంత ప్రేమెందుకు?: ట్రంప్
మిల్వాకీ(యూఎస్): అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ సాగించిన అవినీతి గురించి ప్రజలకు తెలియకుండా అమెరికన్ మీడియా, బడా టెక్నాలజీ కంపెనీలు ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. బైడెన్‌పై మీడియాకు అంత ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. మాస్కో మాజీ మేయర్‌కు అత్యంత సన్నిహితుడైన జో బైడెన్‌కు రష్యా నుంచి 3.5 మిలియన్ డాలర్లు అందినట్లు ట్రంప్ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను బైడెన్ ఖండించారు. బైడెన్ నుంచి ప్రయోజనాలు పొందిన మీడియా సంస్థలు, టెక్ కంపెనీలు మాత్రం ఆయనను కాపాడేందుకు ఆరాట పడుతున్నాయని విమర్శించారు. ఇలాంటి పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. పక్షపాత వైఖరి చివరకు మీడియాకే నష్టం కలిగిస్తుందని అన్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో తమ ప్రభుత్వ సూపర్ ఎకనామిక్ రికవరీకి, బైడెన్ డిప్రెషన్‌కు మధ్య పోటీ జరుగుతోందని, ప్రజలు దేన్ని ఎంచుకుంటారో నిర్ణయించుకోవాలని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. -
ఆ పాత్రికేయం.. ఆదర్శనీయం
దేశాధ్యక్షుడి శత్రువైఖరి అమెరికా మీడియాను ఒక్కటిగా చేసింది. జర్నలిస్టులు ఎవరు, వారి లక్ష్యం ఏమిటి అనే మౌలిక అంశాలపట్ల పునరాలోచించుకునే అవకాశం ఇచ్చినందుకు డొనాల్డ్ ట్రంప్‌కి ఆ దేశ మీడియా కృతజ్ఞతలు చెప్పింది. అమెరికా నూతన అధ్యక్షుడికి, ఆ దేశ మీడియాకు మధ్య సంబంధాలు ఇప్పుడు అత్యంత హీనస్థాయికి దిగజారి పోయాయి. మీడియాను దెప్పడం, మీడియా కంటే సైనిక బలగాలు ఎంతో ఉత్తమమైనవని పొగడటం. బహిరంగ వేదికలపై మీడియాను అవహేళన చేస్తూ మాట్లాడటం. వీటన్నింటిని చూస్తే ఎన్నికల ప్రచార దశలో ప్రవేశపెట్టిన విభజన, ద్వేషపూరిత విధానాలనుంచి ట్రంప్ ఏమాత్రం తప్పుకోలేదని స్పష్టమౌతోంది. మరోవైపున అమెరికా మీడియా మాత్రం అధ్యక్షుడి హూంకారాలకు లొంగేది లేదని స్పష్టం చేస్తూ ఐక్య మంత్రం పఠించింది. మీడియా నోరు నొక్కాలని ఎంతగా ప్రయత్నించినా, ట్రంప్ ఈ యుద్ధంలో విజయం పొందలేరని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడి వార్తలను కవర్ చేయడానికి వైట్ హౌస్‌లో ఉండే ప్రెస్ బృందాన్ని అక్కడి నుంచి సాగ నంపటంపై ట్రంప్ తీవ్రంగా యోచిస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో మీడియా దేశాధ్యక్షుడికి నేరుగా ఉత్తరం రాసింది. అధ్యక్షుడికి సంబంధించిన సమాచా రాన్ని ఇవ్వడానికి తిరస్కరించడం ద్వారా ట్రంప్ గెలు పొందలేరని, ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యూరోక్రాట్లతో సహా ప్రభుత్వ విభాగాలన్నింట్లో విలేకరులను చొప్పించి సమా చారం రాబడతామని తేల్చి చెప్పింది. అధ్యక్షుడి విధానాల అమలు తీరుతెన్నులను కవర్ చేయడంలో అంతిమంగా తమదే పై చేయి అవుతుందని మీడియా స్పష్టం చేసింది. అమెరికన్ మీడియాతో పోలిస్తే భారతీయ మీడియా తన బంధనాల నుంచి విముక్తి కావడానికి సిద్ధపడకపో వడం విషాదకరం. మన మీడియా ప్రభుత్వాన్ని ప్రశంసిం చడం, మద్దతివ్వడం ద్వారా తన వాణిని ఇంకా గట్టిగా నొక్కేసుకుంటోంది. ప్రభుత్వ విధానాల సారాన్ని పరిశీ లించి ప్రశ్నించడానికి, భారత్‌లోని పేదల్లోకెల్లా నిరుపేద లపై ఆ విధానాలు కలిగిస్తున్న ప్రభావాల గురించి రిపోర్ట్ చేయడానికి కనీస ప్రయత్నం చేయకుండా, ప్రభుత్వ పాల సీయే అంతిమ సత్యంలాగా ప్రచారం చేస్తూ దేశ మీడియా తనకు తానుగా అధికార వ్యవస్థలో భాగమైపోతోంది. పాలసీలకు వ్యతిరేకంగా ఎవరైనా కాస్త గీత దాటితే చాలు వారిని పక్షపాతులని ఆరోపిస్తూ విలేకరులపై మరుగు జ్జులు దాడి చేస్తున్న సమయంలోనూ మన మీడియా మౌనముద్ర దాల్చడం సరైందేనా? అమెరికా మీడియా నుంచి మనం గ్రహించవలసిన పాఠాలు ఏమిటి? అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడా నికి ముందు వైట్‌హౌస్ ప్రెస్‌కోర్ ట్రంప్‌కి రాసిన ఉత్తరం. డియర్ మిస్టర్ ప్రెసిడెంట్ ఎలెక్ట్.. గత కొన్ని రోజులుగా మీ ప్రెస్ కార్యదర్శి శ్వేతసౌధం నుంచి వార్తా మీడియా బృందాలను ఎలా సాగనంపాలా అని ఆలోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఎన్నికల ప్రచారం సమయంలో మీ విశేషాలను కవర్ చేయడంపై మీరు ఆద్యంతం నిషేధించిన వైఖరికి ఇది తాజా ఉదాహరణ మాత్రమే. బహుశా మీకు అధ్యక్షుడిగా నిర్ణయాలు తీసు కునే హక్కు ఉండవచ్చు. అయితే.. ప్రెస్‌తో ఎలా వ్యవహ రించాలనే అంశంపై విధివిధానాలను నిర్ణయించుకోవడా నికి మీకు పూర్తి హక్కు ఉన్నట్లే మాకు కూడా కొన్ని హక్కు లున్నాయి. మా ప్రసారాలను, వార్తాకాలమ్లను ప్రభా వితం చేయాలని మీరు భావిస్తుండవచ్చు. కానీ మా పాఠ కులకు, శ్రోతలకు, వీక్షకులకు ఎంత ఉత్తమంగా సేవలం దించాలో మేం నిర్ణయించుకుంటాం. ఆ పని మీది కాదు. మీ పాలనను పరిశీలించే అవకాశం విలేకరులకు ఇవ్వాలా లేదా అనేది మీరు నిర్ణయించుకోవచ్చు. కానీ సమాచారాన్ని ప్రత్యామ్నాయ మార్గాల్లో పొందడంలో మాకు విశేష అనుభవం ఉందని మీరు గుర్తించాలి. ఆఫ్‌ది రికార్డుగా చెబుతున్నాం. వార్తల విషయంలో ప్రా«థమిక సూత్రాలను నిర్దేశించాల్సింది మేమే తప్ప అది మీ బాధ్యత కాదు. అది మా ఎంపిక మాత్రమే. మీ నిబం ధనలకు అంగీకరించని విలేకరులను సాగనంపుతానని మీరు భావిస్తుంటే మాత్రం, అది జరగని పని. మమ్మల్ని మీరు బయటకు పంపినప్పటికీ మీ అభిప్రాయాలను సేకరించడానికి మేం ప్రయత్నిస్తూనే ఉంటాము. కానీ సత్యాన్ని పదే పదే వక్రీకరిస్తున్న, లొంగ దీసుకుంటున్న వ్యక్తులకు మా ప్రసారాలను, వార్తా కాల మ్‌లను కట్టబెడతామని దీనర్థంకాదు. రాజకీయ రంగంలో మీడియా పట్ల అవిశ్వాసాన్ని తీవ్రస్థాయిలో ప్రచారం చేసిన ఘనత మీదేనని గుర్తి స్తున్నాం. కానీ దాన్ని మేమొక ముందస్తు హెచ్చరికగా తీసుకుంటాం. మా పట్ల విశ్వాసాన్ని తిరిగి పొందుతాం. మా తప్పుల్ని గుర్తించడం ద్వారా, మాకు మేము నిర్దేశిం చుకున్న నైతిక ప్రమాణాలకు కట్టుబడటం ద్వారా కచ్చిత మైన రిపోర్టింగ్ ద్వారా మేం ముందుకు వస్తాం. మీరు మమ్మల్ని ఇన్నాళ్లుగా విభజించడానికి ప్రయ త్నించారు. ఆ రోజులు గతించాయి. మీ వార్తలను కవర్ చేయడంలో ఉన్న సవాలును ఎదుర్కొనడానికి వీలైన చోటల్లా మేం పరస్పరం సహకరించుకుంటాం. ఇకపై మీరు ఇష్టపడని అంశాలను ప్రస్తావించిన రిపోర్టర్ని నోరు మూయించడానికి ప్రయత్నిస్తే మీరొక ఐక్య సంఘటననే ఎదుర్కొనాల్సి వస్తుంది. వార్తల్లో నీతి లేదా న్యాయమైన వ్యాఖ్యల గురించి మాలో మాకు విభేదాలు ఉండవచ్చు. చర్చలు జరగవచ్చు కాని ఆ చర్చలను ప్రారంభించా ల్సిందీ, ముగించాల్సిందీ కూడా మేమేనని మర్చిపోవద్దు. చివరిగా.. మేం దీర్ఘకాలం నుంచి ఈ క్రీడను ఆడు తున్నాం. మీరు మీ పనిలో మరో 8 ఏళ్లు కొనసాగవచ్చు. కాని మేం మాత్రం అమెరికన్ రిపబ్లిక్ స్థాపన నాటి నుంచి ఇక్కడే ఉన్నాం. ఈ మహత్తర ప్రజాస్వామ్యంలో మా పాత్రను పదేపదే స్థిరపర్చుకున్నాం. మేం ఎవరం, ఎందుకు ఇక్కడ ఉన్నాం అనే మౌలిక ప్రశ్నల గురించి ఆలోచించుకునేలా మీరు మమ్మల్ని ఒత్తిడికి గురిచేశారు. అందుకు మీకు మేం కృతజ్ఞులమై ఉంటాం. వైట్ హౌస్ ప్రెస్ కోర్ -
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
సాన్ డియాగో: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. సాన్ డియాగో లో ఓ దుండగుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డినట్లు యూఎస్ మీడియా వెల్లడించింది. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలియాల్సి ఉంది. మరోవైపు దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని.. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సాన్ డియాగో పోలీసులు సూచించారు. BREAKING: Two #SDPD Officers have been shot tonight. Their condition is unknown. Keep them in your prayers — San Diego Police (@SanDiegoPD) 29 July 2016 -
అమెరికా మీడియాపై ట్రంప్ ఫైర్
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నోటికి పదును పెట్టాడు. అమెరికా మీడియా అగౌరవంగా వ్యవహరిస్తోందని తిట్టిపోశాడు. టీవీ జర్నలిస్టులు అనైతికంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డాడు. 'దినపత్రికలు రోజూ అపకీర్తికరమైన కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇవన్నీ తప్పుడు కథనాలని ప్రజలకు తెలుసు. మీడియాపై దాడి చేస్తూనే ఉంటాన'ని 69 ఏళ్ల ట్రంప్ పునరుద్ఘాటించారు. న్యూయార్క్ లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా మీడియా కథనాలు ప్రచారం చేస్తోందని వాపోయారు. మీడియా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. వృద్ధుల సంక్షేమం కోసం జనవరిలో ఐయోవాలో ఒకరాత్రిలో ఆరు మిలియన్ డాలర్లు సేకరించానని ట్రంప్ చెప్పుకోవడంతో దీన్ని ప్రశ్నిస్తూ మీడియా విమర్శనాత్మక కథనాలు ప్రచారం చేసింది. మీడియాలో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా పట్టించుకోనని అన్నారు. కాగా, మీడియాపై ట్రంప్ వ్యాఖ్యలను వైట్ హౌస్ కరస్పాండెంట్ అసోసియేషన్(డబ్ల్యూసీఏ) ఖండించింది. -
కలాంకు అమెరికా మీడియా ఘన నివాళి
వాషింగ్టన్: భారత్ అణు సామర్థ్య దేశంగా ఎదగడానికి కృషిచేసిన కీలక వ్యక్తుల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఒకరని అమెరికా మీడియా ప్రశంసించింది. 'మ్యాన్ ఆఫ్ మిసైల్' అబ్దుల్ కలాం మృతికి సంతాపం తెలియజేస్తూ ప్రత్యేక కథనాలను ప్రచురించింది. అణు, అంతరిక్ష రంగాల్లో భారత్ ఎదగడానికి కలాం విశేష సేవలందించారని కొనియాడింది. రక్షణ రంగంలో భారత్ శక్తిమంతమైన దేశంగా ఎదగడానికి కలాం ఎంతో తోడ్పడ్డారని ద న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. బయటి శక్తుల నుంచి ముప్పు వాటిల్లకుండా భారత్ బలమైన దేశంగా ఎదగడానికి కలాం పరిశోధనలు ఉపయోగపడ్డాయని వెల్లడించింది. విదేశీ సాయం లేకుండా భారత్ సొంతంగా అణుబాంబులు తయారు చేయగల నైపుణ్యం సాధించిందని ద న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. అణ్వాయుధాలను తీసుకెళ్లగల పృథ్వి, అగ్ని వంటి బాలిస్టిక్ క్షిపణులను రూపొందించడం ద్వారా కలాం భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేశారని వాషింగ్టన్ పోస్ట్ ప్రశంసించింది. 1998లో భారత్ నిర్వహించిన అణుపరీక్షల్లో కలాం కీలక పాత్ర పోషించారని పేర్కొంది. భారత అంతరిక్ష, క్షిపణి రంగాల పటిష్టతకు కలాం విశేష సేవలందించారంటూ ద వాల్ స్ట్రీట్ జర్నల్ నివాళులు అర్పించింది. -
రండి.. ప్రపంచాన్ని జయిద్దాం..!
-
అమెరికా ఏమంటోంది?
ఒకప్పుడు తమ దేశంలోకి ప్రవేశం కూడా కుదరదన్న అమెరికా.. ఇప్పుడు భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్రమోడీ విషయంలో ఎలా స్పందిస్తోంది? తన సొంత పార్టీకే తిరుగులేని మెజారిటీ సాధించినా కూడా, కూటమి ధర్మాన్ని అనుసరించి మిత్ర పక్షాల సభ్యులకు కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించిన నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారాన్ని అమెరికా పత్రికలు ఘనంగానే కవర్ చేశాయి. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులకు కేటాయించిన శాఖలపై కూడా తమ తమ విశ్లేషణలు అందించాయి. ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ ఎంపికను శ్లాఘించాయి. అయితే, కొన్ని పత్రికలు మాత్రం తమకు స్వతస్సిద్ధంగా ఉన్న ద్వేషాన్ని శీర్షికలలో కూడా ప్రతిబింబించాయి. 'భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన హిందూ జాతీయవాది నరేంద్రమోడీ' అంటూ వాషింగ్టన్ పోస్ట్ తన బుద్ధిని మరోసారి ప్రకటించుకుంది. 'మోడీకి సమర్థ సేనాని భారత కొత్త ఆర్థిక మంత్రి' అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక మంత్రుల ఎంపికపై కూడా విశ్లేషణ ఇచ్చింది. వాల్‌స్ట్రీట్ జర్నల్ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా.. నేరుగా 'భారత ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం' అనేసింది. అన్నిపత్రికల కంటే లాస్ ఏంజెలిస్ టైమ్స్ మాత్రం, మోడీపై తన అభిమానాన్ని చాటుకుంది. భవిష్యత్తులో భారత అధినేతతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఒబామాకు ఉంటుందని గతంలోనే రాసిన ఈ పత్రిక.. 'మార్పునకు ముందడుగు.. భారత ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం' అని శీర్షిక పెట్టి, భారీ ఫొటోను కూడా ఉపయోగించింది.